ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 18 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే మే 18 ఎపిసోడ్ లో.. పచ్చటి పొలాల మధ్య ధీరజ్, ప్రేమ రొమాన్స్ చేస్తారు. ఇక అమూల్యపై కోపంతో విశ్వక్ రగిలిపోతుంటాడు. తనతో అమూల్య ఉన్న ఫొటోను చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంటాడు. మరోవైపు కాలేజీకి రెడీ అయిన అమూల్య భయపడుతుంటుంది.
అమూల్య భయం

నేను కాలేజీకి వెళ్లను నాన్న. నేను చదువు మానేస్తాను అని అమూల్య అనగానే అందరూ షాక్ అవుతారు. ఇంకొన్ని రోజుల్లో పరీక్షలు పెట్టుకుని చదువు మానేస్తానంటావేంటీ? అని వేదవతి అడుగుతుంది. అమ్మా నాకు కాలేజీకి వెళ్లాలని లేదని అమూల్య చెప్తుంది. ఆ విశ్వక్ జైలు నుంచి రిలీజై వచ్చాడని భయపడుతున్నావా? అని ధీరజ్ అడుగుతాడు.
ధీరజ్ ధైర్యం
వాడు నీ జోలికి వస్తే ఊరుకుంటానా? అంత తేలిగ్గా వదిలేస్తానా? బతకడానికే భయపడేలా చేస్తానని ధీరజ్ చెప్తాడు. అతనికి భయపడటం ఏంటీ? అని నర్మద, ప్రేమ కూడా ధైర్యం చెప్తారు. ఆడపిల్ల అంటే వల్లీలా ధైర్యంగా ఉండాలని సుక్కు అనేసరికి శ్రీవల్లి కంగారు పడుతుంది. జైలుకు వెళ్లి వచ్చిన వాడికి భయం ఉంటుందని రామరాజు కూడా అంటాడు.
ఊగిపోతున్న విశ్వక్
మరోవైపు జైలుకు వెళ్లి వస్తే పరివర్తన వస్తుంది. కానీ నాకు పగ పెరుగుతూనే ఉంది. నిన్ను, నీ జీవితాన్ని నాశనం చేయకుండా వదులుతానా అని అమూల్య ఫొటోను చూస్తూ విశ్వక్ ఊగిపోతాడు. ఆ విశ్వక్ నీ జోలికి వస్తే ఊరుకోను. వాడిని చంపి నేను జైలుకు వెళ్తానని రామరాజు అంటాడు. అమూల్య కాలేజీకి వెళ్తుంది.
సుక్కుకు డౌట్
మరోవైపు ధీరజ్, ప్రేమల పెళ్లి వెనుక ఏదో పెద్ద సునామీ ఉందని డౌట్ కొడుతుందని శ్రీవల్లితో సుక్కు చెప్తుంది. ఈ సునామీ మీద మనం ఓ సూపు సూడాల్సిందేనని వల్లి అంటుంది. ఇక సుక్కు అంకుల్ అని పిలుస్తుందని తిరుపతి ఫీల్ అవుతాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ధీరజ్, ప్రేమను సలహా అడుగుదామనుకుంటాడు తిరుపతి.
టిప్స్ అడిగిన తిరుపతి
{{/usCountry}}మరోవైపు ధీరజ్, ప్రేమల పెళ్లి వెనుక ఏదో పెద్ద సునామీ ఉందని డౌట్ కొడుతుందని శ్రీవల్లితో సుక్కు చెప్తుంది. ఈ సునామీ మీద మనం ఓ సూపు సూడాల్సిందేనని వల్లి అంటుంది. ఇక సుక్కు అంకుల్ అని పిలుస్తుందని తిరుపతి ఫీల్ అవుతాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కాబట్టి ధీరజ్, ప్రేమను సలహా అడుగుదామనుకుంటాడు తిరుపతి.
టిప్స్ అడిగిన తిరుపతి
{{/usCountry}}జీవితాంతం బ్రహ్మచారిలో మిగిలిపోతానేమోనని భయంగా ఉంది అల్లుడు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా సెట్ అయిపోయారు. నా గురించి ఆలోచిస్తున్నారా? దేవకన్యను ఎలా పడేయాలో టిప్స్ చెప్పమని తిరుపతి అడుగుతాడు. అమ్మాయి నడుచుకుంటూ వెళ్తే కాలు అడ్డుపెట్టానని ధీరజ్ ఫన్నీగా చెప్తాడు.
అంకుల్
కాలు అడ్డుపెట్టి ప్రేమను పడేసిన సీన్ ను కళ్లకు కట్టినట్లు ధీరజ్ చేసి చూపిస్తాడు. నీకు నాకు ప్రేమ అంటూ ఈ జంట మళ్లీ సాంగ్ వేసుకుంటుంది. ఇక చెలరేగి పోతానని తిరుపతి వెళ్తాడు. మరోవైపు వెళ్లు వచ్చి గోదారమ్మా అంటూ నడుం మీద బిందెతో సుక్కు వ్లాగ్ చేస్తుంది. నా దేవకన్య వచ్చేస్తుంది, కాలు పెట్టి పడగొడతానని తిరుపతి కాలు అడ్డం పెడతాడు. తిరుపతి కింద పడతాడు. పైన బిందె పడుతుంది. అంకుల్ అని సుక్కు నవ్వేస్తుంది.
రామరాజు ఎమోషనల్
బొమ్మలు తీసుకొచ్చి బుజ్జమ్మ అని పిలిచి రామరాజు మురిసిపోతాడు. ఇవి కేవలం బొమ్మలు కాదు బుజ్జమ్మా, మన కుటుంబం. ఒకప్పుడు నేను అనాథను. ఎక్కడ, ఎవరికి పుట్టానో కూడా తెలియదు. అందరూ నన్ను దిక్కులని వాడినని అవమానించి మాట్లాడితే ప్రాణం పోతున్నంత బాధగా ఉండేది. ఆ దేవుడి నీ రూపంలో నాకు పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన పెద్ద కోడలు వల్లి వల్ల మూడో తరం రాబోతుంది. మనవలు, మనవరాళ్లు వస్తారు. ఈ రోజు రామరాజు కుటుంబం కొన్ని తరాల వంశంగా మారబోతుందని రామరాజు ఫీల్ అవుతాడు.
వల్లి షాక్
నా ద్వారా మనవడు రాబోతున్నాడని మామయ్య ఆనందంతో తేలిపోతున్నాడు. కానీ కడుపు అబద్ధం అని తేలితే పరిస్థితి ఏంటీ? అని శ్రీవల్లి అనుకుంటుంది. కడుపులో బిడ్డ ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకుంటున్నావా? అని వల్లిని రామరాజు అడుగుతాడు. తీసుకుంటున్నానని వల్లి చెప్తుంది. ఆ విషయం చెప్పాల్సింది డాక్టర్. ఈవెనింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానని నర్మద చెప్పడంతో వల్లి షాక్ అవుతుంది.
తప్పించుకునేందుకు వల్లి ప్రయత్నిస్తుంది. కానీ ఫస్ట్ టైమ్ ప్రెగ్నెన్సీ కదా పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్ కు చూపించాలని నర్మద చెప్తుంది. వేదవతి, రామరాజు కూడా అదే మాట చెప్తారు. ఇక్కడితో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.