...
...
Next Story

Illu Illalu Pillalu July 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. వాట్ ఏ సీన్- గీత దాటిన భద్రావతి- అక్కా అంటూ ఏడ్చేసిన వేదవతి

Illu Illalu Pillalu July 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 22 ఎపిసోడ్ ఫుల్ ఆఫ్ ఎమోషనల్ గా సాగుతుంది. పుట్టింటి వాళ్ల కోసం వేదవతి, ప్రేమ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తారు. భద్రావతి గీత దాటగానే అక్కా అంటూ వేదవతి ఏడ్చేస్తుంది. ఇంకా పూర్తి ఎపిసోడ్ మీ కోసం.

Published on: Jul 22, 2026, 07:50:40 IST
Advertisement

Illu Illalu Pillalu July 22 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 22 ఎపిసోడ్ లో ఎమోషన్స్ పీక్స్ కు వెళ్తాయి. పుట్టింటి వాళ్ల రాక నేపథ్యంలో వేదవతి, ప్రేమ తెగ సందడి చేసేస్తారు. ఇంకా పూర్తి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

వేదవతి ఎమోషనల్

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

తన పుట్టింటి వాళ్ల కోసం తన చేతులతో వంట చేస్తూ వేదవతి తెగ ఎమోషనల్ అవుతుంది. అమ్మా, నీ కోడలు నీకంటే ఎక్కువ ఎమోషనల్ అవుతుందని ప్రేమను ఏడిపిస్తాడు ధీరజ్. నువ్వు మాత్రం వంట చేయకు తల్లి అని ఫన్నీగా అంటాడు. మరోవైపు నర్మద ఏమో అత్తను కోపంగా చూస్తుంది. మీరు ఇంత స్వార్థపరురాలు అని అనుకోలేదని నర్మద అంటుంది.

చెవులు పిండిన అత్త

మీ పుట్టింటి వాళ్లు వస్తున్నారని పొద్దున నుంచి వెజ్, నాన్ వెజ్ అన్నీ చేస్తున్నారు. కానీ మా వాళ్లు వచ్చినప్పుడు ఎప్పుడైనా ఇలా చేశారా? అని నర్మద అడుగుతుంది. మీ వాళ్లు ఎప్పుడైనా రమ్మంటే వచ్చారా? అని వేదవతి అడుగుతుంది. నేనేదో సరదగా అన్నానని నర్మద అనగానే కోడలి చెవులు పిండేస్తుంది వేదవతి.

ప్రేమకు చీర కట్టించిన ధీరజ్

ఇక ఏ చీర కట్టుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతుంది వేదవతి. మా అక్క కట్టుకున్న చీర కలరే నేనూ కట్టుకోవాలని అనుకుంటున్నా. కానీ మా అక్క ఏ చీర కట్టుకుంటుందో తెలియదు కదా అని రామరాజుతో అంటుంది వేదవతి. అయితే మీ అక్కను అడిగి రా అని రామరాజు కౌంటర్ వేస్తాడు. మరోవైపు ప్రేమకు ధీరజ్ చీర కట్టిస్తాడు. బోలెడు సిగ్గుగా ఉందిరా అని ప్రేమ మెలికలు తిరుగుతుంది.

రొమాంటిక్ సాంగ్

సాగర్ ఆఫీస్ కు రెడీ అవుతాడు. ఇంట్లో మీ అమ్మమ్మ బర్త్ డే జరుగుతుంటే ఆఫీస్ కు వెళ్లడం కరెక్ట్ కాదని నర్మద ఆపుతుంది. మరోవైపు చందు షర్ట్ కు శ్రీవల్లి గుండీ పెట్టబోతుంటే చందు సీరియస్ అవుతాడు. నిన్ను భార్యగా చూడటం లేదు, ముక్కుమొహం తెలియని మనిషిలాగే చూస్తున్నానని చందు అంటాడు. నాకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైన వాళ్లలో ఒకరైన ప్రేమకు కూడా ఇలాంటి పరిస్థితి తీసుకొస్తానని వల్లి అనుకుంటుంది.

పాత బట్టలతో కామాక్షి

ఇక రామరాజు కూతురు కామాక్షి, అల్లుడు భాస్కర్ వస్తారు. ఇలా పాత బట్టలతో వెళ్తేనే డబ్బులు, నగలు గుంజుకోవచ్చని భర్తతో కామాక్షి అంటుంది. ఇంట్లోకి వెళ్లగానే ఇలా పాత బట్టలతో వచ్చారేంటీ అని రామరాజు అడుగుతాడు. రవ్వల నెక్లెస్, పట్టు చీర కోసం కామాక్షి యాక్టింగ్ మొదలెడుతుంది. వేదవతి వచ్చి మొట్టికాయలు వేయగానే కామాక్షి, భాస్కర్ ల గెటప్స్ మారిపోతాయి.

అప్పుడే సుకన్య వస్తుంది. అక్కా, నీకు ఓ సర్ ప్రైజ్ చూపిస్తానని సుకన్యను చూపిస్తాడు తిరుపతి. ఏయ్, నా ఇంటికి రావడానికి ఎంత ధైర్యమే. ఇక్కడి నుంచి వెళ్లిపో అని వేదవతి కోప్పడుతుంది. మీ తమ్ముడు పెద్ద కథ నడుపుతున్నాడని ధీరజ్ మెల్లగా వచ్చి చెప్పడంతో వేదవతి కామ్ అవుతుంది.

అక్కా అంటూ

పుట్టింటి వాళ్ల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తూ వేదవతి, ప్రేమ తిరుగుతూ ఉంటారు. భద్రావతి, సేనాపతి, రేవతి, శారదాంబ, విష్వక్ ఇంట్లో నుంచి బయటకు వస్తారు. మధ్యలో ఏనాడో గీసుకున్న గీతను దాటేస్తారు. అక్కా అంటూ వేదవతి పరుగెత్తుకుంటూ వెళ్లి భద్రావతిని కౌగిలించుకుని ఏడ్చేస్తుంది. ఎందుకే ఆ కన్నీళ్లు, నేను వచ్చేశాను కదా అని భద్రావతి అంటుంది.

అన్నయ్య అంటూ సేనాపతి దగ్గరకు వెళ్తుంది వేదవతి. ఆ వెంటనే అత్త, నాన్న అంటూ ప్రేమ వెళ్లి హత్తుకుంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks