...
...
Next Story

Illu Illalu Pillalu July 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. రామరాజుకు మైండ్ బ్లాక్ షాక్ ఇచ్చిన అమూల్య- పగతో శ్రీవల్లి

Illu Illalu Pillalu July 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 10 ఎపిసోడ్ లో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. విశ్వక్ పై కేసును అమూల్య వాపస్ తీసుకుంటుంది. దీంతో రామరాజు మైండ్ బ్లాక్ అవుతుంది. మరోవైపు నర్మద, ప్రేమపై పగతో వల్లి ఊగిపోతుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ మీకోసం.

Published on: Jul 10, 2026, 09:45:32 IST
Advertisement

Illu Illalu Pillalu July 10 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 10 ఎపిసోడ్ లో తండ్రి రామరాజుకు కూతురు అమూల్య దిమ్మతిరిగే షాక్ ఇస్తుంది. కోర్టులో విశ్వకు శిక్ష ఖాయమైన సమయంలో కేసు వాపసు తీసుకుంటుంది. మరోవైపు నర్మద, ప్రేమపై పగతో వల్లి రగిలిపోతుంటుంది. పూర్తి ఎపిసోడ్ లో ఏమైందో చూసేయండి.

రగిలిపోతున్న వల్లి

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

వర్షంలో బట్టలు తీస్తున్న కోడళ్లు నర్మద, ప్రేమకు అత్త వేదవతి పరుగెత్తుకుంటూ వెళ్లి గొడుగు పడుతుంది. అది చూసి వర్షంలో తడుస్తున్న శ్రీవల్లి రగిలిపోతుంది. ఇప్పుడు ప్రేమతో గొడుగు పడతారు, ఆ తర్వాత కోపం వస్తే మాత్రం గయ్యాళి గంగమ్మలా చిందులు తొక్కుతారని నర్మద అంటుంది. పాత విషయాలను మనసులో పెట్టుకుని అత్తను కోడలు సాధిస్తుంది. నేను పెద్ద గడుసును అని వేదవతి అంటుంది.

ప్రేమపై ప్రేమ

గడుసు కాదు గయ్యాళి అని నర్మద అనగానే.. ఆమె చెవిని వేదవతి మెలిపెడుతుంది. అప్పుడు ఆ ముగ్గురూ నవ్వుకుంటారు. ఇదంతా చూసిన శ్రీవల్లికి మండిపోతుంది.

ఇక ఇంట్లోకి వెళ్లి బూజు దులుపుతున్న ప్రేమను చూసి ధీరజ్ నవ్వుకుంటాడు. ఇప్పటికీ అచ్చమైన పెళ్లాంలా ఉన్నావని ధీరజ్ అంటాడు. నువ్వే అచ్చమైన మొగుడిలా లేవు, లేదంటే డ్యాన్స్ కాంపిటీషన్ కు వెళ్తానంటే పంపించేవాడివని ప్రేమ అంటుంది.

ప్రేమ, ధీరజ్ రొమాన్స్

ధీరజ్ కూడా బూజు కర్ర పట్టుకుని దులుపుతానంటాడు. ఇదే ఛాన్స్ అని ప్రేమ, ధీరజ్ ఓ రొమాంటిక్ సాంగ్ వేసుకుంటారు. బూజు దులుపుతూనే రొమాంటిక్ గా స్టెప్పులు వేస్తారు. హమ్మయ్యా మొత్తం అయిపోయిందని ప్రేమ అంటుంది. ఇంకా ఆ ఫ్యాన్ ఉంది కదా, ఎత్తుకుంటానని ధీరజ్ అంటాడు. ప్రేమ కోప్పడేసరికి పారిపోతాడు.

కోర్టుకు ఫ్యామిలీ

విశ్వక్, అమూల్య ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో లేచిపోయి పెళ్లి చేసుకున్నారని విశ్వక్ తరపు న్యాయవాది వాదిస్తాడు. రామరాజు కుటుంబం మీద పగతో అమూల్యను విశ్వక్ ట్రాప్ చేశాడని రామరాజు తరపు న్యాయవాది కౌంటర్ ఇస్తాడు. ఏ ఆడపిల్ల అయినా కిడ్నాప్ చేసిన వాడిని భర్త అని ఎందుకు చెప్తుంది? నెల రోజులు ఎందుకు సంసారం చేస్తుందని లాయర్ ప్రశ్నిస్తాడు.

