...
...
Next Story

ఇల్లు ఇల్లాలు పిల్లలు జూలై 2 ఎపిసోడ్: వల్లి బండారం బయటపెట్టిన డాక్టర్.. ప్రేమను లొంగదీసుకోవాలని చూసిన కీచక రాజ పుష్పం

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 2 ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. వల్లి కడుపు డ్రామా గురించి నర్మదకు డాక్టర్ నిజాలు చెప్పేస్తుంది. మరోవైపు ప్రేమను రాజ పుష్పం బలవంతం చేస్తాడు. ప్రేమ గదిలో గడియ పెట్టుకుని ఏడుస్తుంటుంది.

Published on: Jul 2, 2026, 08:34:17 IST
Advertisement

Illu Illalu Pillalu July 2 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 2 ఎపిసోడ్ లో నర్మద భయపెట్టేసరికి డాక్టర్ నిజం చెప్పేస్తుంది. వల్లి ప్రెగ్నెంట్ అనే డ్రామా గురించి పూర్తిగా బయట పెడుతుంది. మరోవైపు ప్రేమను లోబర్చుకోవాలని రాజ పుష్పం ప్రయత్నిస్తాడు. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

నర్మద వార్నింగ్

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

శ్రీవల్లి ఫేక్ స్కానింగ్ రిపోర్ట్ లు తీసుకుని నర్మద హాస్పిటల్ కు వెళ్తుంది. వల్లి కళ్లు తిరిగి పడిపోతే ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఊరు, పేరు లేని రిపోర్ట్స్ మీరే ఇచ్చారు. ప్రెగ్నెంట్ కానీ వల్లిని ప్రెగ్నెంట్ అని ఎందుకు చెప్పారు? ఫేక్ సర్టిఫికేట్లు ఎందుకు ఇచ్చారని నర్మద అడుగుతుంది. డాక్టర్ కవర్ చేయాలని చూస్తే.. పోలీస్ స్టేషన్ కు వెళ్తానని నర్మద వార్నింగ్ ఇస్తుంది.

నిజం చెప్పిన డాక్టర్

తన కూతురు కాపురం నిలబెట్టమని వాళ్ల అమ్మానాన్న నా కళ్లు పట్టుకున్నారు. అందుకే వల్లి ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పా. ఆ రోజు వల్లి కూడా బతిమిలాడింది. అందుకే ఫేక్ స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చానని నర్మదకు డాక్టర్ అసలు విషయం చెప్పేస్తుంది.

మీ కారణంగా నింద నాపై పడింది. వల్లి ప్రెగ్నెంట్ డ్రామా గురించి మా ఇంట్లో చెప్పండి అని నర్మద అడుగుతుంది. కానీ డాక్టర్ మాత్రం తనను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో అబార్షన్ అని చెప్పిన ఆ డాక్టర్ ను పట్టుకొస్తానని నర్మద కోపంగా వెళ్లిపోతుంది.

ప్రేమపై బలవంతం

నువ్వు నా సొంతం అవకుండా వదిలిపెట్టను అని ప్రేమను బలవంతం చేస్తాడు రాజ పుష్పం. వదలమంటూ ప్రేమ గింజుకుంటుంది. ప్రేమ ఫోన్ కూడా లాక్కుంటాడు. రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుంటుంది. రాజ పుష్పం బయట నుంచి లాక్ వేస్తాడు. ఈ రూమ్ నుంచి బయటకు వెళ్లాలన్నా, రూ.10 లక్షలు గెలవాలన్నా నేను చెప్పినట్లు చేయడం ఒక్కటే దారి అని ప్రేమను బ్లాక్ మెయిల్ చేస్తాడు.

ధీరజ్ షాక్

ఫుడ్ డెలివరీ కోసం ఒక అడ్రస్ కు వెళ్లిన ధీరజ్ కు ప్రేమ ఫ్రెండ్ కనిపిస్తుంది. మీ అమ్మకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పావ్ కదా అని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ ఎక్కడ? అని గట్టిగా నిలదీస్తాడు. దీంతో ప్రేమ డ్యాన్స్ కాంపిటీషన్ కు వెళ్లిందని ఆ ఫ్రెండ్ నిజం చెప్పేస్తుంది. షాక్ అయిన ధీరజ్ ప్రేమకు కాల్ చేస్తాడు. రాజ పుష్పం ఆ కాల్ లిఫ్ట్ చేసి మ్యూట్ లో పెడతాడు.

ప్రేమ కన్నీళ్లు

ప్లీజ్ మా ఆయనతో మాట్లాడాలని ప్రేమ ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ రాజ పుష్పం మాత్రం ఒప్పుకోడు. ధీరజ్ కోపంతో కాల్ కట్ చేస్తాడు. మా ఆయన కోసం కారు కొనాలని డ్యాన్స్ కాంపిటీషన్ కు వచ్చానని ప్రేమ రిక్వెస్ట్ చేస్తుంది. కానీ రాజ పుష్పం మాత్రం తనతో గడపమని అడుగుతాడు.

నమ్మని వేదవతి

నర్మద కోపంతో ఊగిపోతూ ఇంటికి వస్తుంది. వల్లి అని గట్టిగా పిలుస్తుంది. వేదవతి వచ్చి నర్మదపై కోప్పడుతుంది. అసలు వల్లికి కడుపే లేదు. ఈ స్కానింగ్ రిపోర్ట్స్ ఒరిజినల్ కాదని డాక్టర్ చెప్పింది. భాగ్యం కాళ్ల మీద పడితే డాక్టర్ అలా చెప్పిందంటా అని నర్మద చెప్తుంది. కానీ వేదవతి మాత్రం నమ్మదు.

తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం ఎందుకు డ్రామాలు ఆడుతున్నావని నర్మదను తిడుతుంది వేదవతి. ఆధారాలతో సహా నిరూపిస్తానని నర్మద ఛాలెంజ్ విసురుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe