Illu Illalu Pillalu August 26 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. చేతిలో రాయి పట్టుకుని, కోపంతో ఊగిపోతూ ధీరజ్ అని గట్టిగట్టిగా అరుస్తుంది ప్రేమ. ఏమైంది ప్రేమ అని వేదవతి, నర్మద అడుగుతారు. మాటల్లేవ్, మాట్లాడుకోవటాల్లేవ్ ఓన్లీ రణరంగమే అని ప్రేమ అంటుంది.
ప్రేమ సీరియస్

నువ్వు ఇంత సీరియస్ గా అంటున్నా పిచ్చ కామెడీగా అనిపిస్తోందని ప్రేమను చూసి నర్మద, వేదవతి నవ్వుకుంటారు. అంటే అన్నానంటారు కానీ ఎలుక పిల్ల తొడ కొడుతున్నట్లు అనిపిస్తోందని వేదవతి అంటుంది. అత్త జోక్ లు వద్దు. ఈ రోజు వాడి తల పగలగొట్టకపోతే పేరు మార్చుకుంటానని ప్రేమ సీరియస్ గా చెప్తుంది.
ముగ్ధతో ఫ్లర్టింగ్
పేరు మార్చుకోవడం ఎందుకు? ప్రేమ అందమైన పేరు. బాగుంది కదా అని నర్మద అంటుంది. ధీరజ్ ఇంట్లో లేడని నర్మద చెప్తుంది. ఇంకా వాడు రాలేదా? ఇంకా దాని బండి మీద తిరుగుతున్నాడా? ముగ్ధతో లాంగ్ రైడ్ కు వెళ్లినట్లున్నాడు. ఫ్లర్టింగ్ రాజా కదా అని ప్రేమ అంటుంది. ముగ్ధ ఎవరని వేదవతి అడిగితే.. నీ ముద్దుల రత్నం కొత్త గర్ల్ ఫ్రెండ్ అని ప్రేమ జరిగిన విషయం చెప్తుంది.
చిన్నోడిపై ప్రేమ
వెంటనే వేదవతి, నర్మద నవ్వేస్తారు. వాళ్లను చూసి శ్రీవల్లి కూడా నవ్వాలని నవ్వుతుంది. వల్లిని చూసి ప్రేమ ఫైర్ అవుతుంది. మీ పుత్ర రత్నం వెలగబెడుతున్న రాచకార్యాల గురించి చెప్తే బుద్ధి చెప్తారనుకున్నా కానీ నవ్వుతారేంటీ అని ప్రేమ అడుగుతుంది. చిన్నోడు అలాంటోడు కాదే అని వేదవతి చెప్తుంది. చిన్నోడు అంటే ప్రేమ కదా అందుకే వెధవ వేషాలు వేసినా వెనకేసుకొని వస్తున్నావని ప్రేమ అంటుంది.
ఇది జెలసీ
దీన్నే జెలసీ అంటారు. మొగుడు పరాయి అమ్మాయితో మాట్లాడితే చాలు అనుమానం ఇలా బుసలు కొడుతుంది. ఇంత ప్రేమ ఉన్నదానివి మొగుడికి ఎందుకు దూరంగా ఉండాలి. కలిసిపోయి కొంటె కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని నర్మద చెప్తుంది. రాయితో కొట్టడం కాదు, కన్నుతో కొడితే చాలు వాడు నీ వెనుకాలే తిరుగుతాడని వేదవతి కూడా చెప్తుంది.
వల్లికి చెంపదెబ్బలు
{{/usCountry}}దీన్నే జెలసీ అంటారు. మొగుడు పరాయి అమ్మాయితో మాట్లాడితే చాలు అనుమానం ఇలా బుసలు కొడుతుంది. ఇంత ప్రేమ ఉన్నదానివి మొగుడికి ఎందుకు దూరంగా ఉండాలి. కలిసిపోయి కొంటె కబుర్లు చెప్పుకోవచ్చు కదా అని నర్మద చెప్తుంది. రాయితో కొట్టడం కాదు, కన్నుతో కొడితే చాలు వాడు నీ వెనుకాలే తిరుగుతాడని వేదవతి కూడా చెప్తుంది.
వల్లికి చెంపదెబ్బలు
{{/usCountry}}అప్పుడు ప్రేమ ఆలోచనలో పడుతుంది. దీంతో ప్రేమ మనసు మార్చుకుని మళ్లీ ఇంట్లోకి వస్తుందా అని బల్లక్కాయ్ టెన్షన్ పడుతుంది. ధీరజ్ ను వద్దనుకుని వెళ్లిపోయావ్. ధీరజ్ కూడా నీ ముఖం చూడనన్నాడు. మరి ధీరజ్ గురించి నీకెందుకు అని రెచ్చగొట్టేలా వల్లి మాట్లాడుతుంది. వెంటనే ప్రేమ కోపంతో వల్లి చెంపపై కొడుతుంది.
వేదవతి కూడా
నా మొగుడి గురించి నేను కాకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? ఎన్ని గొడవలైనా, ఎంత దూరంగా ఉన్నా మేం ఎప్పటికైనా కలిసేవాళ్లమే. మా మధ్యలో దూరావో జాగ్రత్త అని వల్లికి వార్నింగ్ ఇచ్చి ప్రేమ వెళ్లిపోతుంది. అసలు ప్రేమ, ధీరజ్ లు కలవాలనుకుంటున్నారా? విడిపోవాలనుకుంటున్నారా? అని వల్లి అనగానే వేదవతి కూడా చెంపపై పీకుతుంది.
అమూల్యకు ప్రపోజ్ చేసిన విశ్వ
మరోవైపు అమూల్యకు ఐ లవ్యూ అని విశ్వ ప్రపోజ్ చేస్తాడు. కోపంతో విశ్వ చెంపపై అమూల్య కొడుతుంది. నువ్వు కొట్టినా, చంపినా నా ప్రేమ నిజం. నేను చచ్చేంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. అపార్థాలు, గొడవలు సహజం. కానీ వాటి కోసం ప్రేమను వదిలేయలేం. జరిగిన వాటిని మర్చిపోదాం. మన ప్రేమను గెలిపించుకుందాం. ఐ లవ్యూ అమూల్య అని విశ్వ మళ్లీ చెప్తాడు.
విశ్వ కవరింగ్
నీ మీద మొదటి నుంచి డౌట్ ఉంది. రెండు కుటుంబాలను కలుపుదామని చెప్పావ్. ఇప్పుడే మా అన్నయ్యలకు కాల్ చేస్తానని అమూల్య అంటుంది. వెంటనే విశ్వ ప్లేటు ఫిరాయిస్తాడు. ఇవన్నీ త్వరలోనే మా చెల్లి మీ అన్నయ్యకు చెప్పే మాటలు. మా చెల్లెలిని బ్రైన్ వాష్ చేశా. మా చెల్లి ఈ మాటలు మీ అన్నయ్యకు చెప్తుంది. దీంతో వాళ్లు కలిసిపోతారు. ఈ విషయమే పూర్తిగా చెప్పేలోపు కొట్టేశావని విశ్వ ఏదో కవర్ చేస్తాడు.
తిరుపతి బర్త్ డే
రాత్రి తిరుపతి, సుక్కు వీడియో కాల్ లో మాట్లాడుకుంటారు. మన పెళ్లి జరగదని తేలిపోయింది. అందుకే ఊరు వదిలి వెళ్లిపోదామనుకుంటున్నా. మీ వేదవతి అక్క నన్ను బాదేస్తుంటే నువ్వు నిజం చెప్పావా? అని సుక్కు అడుగుతుంది. టైమ్ చూసి అందరినీ మన పెళ్లికి ఒప్పిస్తానని తిరుపతి చెప్తే సుక్కు కన్విన్స్ అవుతుంది. వీళ్లు ఫోన్లో మాట్లాడుకోవడం వల్లి చూస్తుంది. రేపు నాది బర్త్ డే అని సుక్కుకు వల్లి చెప్తాడు.
బల్లక్కాయ్ కుట్ర
రైస్ మిల్ నుంచి కొట్టేసిన రూ.6 లక్షలపై అనుమానం రాకుండా తప్పించుకునేందుకు తిరుపతి బర్త్ డేను బ్రహ్మాస్త్రంగా వాడుకోవచ్చని వల్లి మరో కుట్ర పన్నుతుంది. భద్రావతికి కాల్ చేసి రూ.6 లక్షల విలువైన బంగారు చైన్ కావాలని వల్లి అడుగుతుంది. అది కూడా మీ తమ్ముడు తిరుపతి కోసమని చెప్తుంది.
మీరు మీ చెల్లెలిని ఎలా ఇంటికి తీసుకురావాలి? రామరాజు మీద ఎలా పగ తీర్చుకోవాలని మాత్రమే చూశారు. ఇప్పుడు మేనకోడలు ప్రేమను ఎలా ఇంటికి తీసుకుపోవాలని మాత్రమే ఆలోచించారు. తిరుపతి మీ తమ్ముడని, అతను పాతికేళ్లుగా శత్రువు ఇంట్లో ఉండటం పరువు తక్కువ విషయమని మర్చిపోయారని భద్రావతిని వల్లి రెచ్చగొడుతుంది.
తిరుపతి బర్త్ డేను వాడుకొని చక్రం తిప్పుతానని వల్లి చెప్తుంది. రైస్ మిల్ లో కొట్టేసిన రూ.6 లక్షల విషయంలో తిరుపతిని బలి చేస్తానని వల్లి అనుకుంటుంది.
ఆలోచనలో నర్మద
మరోవైపు ఏం చేస్తే ధీరజ్, ప్రేమలు కలుస్తారని నర్మద ఆలోచిస్తుంటుంది. సాగర్ పిలిచినా వినిపించుకోదు. దేని గురించి ఆలోచిస్తున్నావని సాగర్ అడుగుతాడు. ధీరజ్, ప్రేమల గురించి ఆలోచిస్తున్నా. వాళ్లను కలపాలని లేదా అని నర్మద అడుగుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.