విశ్వక్ కు శిక్ష

ప్రేమ చెప్పడంతోనే అమూల్య తాళి వేసుకుందని మరో లాయర్ వాదిస్తాడు. ఇరు పక్షాల మధ్య వాదనలు హోరాహోరీగా సాగుతాయి. వాదనలు ముగిసిన తర్వాత విశ్వక్ అమూల్యను కిడ్నాప్ చేసి బంధించాడని కోర్టు నిర్ధారిస్తుంది. నిందితుడు విశ్వక్ కు ఏడు సంవత్సరాలు జైలు శిక్షను అని జడ్జీ తీర్పు ఇవ్వబోతుండగా ఒక్క నిమిషం సార్ అని అమూల్య మాట్లాడుతుంది.

షాకిచ్చిన అమూల్య

ఈ కేసు వాపసు తీసుకోవాలని అనుకుంటున్నానని అమూల్య పెద్ద ట్విస్ట్ ఇస్తుంది. కేసు వాపసు తీసుకోవడం ఏంటీ అని రామరాజు, వేదవతి, ధీరజ్ షాక్ అవుతారు. ఎవరైనా నిన్ను బెదిరించారా? నీకు, నీ కుటుంబానికి ఏమైనా హానీ చేస్తామని భయపెట్టారా? అని న్యాయమూర్తి అడుగుతారు. కానీ నన్నెవరూ భయపెట్టలేదు. నేను నా ఇష్ట ప్రకారమే కేసు వాపసు తీసుకుంటున్నానని అమూల్య చెప్తుంది.

పెద్ద శిక్ష పడుతుందని

కేసు ఎందుకు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నావని జడ్జీ అడుగుతారు. అతను నన్ను కిడ్నాప్ చేసింది నిజమే. అందువల్ల మానసిక బాధ అనుభవించా. కానీ అతను జైలుకు వెళ్తే అతని కుటుంబానికి అంతకంటే పెద్ద శిక్ష పడుతుంది. అందుకే కేసు వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నా అని అమూల్య చెప్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావని ధీరజ్ అడుగుతున్నా అమూల్య ఏం చెప్పదు.

రామరాజు మైండ్ బ్లాక్

ఆల్రెడీ మా కుటుంబాల మధ్య గొడవలున్నాయని అమూల్య చెప్తుంది. అప్పుడే అమూల్య భయపడిందని సేనాపతి, భద్రావతి నవ్వుతారు. స్వయంగా బాధితురాలే కేసు వాపసు తీసుకోవడంతో కేసు కొట్టేస్తున్నట్లు జడ్జీ తీర్పునిస్తారు. విశ్వ, సేనాపతి, భద్రావతి, రేవతి సంతోషపడతారు. కానీ రామరాజు మాత్రం షాక్ లో మునిగిపోతాడు.

రివేంజ్ ప్లాన్

ఇటు భాగ్యం దగ్గరకు శ్రీవల్లి వెళ్తుంది. భర్త, అత్త అన్న మాటలను తల్లికి చెప్తుంది. నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. చేతులారా కాపురం కూల్చుకున్నావ్. నీ అమాయకత్వం, తింగరితనం కారణంగానే ఇలా జరిగింది. నర్మదను ఎంత బేగిగా బయటకు తోసేస్తే అంత మంచిదని చెప్పా. కానీ నీ బుర్ర ఉపయోగించి లైన్ గీసి నర్మద ఇంట్లోనే ఉండేలా చేశావని వల్లిపై భాగ్యం మండిపడుతుంది.

ఇక నుంచి నేను ఏడవడం కాదు. ప్రేమ, నర్మదను ఏడిపిస్తా. నాకు బా అంటే ప్రాణం. కానీ నా బా నన్ను అసహ్యించుకోవడానికి కారణమైన ప్రేమ, నర్మదను అంత ఈజీగా వదిలిపెట్టనని వల్లి రివేంజ్ కు రెడీ అవుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe