...
...
Next Story

ఇల్లు ఇల్లాలు పిల్లలు జూలై 6 ఎపిసోడ్: అదిరిపోయే ఎపిసోడ్- శ్రీవల్లి గుట్టురట్టు- సుక్కు చెప్పిన నిజం- చందు హార్ట్ బ్రేక్!

Illu Illalu Pillalu July 6th Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 6 ఎపిసోడ్ లో అదిరే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. వల్లి ప్రెగ్నెన్సీ, అబార్షన్ డ్రామాను ఆధారాలతో సహా నర్మద, ప్రేమ, ధీరజ్ నిరూపిస్తారు. సుక్కు అన్ని నిజాలు చెప్పేస్తుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

Published on: Jul 6, 2026, 08:02:49 IST
Advertisement

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూలై 6 ఎపిసోడ్ అదిరిపోయింది. శ్రీవల్లి కడుపు డ్రామాను నర్మద, ప్రేమ, ధీరజ్ కలిసి బయటపెడతారు. ఈ నిజం తెలిసి వేదవతి, చందు ఫైర్ అవుతారు. ఇంకా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

నర్మద కోపం

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ప్రేమను నర్మద సీరియస్ గా చూస్తుంది. నా మొగుడు ఆల్రెడీ తిట్టాడు. కొట్టబోయాడు కూడా. ఇక తిట్లు తినే ఓపిక లేదు. కొడితే కొట్టు కానీ అలా చూడకు. కంటిచూపుతో చంపేసేలా ఉన్నావ్ అని ప్రేమ అంటుంది. వెంటనే నర్మద నవ్వేస్తుంది. నీ భర్తపై ఉన్న ప్రేమకు, ఓ స్థాయిలో నిలబెట్టాలనే తపనకు ముచ్చటేస్తుంది. కానీ ఎవరికీ చెప్పకుండా వెళ్లినందుకు కోపంగానూ ఉందని నర్మద అంటుంది.

డ్రామా కనిపెట్టా

బల్లి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. ఆ రోజు పిల్లలకు నువ్వు డ్యాన్స్ క్లాస్ చెప్పేందుకు వెళ్తేనే బీభత్సం చేసింది. ఇక డ్యాన్స్ కాంపిటీషన్ కు వెళ్లిందని మామయ్యకు చెప్తే ఏమైనా ఉందా? అని నర్మద చెప్తుంది. ఇక వల్లి కడుపు డ్రామా అని కనిపెట్టా. ఫస్ట్ చెప్పిన డాక్టర్ దగ్గరకు వెళ్లా. అబార్షన్ అని చెప్పిన మెరుపు తీగ అసలు డాక్టరే కాదు అని మొత్తం నిజాన్ని ప్రేమ, ధీరజ్ కు నర్మద చెప్తుంది.

డూప్లికేట్ డాక్టర్

అందరికీ ఈ విషయం చెబుదామని ప్రేమ అంటుంది. కానీ అత్తయ్యకు చెప్తే నమ్మలేదని, నిజాన్ని నిరూపించేలా ఎవిడెన్స్ కావాలని నర్మద చెప్తుంది. ఆ డాక్టర్ తనకు బ్యాడ్ నేమ్ వస్తుందని భయపడి మన ఇంటికి రావడం లేదు. ఇప్పుడు మనకున్న ఆప్షన్ ఆ డూప్లికేట్ డాక్టర్ ను పట్టుకోవడమే అని నర్మద క్లియర్ గా వివరిస్తుంది.

శ్రీవల్లికి అత్తయ్య సేవలు

ప్రేమ తీసుకొచ్చిన జ్యూస్ లో ధీరజ్ ఏదో మందు కలుపుతాడు. ఆ గ్లాస్ ను తీసుకెళ్లి సుక్కును తాగమని నర్మద అడుగుతుంది. నా వల్ల వల్లి అక్కకు కడుపు పోయింది. నువ్వు వల్లి అక్కకు సేవలు చేశావు కదా. అందుకే ఉడతాభక్తిగా ఈ జ్యూస్ అని నర్మద చెప్పేసరికి సుక్కు తాగేస్తుంది. వెంటనే సుక్కు బయటకు వెళ్లి వాంతి చేసుకుంటుంది. సుక్కు వాంతులు చేసుకుంటుందని అందరూ కంగారు పడతారు.

డాక్టర్ ను రప్పించాల్సిందేనని ధీరజ్ కాల్ చేస్తాడు. అప్పుడు మెరుపు తీగ మరోసారి డాక్టర్ గెటప్ లో వచ్చేస్తుంది. ఆమెను చూసి శ్రీవల్లి, సుక్కుకు మైండ్ బ్లాక్ అవుతాయి. సుక్కును ఆ డాక్టర్ చెక్ చేస్తుంది. నువ్వు ఎక్కడ దొరికావే వీళ్లకు అని మెరుపు తీగను సుక్కు మెల్లగా అడుగుతుంది.

రీల్స్ తో

అప్పుడే ధీరజ్, ప్రేమ, నర్మద కలిసి మెరుపు తీగను కనిపెట్టిన అసలు విషయాన్ని సుక్కుకు ఆమె చెప్తుంది. రీల్స్ ద్వారా కనిపెట్టారని ఫ్లాష్ బ్యాక్ మొత్తం వివరిస్తుంది. సుక్కు చేతిని పట్టుకుని మెరుపు తీగ నవ్వుతుంది. సుక్కు నువ్వు నెల తప్పావని డాక్టర్ చెప్పేసరికి వల్లి, వేదవతి, తిరుపతి షాక్ అవుతారు. ఆ పిల్లకు ఇంకా పెళ్లి కాలేదని వేదవతి అంటుంది. నేను నెల తప్పడం ఏంటీ? అని సుక్కు అరుస్తుంది.

నిజం చెప్పేసిన సుక్కు

ఈ డాక్టర్ కు ఏం తెలియదని సుక్కు అంటుంది. తనకు ఏం తెలియకుండానే వల్లి అక్కకు అబార్షన్ ట్రీట్మెంట్ చేస్తుందా? అని ప్రేమ అడుగుతుంది. నర్మద, ధీరజ్ కూడా ఆ డాక్టర్ గురించి గొప్పగా చెప్తారు. దీంతో అసలు ఇది డాక్టరే కాదనే నిజాన్ని సుక్కు బయటపెట్టేస్తుంది. వల్లికి కడుపు పోయిందనే నాటకంం ఆడటం కోసం నీకు డాక్టర్ క్యారెక్టర్ ఇచ్చా. నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ వి, నా మీదే కమాండ్ చేస్తావా? నీకు స్వీపర్ జాబ్ లేకుండా చేస్తానని సుక్కు చెప్తుంది.

చేయి ఎత్తిన చందు

ఆ మాటలు విని వేదవతి మైండ్ బ్లాక్ అవుతుంది. అప్పుడే వచ్చిన చందు కూడా ఈ మాటలను వింటాడు. వల్లి డ్రామాను నర్మద వివరించడంతో చందు ఫ్యూజులు ఔట్ అయిపోతాయి. కానీ నర్మద అబద్ధం చెప్తుందని వల్లి అంటుంది. అప్పుడే నోర్మూయ్ అని వల్లిపై చేయి ఎత్తుతాడు చందు. ఇలాంటిది నా భార్య అని నీ ముఖం చూసేందుకే కంపరంగా ఉందంటాడు. వల్లిని లాగిపెట్టి కొడుతుంది వేదవతి. నమ్మితే ఇంకా మోసాలు చేస్తావని వేదవతి మండిపడుతుంది.

మోసం చేశారని తెలిస్తే

నా కూతురు జీవితాన్ని ఆ విశ్వ చేతిలో పెట్టాలని చూశావు. అయినా ఇంటికి తీసుకొచ్చా. కడుపుతో ఉన్న అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా. కానీ కడుపు అని చెప్పి మమ్మల్ని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఈ ఇంటికి మూడో తరం వారసుడి రాబోతున్నాడని ఆయన పొంగిపోతున్నారు. మీరు మోసం చేశారని తెలిస్తే ఆయన తట్టుకోగలరా? అని వేదవతి ఎమోషనల్ అవుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe