ఇల్లు ఇల్లాలు పిల్లలు జూన్ 23 ఎపిసోడ్:బల్లక్కాయ్ గుట్టు రట్టు-లై డిటెక్టర్ మిషన్‌తో షాకిచ్చిన న‌ర్మ‌ద‌-మౌన‌వ్ర‌తం డ్రామా

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 23 ఎపిసోడ్ లో అదిరే ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. వల్లి బండారం బయటపెట్టేందుకు నర్మద లై డిటెక్టర్ మిషన్ తెప్పిస్తుంది. దీంతో వల్లి మౌన వ్రతం డ్రామా ఆడుతుంది. కానీ చివరకు నోరు తెరుస్తుంది. మరి చివరకు ఏమైందో తెలుసుకోండి.

Published on: Jun 23, 2026, 07:58:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Illu Illalu Pillalu June 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే జూన్ 23 ఎపిసోడ్ లో వల్లి గుట్టు రట్టు చేసేందుకు లై డిటెక్టర్ మిషన్ ను నర్మద తెప్పిస్తుంది. వల్లి మౌనవ్రతం అని డ్రామా ఆడినా.. చివరకు మిషన్ ముందు కూర్చోక తప్పదు. మరి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూసేయండి.

ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ (jiohotstar)

వల్లికి ధీరజ్ కౌంటర్

నర్మదకు ఓ బాక్స్ డెలివరీలో వస్తుంది. ఏంటి చెల్లాయ్, మొగుడు పెళ్లాలు గవర్నమెంట్ ఉద్యోగంలో నాలుగు చేతులారా సంపాదిస్తున్నారు కాబట్టి ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టావా? అని శ్రీవల్లి అడుగుతుంది. నర్మద వదిన లక్ష సంపాదిస్తున్నా ఆర్భాటాలకు పోదు, బిల్డప్ కూడా ఇవ్వదు. కానీ కొంతమంది మాత్రం మాకు అన్ని కోట్లున్నాయ్ అని బిల్డప్ ఇస్తారని ధీరజ్ అంటాడు.

నిజాన్ని కక్కించే మిషన్

ఇది నిజాన్ని కక్కించే మిషన్ అని నర్మద చెప్పేసరికి శ్రీవల్లి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మధ్య కొంతమంది నోరు తెరిస్తే చాలు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పేస్తున్నారు. ముందు నీ మీదే ట్రై చేద్దాం అక్కాయ్ అని నర్మద అంటుంది. అప్పుడే సుక్కు వచ్చి వల్లిని తప్పిస్తుంది. లోపలికి కంగారుగా వచ్చిన వల్లిని చూసి చందు సీరియస్ అవుతాడు. కడుపుతో ఉన్న సంగతి మర్చిపోయావా ఏంటీ అని చందు కోప్పడతాడు.

వల్లి మౌన వ్రతం

నర్మద అబద్ధాల మిషన్ తెప్పించింది నీ కోసమే. నీ కడుపు సంగతి తేల్చేందుకే మిషన్ తెప్పించింది. దెబ్బకు నీ నాటకం బయటపడుతుందని వల్లితో సుక్కు అంటుంది. నోరు తెరిస్తేనే కదా నర్మద నిజాలు బయటపెట్టేది. ఇప్పటి నుంచి నేను మౌన వ్రతం అని వల్లి నోరు మూసుకుంటుంది. మరోవైపు ప్రేమ, ధీరజ్ ప్రేమగా పోట్లాడుకుంటారు.

బిడ్డ కోసం మొక్కు

అప్పుడే వేదవతి వచ్చి ఏంటే ఈ మిషన్? ఇంట్లో బాంబు పెడుతున్నారా? అని అడుగుతుంది. ఇది అల్లాటప్పా మిషన్ కాదు. అబద్ధాలను బయట పెట్టిస్తుందని నర్మద గొప్పగా చెప్తుంది. అప్పుడే వల్లక్కాయ్ అని కేక వేస్తారు. వల్లక్కాయ్ నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతుందని ప్రేమ, నిజాలు చెప్తుందని నేను గొడవ పడుతున్నాం. నిజాలు తెప్పించే ఈ మిషన్ టెస్ట్ లో నువ్వు పాల్గొనాలని నర్మద అడుగుతుంది.

ఇప్పుడు వల్లి మౌన వ్రతం చేస్తుంది. పుట్టబోయే బిడ్డ కోసమే ఇదంతా. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు మౌన వ్రతం చేస్తానని మొక్కుకుందని సుక్కు చెప్తుంది. బిడ్డ కోసం వ్రతం చేస్తున్నావా? అని వల్లిపై వేదవతి ప్రేమ కురిపించేస్తుంది. చాలా తెలివిగా మౌన వ్రతం అంటారా? నీ నోరు ఎలా తెరిపిస్తానో చూడు వల్లక్కాయ్ అనుకొని నర్మద మరో ప్లాన్ వేస్తుంది.

వల్లికి అసూయ

వల్లక్కాయ్ నిన్ను దుర‌దృష్టం జలగలా పట్టేసింది. నువ్వు చెప్పినవన్ని అబద్ధాలని నిరూపించుకునే బంగారు అవకాశాన్ని మిస్ అయ్యావని నర్మద అంటుంది. అప్పుడు మిషన్ ఎలా పని చేస్తుందోనని వేదవతిపై టెస్ట్ చేస్తుంది నర్మద. వల్లి మనిషి మంచిదే కానీ గుణమే తేడా. కుల్లు, అసూయతో అల్లాడిపోతుంది. తోడి కోడళ్లను చూసి కళ్లల్లో నిప్పులు పోసుకుంటుంది అని వేదవతి చెప్తుంటే మిషన్ ఏమో ఆల్ రైట్ అని అరుస్తుంది.

తన గురించి చెప్పమని అత్తయ్యను నర్మద అడుగుతుంది. నా రెండో కోడలు బంగారం, దేవత. మంచు కంటే చల్లనైన మంచి మనసు. అత్తయ్య అంటే ప్రాణం అని వేదవతి అంటే మిషన్ రాంగ్ అని అరుస్తుంది. అంటే అన్నానంటారు కానీ నువ్వు గడుసు పిండానివే అని వేదవతి అనగానే ఆల్ రైట్ అని మిషన్ చెప్తుంది.

నర్మదకు పొగరు

గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నానని పొగరు. నన్నే డామినేట్ చేయాలని చూస్తుంది. అమాయకుడైనా నా కొడుకును కొంగుకు కట్టేసుకుని ఆడేస్తుందని వేదవతి అంటుంది. మీకు ఇష్టమైన ముద్దుల కోడలు ఎవరు? అని నర్మద అడుగుతుంది. ప్రేమ అంటే కాస్త ఇష్టం ఎక్కువ. అది ఎంతైనా నా మేనకోడలు కదా. చిన్నప్పుడు ఎత్తుకుందామని అనుకున్నా. కానీ కుదరలేదని వేదవతి చెప్తుంది.

నోరు తెరిచిన శ్రీవల్లి

అప్పుడే ఏం మాత్రం ఆలోచించకుండా శ్రీవల్లి నోరు ఓపెన్ చేస్తుంది. కడుపులో వారసుడిని మోస్తున్న నాపైన ప్రేమ లేకుండా, చిన్న కోడలికి ఇష్టమైన కోడలు అంటారా? మీది రక్త సంబంధం కదా ప్రేమలు ఎక్కడికి పోతాయి? మేం ఎప్పటికీ పరాయివాళ్లమే కదా అని వల్లి అరిచేస్తుంది.

మానవత్వం వదినోయ్ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు మౌన వ్రతం అన్నావ్ కదా అని ధీరజ్ అడగ్గానే వల్లి ఫ్యూజులు ఔట్ అయిపోతాయ్. నీ మౌన వ్రతం భగ్నం అయింది కదా కూర్చో అని మిషన్ ముందు వల్లిని కూర్చోబెడతారు.

అరిచిన మిషన్

ఇప్పుడు నీకు ఎన్నో నెల అని నర్మద అడుగుతుంది. నాలుగో నెల అని వల్లి అనగానే మిషన్ రాంగ్ అని అరుస్తుంది. హాస్పిటల్ కు ఎన్ని సార్లు వెళ్లావని అడుగుతారు. మూడు సార్లు అని చెప్తే మిషన్ అరుస్తుంది. ఒక్కసారి అని చెప్పినా అరుస్తుంది. మరి ట్యాబ్లెట్స్ ఎవరు తెచ్చారని అడిగితే, సుక్కు తెచ్చిందని చెప్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More