...
...
Next Story

ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 16 ఎపిసోడ్:నోరుజారిన వల్లి-కడుపు లేదంటూ-నర్మద లై డిటెక్టర్ ప్లాన్-మామ చేయి విరగ్గొట్టిన ధీరజ్

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 16 ఎపిసోడ్ లో పచ్చి కూరగాయలతో శ్రీవల్లికి నర్మద, ప్రేమ షాక్ ఇస్తారు. దీంతో తనకు కడుపు లేదని వల్లి అరుస్తుంది. మరోవైపు సేనాపతి చేతికి కట్టుతో ధీరజ్ కార్లో నుంచి దిగుతాడు. ఇక వల్లి అబద్ధాల గుట్టు తేల్చేందుకు నర్మద ప్లాన్ వేస్తుంది.

Published on: Jun 16, 2026, 07:46:48 IST
Advertisement

Illu Illalu Pillalu Today Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ నేటి (జూన్ 16) ఎపిసోడ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ఒకవైపు కడుపుతో ఉన్నానని నాటకాలు ఆడుతున్న శ్రీవల్లికి నర్మద, ప్రేమలు చుక్కలు చూపించగా.. మరోవైపు సేనాపతికి ధీరజ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే జూన్ 16 ఎపిసోడ్ లో జరిగిన హైలైట్స్ ఏంటో చూద్దాం.

వల్లికి పచ్చి కూరగాయల షాక్!

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

ప్రేమ, నర్మద చేసిన స్పెషల్ ఫుడ్ కోసం శ్రీవల్లి ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటుంది. వారు తెచ్చిన ప్లేట్ పై ఉన్న క్లాత్ తీయగానే అందులో ఉన్న పచ్చి టమాటా, ఉల్లిగడ్డ, క్యారెట్, దోసకాయ, మునక్కాయ ముక్కలు చూసి వల్లికి కళ్లు తిరుగుతాయి. కరెంట్ షాక్ కంటే పెద్ద షాకే తగిలిందని, ఇవి గేదెలు కూడా తినవని వల్లి మండిపడుతుంది.

డాక్టర్ గా ప్రేమ

కడుపుతో ఉన్నవాళ్లు పచ్చి కూరగాయలు తింటే కడుపులో బిడ్డ చల్లగా ఉంటుందని డాక్టరమ్మ చెప్పిందని నర్మద కవర్ చేస్తుంది. ప్రేమనే డాక్టర్ గెటప్‌లో ఉన్న వీడియోను నర్మద చూపించడంతో వల్లికి ఏం చేయాలో అర్థం కాదు.

నిజం కక్కేసిన వల్లి!

ప్రేమ, నర్మద కలిసి బలవంతంగా వల్లి నోట్లో పచ్చి కూరగాయలు కుక్కుతారు. ఆ టార్చర్ తట్టుకోలేక "నాకు కడుపు లేదు" అని వల్లి గట్టిగా అరుస్తుంది. వెంటనే అప్రమత్తమై.. "ఒకేసారి ఇన్ని కూరగాయలు నా కడుపులో పెడితే కడుపు ఎలా ఉంటుంది?" అని కవర్ చేసుకుంటుంది. దీంతో ప్రేమ, నర్మదకు ఉన్న డౌట్ మరింత బలంగా మారుతుంది.

సేనాపతికి ధీరజ్ షాక్

కానీ, లోపలికి వెళ్లాక.. ధీరజ్ గాడే తన కారుతో గుద్ది ఈ పని చేశాడని భద్రావతి, విశ్వ, రేవతిల ముందు సేనాపతి చెప్తాడు. అది విని శారదాంబ.. "వాడు రామరాజు కొడుకు, ఉడుకు రక్తం.. జాగ్రత్తగా ఉండటం మంచిది" అని కౌంటర్ ఇస్తుంది.

భద్రావతి కుట్ర

సేనాపతికి జరిగిన దానికి ప్రతీకారంగా ధీరజ్ కారును ఫైనాన్స్ వాళ్లతో లాగేసుకునేలా చేద్దామని భద్రావతి కుట్ర పన్నుతుంది. కానీ వాడి కారు తీసుకుంటే, ఈ సారి లారీతో వచ్చి గుద్దుతాడని శారదాంబ మరో కౌంటర్ వేస్తుంది.

నర్మద మాస్టర్ ప్లాన్!

మరోవైపు, సీన్ నర్మద ఆఫీస్‌కు మారుతుంది. మనుషులు చెప్పే అబద్ధాలను కనిపెట్టే ఒక లై డిటెక్టర్ మెషీన్ గురించి నర్మద తన ఫ్రెండ్ ద్వారా తెలుసుకుంటుంది. ఈ మెషీన్‌తో బల్లక్కాయ్ (శ్రీవల్లి) కడుపు విషయాన్ని తేలుస్తానని నర్మద ఫిక్స్ అవుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది. మరి శ్రీవల్లి అబద్ధాల గుట్టును నర్మద ఎలా బయటపెడుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks