...
...
Next Story

Illu Illalu Pillalu August 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్ కన్నింగ్ ప్లాన్-తిరుపతికి భద్రావతి గోల్డ్ చైన్

Illu Illalu Pillalu August 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఆగస్టు 28 ఎపిసోడ్ లో తిరుపతిపై అనుమానం వచ్చేలా చందు దగ్గర మంటపెడుతుంది వల్లి. మరోవైపు తిరుపతికి గోల్డ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చి కుట్రకు తెరతీస్తుంది భద్రావతి. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Aug 28, 2026, 08:02:04 IST
Advertisement

Illu Illalu Pillalu August 28 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రైస్ మిల్ లో పోయిన రూ.6 లక్షల గురించి నిద్రపోకుండా చందు ఆలోచిస్తుంటాడు. ఇంకోసారి తిరుపతి మీద డౌటింగ్ వచ్చేలా చేద్దామనుకొని చందుతో శ్రీవల్లి మాట్లాడుతుంది.

వల్లి డ్రామా

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

రూ.6 లక్షల గురించేనా ఈ టెన్షన్. నువ్వు నన్ను భార్యగా చూడలేకపోవచ్చు. కానీ నా భర్త టెన్షన్ పడుతుంటే నేను చూడలేను. చేయని తప్పునకు మీ నాన్న ముందు దోషిలా నిలబడతావా? అయినా డబ్బులు కొట్టేసినోళ్లు బాగానే ఉన్నారు. ఏ పాపం తెలియని మా ఆయన టెన్షన్ పడుతున్నాడని శ్రీవల్లి అంటుంది.

తిరుపతి దోషి

ఎవరి గురించి మాట్లాడుతున్నావని చందు అడుగుతాడు. మీ తిరుపతి మామయ్య గురించే అని బల్లక్కాయ్ చెప్పేసరికి చందుకు కోపమొస్తుంది. ఇంకోసారి మా మామయ్య గురించి తప్పుగా మాట్లాడితే చెంప పగలగొడతానని చందు వార్నింగ్ ఇస్తాడు. అయినా కూడా తిరుపతిని దోషిని చేసేలా వల్లి మాట్లాడుతుంది.

ఒకవేళ పోతే తిరుపతి బాబాయ్ వసూలు చేసుకొని వచ్చిన డబ్బు మొత్తం పోవాలి. కానీ రూ.6 లక్షలే ఎందుకు పోతాయి? దొంగలు కొట్టేస్తే మొత్తం డబ్బు తీసుకోవాలి కదా. రైస్ మిల్ కు రావడానికి ముందే ఆ డబ్బు మాయం అయిందని వల్లి చెప్పడంతో చందు ఆలోచనలో పడతాడు. వల్లి హాయిగా పడుకుంటుంది.

హ్యాపీ బర్త్ డే మామ

హ్యాపీ బర్త్ డే మామా అంటూ తిరుపతిని రెడీ చేస్తారు. వేదవతి పూజ చేస్తుంది. అక్క దగ్గర తిరుపతి ఆశీర్వాదం తీసుకుంటాడు. అందరూ హ్యాపీ బర్త్ డే విషెస్ చెప్తారు. మామయ్య ఇలా జీవితాంతం పుట్టిన రోజులే జరుపుకొంటావా? పెళ్లి రోజు చేసుకోవాలనే ఆలోచన లేదా? అని అమూల్య అడుగుతుంది. చిన్నోడు తలుచుకుంటే రెండు రోజుల్లో నా పెళ్లి అయిపోతుందని ధీరజ్ ను తిరుపతి ఇరికిస్తాడు.

తిరుపతి ఎమోషనల్

అమ్మాయి ఆల్రెడీ ఉంది కదా అని తిరుపతి నోరు జారుతాడు. పాయసం తిందామని కవర్ చేస్తాడు. అందరూ పాయసం తింటారు. సుక్కు గురించి చెప్పమని తిరుపతికి వల్లి సైగలు చేస్తుంది. ఈ ఇంటితో నాకు పాతికేళ్ల అనుబంధం ఉంది. నాకెప్పుడూ అక్కవాళ్ల ఇంట్లో ఉన్నట్లు అనిపించదు. నేను నీ కడుపున పుట్టినట్లు, నా మేనల్లుళ్లు నాకు తమ్ముల్లలా అనిపిస్తారు అక్క అని తిరుపతి ఎమోషనల్ అవుతాడు.

అందుకే బావతో చాలా సార్లు ఇది నా ఇల్లు అని అన్నానని తిరుపతి అంటాడు. నువ్వు చెప్పింది కరెక్ట్ మామ. మనమెప్పుడూ ఇలాగే కలిసి ఉండాలని ధీరజ్ అంటాడు. ఎప్పుడూ ఇలాగే కలిసి ఉంటారా? మీ నాన్న ఇంటికి వచ్చాక అసలు బీభత్సం ఉంటుందని వల్లి అనుకుంటుంది.

పెళ్లి కోసం ఒట్టు

అప్పుడే చందుకు కాల్ వస్తుంది. ధాన్యం లారీలు వచ్చాయని చందు టెన్షన్ పడుతూ వెళ్లిపోతాడు. తిరుపతి వస్తానంటే వద్దంటాడు. ధీరజ్ ను బయటకు తీసుకెళ్లి మాట్లాడతాడు తిరుపతి. ఎలాగో నా పెళ్లి ప్రస్తావన వచ్చింది కదా. నేను, సుకన్య ప్రేమించుకుంటున్నామని చెప్తే అయిపోయేదని తిరుపతి అంటాడు. ఆ విషయం చెప్తే అమ్మ వీపు విమానం మోత మోగించేదని ధీరజ్ చెప్తాడు. సుకన్యకు, నాకు నువ్వే పెళ్లి చేయాలని ధీరజ్ చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఒట్టు వేయించుకుంటాడు తిరుపతి.

భద్రావతి కుట్ర

మరోవైపు తిరుపతిని రామరాజుకు దూరం చేసే కుట్రకు భద్రావతి తెరతీస్తుంది. తిరుపతిని రప్పించి హ్యాపీ బర్త్ డే అని చెప్తుంది. అక్కా, నా పుట్టిన రోజు గుర్తుందా అని తిరుపతి హ్యాపీగా అడుగుతాడు. నువ్వు నా తోడబుట్టిన తమ్ముడివి. నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావ్ తప్పా, మేమెప్పుడూ వద్దనుకోలేదని భద్రావతి మాయ మాటలు చెప్తుంది.

నీ బర్త్ డేకు అక్క ఇస్తున్న గిఫ్ట్ అని తిరుపతి మెడలో చైన్ వేస్తుంది భద్రావతి. ఎప్పుడూ లేనిది ఈ షాక్ లు, సర్ ప్రైజ్ లు ఏంటి అక్క అని తిరుపతి ఆశ్చర్యపోతాడు. అప్పుడే తిరుపతికి సుక్కు నుంచి కాల్ వస్తుంది. సుకుమార్ అని కవర్ చేస్తూ తిరుపతి వెళ్లిపోతాడు.

రాయి విసిరిన నర్మద

మరోవైపు ప్రేమ కోసం చూస్తుంటుంది నర్మద. బయటకు వచ్చి ధీరజ్ ను చూస్తే బాగుండనుకుంటుంది. రాయి తీసుకొని విసురుతుంది. దీంతో ఎవర్రా రాయి విసిరిందని ప్రేమ అరుస్తూ బయటకు వస్తుంది. ధీరజ్ వేశాడని నర్మద సైగలు చేస్తుంది. కోపంతో కిందకు వచ్చిన ప్రేమ రాయితో ధీరజ్ ను కొడుతుంది.

రాయితో ఎందుకు కొట్టావని ధీరజ్ అడుగుతాడు. మొదట రాయి ఎవరు విసిరారు? అని ప్రేమ అడుగుతుంది. నువ్వో పెద్ద దేవకన్యవి అని నీకు లైన్ వేద్దామని రాయి విసిరానని ధీరజ్ వెటకారంగా చెప్తాడు. ముగ్ధకు లైన్ వేసిన టేస్ట్ లేని మనిషివి అని ప్రేమ అంటుంది. ముగ్ధ విషయం ఎందుకు తెస్తున్నావని ధీరజ్ కోప్పడతాడు.

ఒకరు రాయితో, మరొకరు పూల కుండీతో కొట్టుకోవాలని చూస్తారు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe