...
...
Next Story

Illu Illalu Pillalu August 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. ఏంటి ప్రేమ ఇంత మూర్ఖత్వమా? ముఖం కూాడా చూడను- ధీరజ్ ఆవేశం

Illu Illalu Pillalu August 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. ప్రేమ చేతిపై కళ్యాణ్ అని పేరు రాసిన భద్రావతి కుట్రకు ప్రేమ, ధీరజ్ బలైపోతారు. ప్రేమ ముఖం కూడా చూడనని ధీరజ్ కోప్పడతాడు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

Published on: Aug 18, 2026, 07:34:25 IST
Advertisement

Illu Illalu Pillalu August 18 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈ రోజు ఎపిసోడ్ లో.. ధీరజ్ రాత్రి వచ్చి ప్రేమకు గోరింటాకు పెట్టి వెళ్తాడు. కానీ భద్రావతి ఏమో ప్రేమ చేతి మీద కళ్యాణ్ అనే పేరు రాసి కొత్త కుట్రకు తెరతీస్తుంది. ఇది తెలియని ప్రేమ ఏమో ధీరజ్ పై కోపంతో ఊగిపోతుంది. రాత్రి ధీరజ్ వెళ్లిన తర్వాత తాను కళ్యాణ్ అని పేరు రాసిన విషయాన్ని భద్రావతి తలుచుకుని సైకో ఆనందం పొందుతుంది.

రెచ్చగొట్టిన భద్రావతి

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

భార్య అంటే ఎక్కడ లేేని ప్రేమ అని అన్నారు కదా. మరి దీన్ని ఏమంటారు? అని ప్రేమను భద్రావతి మరింత రెచ్చగొడుతుంది. భద్రావతి ఆ అబ్బాయి ఇలా చేయడు అని తల్లి చెప్పినా భద్రావతి మాత్రం ఇంకా ప్రేమను రెచ్చగొడుతుంది. కళ్యాణ్ అనే వాడి పేరు అడ్డుపెట్టుకుని ప్రేమను బాధపెట్టడమే పనిగా పెట్టుకున్నాడు అని భద్రావతి అంటుంది.

ప్రేమ కోపం

ప్రేమ కోపంగా బయటకు వెళ్తుంది. ధీరజ్ అని గట్టిగా పిలుస్తుంది. దమ్ము, ధైర్యం ఉంటే బయటకు రా అని అరుస్తుంది. రేయ్, ధీరజ్ గా అని ప్రేమ అంటే.. ధీరజ్ నవ్వుతాడు. నీ ఒంట్లోకి భద్రావతి పూనిందా? మీ అత్త కూడా ఇలాగే ఎగురుకుంటూ వచ్చి రామరాజు అని పిలిచేది. నీకు మొత్తం మీ అత్త బుద్ధులు వచ్చాయని ధీరజ్ నవ్వుకుంటాడు.

ధీమా అని రాశా

అప్పుడే వేదవతి, నర్మద కూడా బయటకు వస్తారు. ప్రేమ ఎందుకు ఇంత కోపంగా ఉన్నావని వేదవతి అడుగుతుంది. ప్రేమ ఏమైనా ఉంటే నాతో చెప్పు నేను మాట్లాడతానని నర్మద అంటుంది. నేను వీడితోనే మాట్లాడాలి. నేనే తేల్చుకోవాలని ఏడుస్తూ గోరింటాకు నువ్వే పెట్టావా? అని ప్రేమ అడుగుతుంది. ధీమా అని పేరు రాసింది నేనేనని ధీరజ్ చెప్తాడు.

ధీరజ్ బిల్డప్

ఇది కోపం కాదు. నీ మీద ఆకాశం అంత ప్రేమ అని ధీరజ్ అంటాడు. మరి ఇది అని కళ్యాణ్ పేరును ప్రేమ చూపించగానే ధీరజ్, వేదవతి, నర్మద షాక్ అవుతారు. నా మీద నీకు ఆకాశమంతా ప్రేమ ఉంటే ఆ వెధవ కళ్యాణ్ పేరు ఎందుకు రాస్తావ్? అని ప్రేమ అడుగుతుంది. ఆ పేరు నేనెందుకు రాస్తా? నాకే షాకింగ్ గా ఉంది. మా అమ్మ మీద ఒట్టు నేను రాయలేదని ధీరజ్ చెప్తే ప్రేమ వినదు.

అమ్మంటే ధీరజ్ కు ఎంత ప్రేమో నీకు కూడా తెలుసు. కచ్చితంగా ఇది ధీరజ్ చేసిన పని కాదు అని నర్మద చెప్పినా కూడా ప్రేమ కఠినంగానే వ్యవహరిస్తుంది. నిన్ను బాధపెట్టేలా వీడు ఎప్పుడూ ప్రవర్తించడు. కచ్చితంగా ఇది ఎవరో కావాలనే చేసి ఉంటారని వేదవతి అంటుంది.

ప్రేమ ఫైర్

అప్పుడే బయటకు వచ్చిన భద్రావతి ప్రేమను ఇండైరెక్ట్ గా రెచ్చగొడుతుంది. తెలిసి తెలియక చేశాడేమో వదిలేయమని భద్రావతి అంటుంది. ఇది కచ్చితంగా నువ్వే చేసి ఉంటావని భద్రావతితో ధీరజ్ అంటాడు. నువ్వు చేసి మా అత్తను అంటావేంటీ అని ప్రేమ ఫైర్ అవుతుంది. నేను చేయలేదు. నీ కంట్లో కన్నీరు వచ్చేలా చేయనని ధీరజ్ ప్రేమతో చెప్తాడు.

ధీరజ్ కోపం

ఒకప్పుడు నిన్ను ఎంతో ప్రేమగా నమ్మా. కానీ కళ్యాణ్ గురించి బయటపెట్టినప్పుడే నమ్మకం పోయిందని ప్రేమ ఫీల్ అవుతుంది. నేను ఆ పేరు రాయను. ప్రాణం పోయినా ఆ పని చేయను. నీ కళ్లు మూర్ఖత్వంతో మూసుకుపోయాయి. అర్థం చేసుకోకుండా ఆలోచించే బుర్ర నీది అని ధీరజ్ కూడా కోప్పడతాడు.

నువ్వు నాకు వద్దు

నేను మాట్లాడినదాంట్లో తప్పేం ఉంది. నువ్వు చేసిందే కదా నేను మాట్లాడా. నా మాటల వల్ల బాధపడ్డావని వందలసార్లు క్షమాపణ చెప్పా. ఇంటికి తీసుకురావాలని భరించా. కానీ చేయని తప్పునకు కూడా ఇలా మాట్లాడుతుంటే ఇంకా సహించాలా అని ధీరజ్ ఆవేశంతో ఊగిపోతాడు.

వీడికి నా మీద ప్రేమ లేదు. మా కుటుంబం మీద పగ మాత్రమే ఉంది అని ప్రేమ షాకింగ్ మాటలు అంటుంది. పగ ఉంటే ఈ 8 నెలలు నిన్ను కళ్లల్లో పెట్టి చూసుకునేవాడిని కాదు. నువ్వెప్పటికీ నన్ను అర్థం చేసుకోవని అర్థమైపోయింది. నువ్వు నాకు వద్దు. ఈ రోజు నుంచి నీ ముఖం కూడా చూడను. ఈ క్షణం నుంచి నువ్వెవరో నేనెవరో. గుడ్ బై అని ధీరజ్ చెప్పేసి ఇంట్లోకి వెళ్లిపోతాడు.

ప్రేమ వాడేదో కోపంలో మాట్లాడాడని వేదవతి చెప్తుండగా ప్రేమను భద్రావతి ఇంట్లోకి తీసుకెళ్తుంది. గదిలోకి వెళ్లి ధీరజ్ మాటలను తలుచుకుని ప్రేమ ఎమోషనల్ అవుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe