ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 1 ఎపిసోడ్: మామ చాటు అల్లుడి పరువు తీసిన ధీరజ్.. రైస్ మిల్ కూలీలంటూ అవమానించిన ప్రసాద్ రావు
Illu Illalu Pillalu June 1 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 1 ఎపిసోడ్ లో వస్తువులు తీసుకొచ్చిన తండ్రి ప్రసాద్ రావుపై నర్మద ఫైర్ అవుతుంది. వేదవతి కూడా కోప్పడుతుంది. కానీ సాగర్ మాత్రం తల్లితో నోరుజారి మాట్లాడతాడు. రైస్ మిల్ కూలోళ్లు అంటూ ప్రసాద్ రావు అవమానిస్తాడు. ధీరజ్ కౌంటర్ ఇస్తాడు.
ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 1 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 1 ఎపిసోడ్ లో.. పుట్టింటి సారె అంటూ వస్తువులు తీసుకొచ్చిన తండ్రి ప్రసాద్ రావుపై నర్మద ఫైర్ అవుతుంది. బుద్ధి లేదంటుంది. ఎవరు తీసుకురమ్మనారంటూ మండిపడుతుంది. నా కూతురిని ఎలా చూసుకోవాలనేది నా బాధ్యత అని ప్రసాద్ రావు అంటాడు.

వేదవతి కోపం
నాకేం అవసరం లేదని నర్మద చెప్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్. కూతురిని ప్రేమగా చూసుకోవాలనే బాధ్యత ఉంటుంది కదా అని ప్రసాద్ రావు అంటాడు. కూతురిపై ప్రేమ ఉంటే వచ్చి రోజూ చూసుకుని వెళ్లండి. అంతే కానీ ఇలా సామాన్లు తెచ్చి మా నుంచి కొడుకు, కోడలిని ఇంకా విడదీయకండి. ఈ ఇంటిని రెండు ముక్కలు చేసింది సరిపోలేదా, సామాన్లు తీసుకెళ్లండని వేదవతి కూడా కోప్పడుతుంది.
నోరుజారిన సాగర్
ఎందుకు తీసుకెళ్లాలి అంటూ సాగర్ అప్పుడే వస్తాడు. మనం గతి లేని స్థితిలో ఉన్నామా? అని వేదవతి సీరియస్ అవుతుంది. ఇది ఆడపిల్లకు పుట్టింటివాళ్లు జరిపించాల్సిన సంప్రదాయం. నీ పుట్టింటివాళ్లు జరిపించలేదని, నా భార్యకు కూడా జరిపించొద్దు అంటే ఎలా అని సాగర్ నోరు జారుతాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అని సాగర్ ను అడుగుతుంది నర్మద.
ప్రసాద్ రావు మామ
బుజ్జమ్మా వదిలేయ్. వాడు నీ కడుపులో ఉన్నప్పుడే అడ్డం తిరిగాడు. కోలుకోవడానికి టైమ్ పట్టింది. ఇప్పుడు మళ్లీ అడ్డం తిరిగాడు. కోలుకోలేవని రామరాజు అంటాడు. సాగర్, ప్రసాద్ రావు కలిసి సామాన్లు దించుతారు. సాగర్ కాలుపై వస్తువు పడగానే అమ్మా అని అంటాడు. అదేంట్రా నీకు దెబ్బతగిలితే ప్రసాద్ రావు మామ అని అరవాలి కానీ అమ్మా అన్నావేంటీ అని ధీరజ్ కౌంటర్ వేస్తాడు.
ధీరజ్ కౌంటర్
అమ్మ పిచ్చిది కాబట్టి కొడుకు ఏదైనా మాట అంటే పక్కకు వెళ్లి ఏడుస్తుంది. కానీ వస్తువులు అలా కాదు. జాగ్రత్తగా చూసుకోకపోతే ఇలాగే దెబ్బలు పడతాయి. అమ్మను చూసుకోవడానికి పుట్టింటివాళ్లు లేరా? అమ్మను మహారాణిలా చూసుకోవడానికి నాన్న ఉన్నాడు. కానీ నువ్వు ప్రతిదానికి మీ మామ మీద ఆధారపడుతున్నావ్. నువ్వు జాబ్ కొనుక్కోవడానికి, ఆఖరికి ఇంట్లో సామాన్లు కొనుక్కోవడానికి కూడా మామపై ఆధారపడ్డావ్ అని ధీరజ్ గట్టిగానే అంటాడు.
రైస్ మిల్ కూలోళ్లు
సామాన్లు దించేందుకు కూలోళ్లు ఎందుకు అల్లుడు? రైస్ మిల్ లో పనిచేసిన కూలోళ్లు ఉన్నారు కదా. దించితే కూలీ పడేస్తామని ప్రసాద్ రావు అహంకారంతో మాట్లాడతాడు. కోపంతో ఊగిపోతున్న రామరాజును ఆపిన ధీరజ్.. ప్రసాద్ రావుతో మాట్లాడతాడు. మీరు చెప్పినట్లే చేస్తామని వస్తువులను ధీరజ్, తిరుపతి కలిసి లోపలికి తీసుకెళ్తారు.
సామాన్లు లోపల పెట్టాక ఏరా మామ చాటు అల్లుడా? భార్యకు ఏమేం కావాలో తెలియక పోతే ఎలారా? అని ధీరజ్ కౌంటర్ వేస్తాడు. కూలోడి భార్య టీ ఇవ్వడానికి గీత దాటితే ఏం కాదని ధీరజ్ అనగానే ప్రేమ గీత దాటుతుంది. ప్రసాద్ రావు, సాగర్ కు కూడా టీ ఇస్తుంది ప్రేమ. టీకి కూడా డబ్బులు పడేస్తామని ప్రసాద్ రావు బిల్డప్ ఇస్తాడు.
రూ.10 వేలు
కుటుంబాలు విడగొట్టే కలహాల రావు మాకు డబ్బులిచ్చి బయల్దేరొచ్చు. సామాన్లు మోసినందుకు నాకు, మా మామకు కలిసి రూ.8 వేలు. టీలకు రూ.2 వేలు. మొత్తం రూ.10 వేలు అని ప్రసాద్ రావును ధీరజ్ అడుగుతాడు. ఏంటీ రూ.10 వేలా? టూ మచ్ అని సాగర్ అంటాడు. ఎంత కావాలంటే అంత పడేస్తానని అన్నారు కదా. కుటుంబాలను విడగొట్టడమే తెలుసు కానీ డబ్బులు ఇవ్వడం తెలియదా అని పరువు తీసేలా మాట్లాడతాడు ధీరజ్.
పొగరుతో ప్రసాద్ రావు డబ్బులు తీసి ఇస్తాడు. డబ్బులతో బంధాలు, బంధువులు రావని చెప్పిన ధీరజ్.. త్వరలోనే తన కుటుంబాన్ని ఒక్కటి చేస్తానని ఛాలెంజ్ చేస్తాడు.
తిరుపతికి వాటా
సీన్ కట్ చేస్తే సామాన్లు మోసిన డబ్బుల్లో తన వాటా తీసుకుని, కన్యకు చీర కొనిస్తానని తిరుపతి గాల్లో తేలిపోతాడు. ధీరజ్ ను పిలిచి అర్జెంట్ గా వాటా పంచమని అడుగుతాడు. సగం కష్టపడ్డావ్ కదా అని రూ.5 వేలు ఇస్తాడు ధీరజ్. చిన్న రాయుడు అని ధీరజ్ ను పొగిడేస్తాడు తిరుపతి.
లాగేసుకున్న ప్రేమ
తిరుపతిని షాపింగ్ కు వెళ్లకుండా ప్రేమ ఆపుతుంది. ఆ డబ్బు తీసుకున్న ప్రేమ.. ఐడియా మా ఆయన ఇచ్చినందుకు నీ వాటాలో సగం ఇవ్వాలంటుంది. రెండు టీలు నేనే పెట్టాను కదా. అందుకు రూ.2 వేలు రావాలి కదా. నువ్వు కూడా టీ తాగావు కాబట్టి ఇంకా నువ్వే రూ.500 బాకీ అని ఉన్న డబ్బులన్నీ ప్రేమ లాగేసుకుంటుంది.
మరోవైపు నొప్పి అంటూ బాధపడుతున్న భాగ్యం, ఇడ్లీ బాబాయ్ ఒకరికొకరు ఆయింట్ మెంట్ పూసుకుంటారు. ఇన్ని రోజులు నేను కొట్టిన దెబ్బలకు ప్రతీకారం తీర్చుకున్నావ్ కదా అని మొగుడితో భాగ్యం అంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


