...
...
Next Story

Illu Illalu Pillalu April 30 Episode: భాగ్యం ఇక మారదు- రామరాజు ఇంట్లో ఆస్తి రచ్చ-వల్లి కడుపులో బిడ్డ లేదన్న ఇడ్లీ బాబాయ్

Illu Illalu Pillalu April 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 30 ఎపిసోడ్ లో కామాక్షి రచ్చ చేసేలా భాగ్యం కుట్ర చేస్తుంది. కామాక్షిని వేదవతి కొడుతుంది. ఆస్తిలో వాటా అడగమని ధీరజ్ కు సాగర్ చెప్తాడు. ఇడ్లీ బాబాయ్ నిజం చెప్పకుండా భాగ్యం ఆపుతుంది. భాగ్యంపై నర్మదకు డౌట్ వస్తుంది.

Published on: Apr 30, 2026, 07:58:51 IST
Advertisement

Illu Illalu Pillalu April 30 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ లో శ్రీవల్లి ప్రెగ్నెన్సీ అబద్ధం గురించి అందరికీ చెప్పేయాలని ఇడ్లీ బాబాయ్ తెగ ట్రై చేస్తాడు. మరోవైపు ఆస్తిలో వాటాల కోసం సాగర్ తో మాట్లాడిన ప్రసాద్ రావు పుల్లలు పెడతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఏప్రిల్ 30 ఎపిసోడ్ లో చూసేయండి.

భాగ్యం కుట్ర

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ఫుల్ గా తాగేసిన ఇడ్లీ బాబాయ్ గట్టిగా అరుస్తాడు. కొన్ని అరాచకాలు చూసి తట్టుకోలేకపోతున్నా. కొన్ని విషయాలు కడుపులో దాచుకోలేకపోతున్నానని ఇడ్లీ బాబాయ్ అంటాడు. తన భర్తను భాగ్యం పక్కకు తీసుకెళ్తుంది. ఏమైందో చెప్పమని రామరాజు అడుగుతాడు. అప్పుడే నీ భర్తతో ధీరజ్ సంతకాలు పెట్టించుకుంటున్నాడని కామాక్షికి భాగ్యం చెప్తుంది.

కామాక్షి రచ్చ

భాస్కర్ సంతకాలు పెట్టిన ష్యూరిటీ పేపర్లను కామాక్షి తీసుకొని నానా రచ్చ చేస్తుంది. ధీరజ్ కారు కొనడం కోసం మా ఆయన్ని మాయ చేసి ష్యూరిటీ సంతకాలు పెట్టించుకుంటున్నాడని కామాక్షి రచ్చ చేస్తుంది. మా ఆయనతో దొంగతనంగా సంతకాలు చేయించుకోవడం కోసమేనా నన్ను ప్రేమగా రమ్మని పిలిచిందని కామాక్షి గొడవ చేస్తుంది.

మోసాలు చేస్తూ

ఆ నడిపోడు వనజ వాళ్ల డబ్బులతో దొంగచాటుగా ఉద్యోగం కొనుక్కున్నట్లు, నువ్వు కూడా దొంగచాటుగా మోసాలు మొదలు పెట్టావన్న మాట అని ధీరజ్ తో కామాక్షి అంటుంది. మా ఆయన్ని దొంగ అంటే బాగోదని ప్రేమ మధ్యలోకి వస్తుంది. అమూల్య విషయంలో చేసిన దానికి నువ్వు మాట్లాడే అర్హత లేదని కామాక్షి ఫైర్ అవుతుంది. అమూల్య విషయంలో జరిగిందేంటో నీకు తెలీదు అక్క అని ధీరజ్ చెప్తున్నా కామాక్షి వినదు.

లాగి పెట్టి కొట్టిన వేదవతి

భర్తను లాక్కొని కామాక్షి వెళ్లిపోతుంది. నన్ను తలదించుకొనే పనులే చేస్తారా? అని రామరాజు ఫీల్ అవుతాడు. మీ అక్క ఎంత గయ్యాళితో తెలిసి కూడా, బావ ష్యూరిటీ ఎందుకు అడిగావ్? నాన్న డబ్బులిస్తానంటే తీసుకోవచ్చు కదా అని వేదవతి అంటుంది. నాన్న దగ్గర తీసుకోవచ్చు కదా అని నర్మద కూడా చెప్తుంది. నాన్న కష్టార్జితాన్ని తీసుకునే హక్కు నాకు లేదు. ఇదంతా నాన్న సంపాదించింది. ఇందులో నాకు హక్కు ఎలా ఉంటుందని ధీరజ్ అంటాడు.

ఆస్తిలో వాటా

అప్పుడే సాగర్ ను ప్రసాద్ రావు ఉసిగొల్పుతాడు. కొడుకులుగా ఇది మన ఆస్తి. మనకు సర్వ హక్కులున్నాయి. ఈ ఆస్తిలో నీ వాటా మొత్తం తీసుకో. అప్పుడు కారు షోరూమే పెట్టుకోవచ్చని ధీరజ్ తో సాగర్ అంటున్నాడు. వాటాలు అంటున్నావేంట్రా కొత్తగా, అంటే నీ వాటాను నీకు పంచివ్వమని అడుగుతావా? అని రామరాజు ప్రశ్నిస్తాడు.

ప్రసాద్ ఆజ్యం

తండ్రి ఆస్తిని కొడుకులకు పంచివ్వడం అన్ని కుటుంబాల్లో ఉన్నదే కదా. ఆస్తిలో వాటా ఇవ్వకుండా పిల్లలకు అన్యాయం చేయాలనుకుంటున్నారా? అని ప్రసాద్ మరింత ఆజ్యం పోస్తాడు. నా పిల్లలు నాకు ప్రాణం. జోక్యం చేసుకోకుండా ఉంటే మీకే మంచిదని రామరాజు సీరియస్ గానే చెప్తాడు. నాన్నను తప్పుపడుతూ నర్మద మాట్లాడుతుంది.

చిన్నోడా, నేను మాట్లాడింది తప్పా చెప్పురా అని ధీరజ్ ను సాగర్ అడుగుతాడు. అన్నయ్య ఇంకోసారి నాన్న ముందు గొంతు పెంచి మాట్లాడకు. మరోసారి ఆస్తి పంపకాలు అని మాట్లాడకు. నాన్న లాగే నేను కష్టపడి డెవలప్ అవాలనుకుంటున్నా. అది పర్సనల్ విషయం. దాని గురించి మాట్లాడకండి. ఇంట్లో సంతోషాలను దూరం చేయకండని ధీరజ్ లోపలికి వెళ్లిపోతాడు.

శీవల్లి గర్భం

రామరాజు, వేదవతి తెగ ఫీల్ అయిపోతారు. మద్యం మత్తులో ఓ సంచిని పట్టుకుని రామరాజు అనుకొని తన కూతురు శ్రీవల్లి గర్భం విషయం అబద్ధమని ఇడ్లీ బాబాయ్ చెప్తాడు. కామాక్షితో చిచ్చు పెట్టించా కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఏం చేసేవాడివోనని ఇడ్లీ బాబాయ్ కు భాగ్యం మొట్టికాయలు వేస్తుంది. ఇప్పుడు నిజం చెప్తే మనకే మంచిదని ఇడ్లీ అంటాడు. భర్తను లాక్కొని భాగ్యం వెళ్తుంది.

నర్మదకు డౌట్

అప్పుడే నర్మద వస్తుంది. భాగ్యం, ఇడ్లీ బాబాయ్ పై నర్మదకు అనుమానం వస్తుంది. ఇందాక జరిగిన గొడవకు మీరే కారణమని నాకు డౌట్ గా ఉందని నర్మద అంటుంది. గతంలో తప్పులు చేశాం కాబట్టి ఇప్పుడు డౌటింగ్ వస్తుంది. కానీ ఇందులో మా ప్రమేయం ఎలా ఉంటుందని భాగ్యం అడుగుతుంది. మీ దొంగ మాటలు నేను నమ్మనని నర్మద అంటుంది.

కామాక్షి, సాగర్ మాటలు తలుచుకుని ధీరజ్ ఫీల్ అవుతుంటాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe