ఇల్లు ఇల్లాలు పిల్లలు మే 26 ఎపిసోడ్: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే మే 26 ఎపిసోడ్ లో.. తన ఫ్రెండ్స్ తో ఏడిపించినా కూడా అమూల్య కాలేజీకి రావడం చూసి విశ్వక్ షాక్ అవుతాడు. దానిలో ధైర్యం చాలా ఉందని అర్థమవుతుంది. ఆ ధైర్యాన్ని చంపేయండి. వేరే రేంజ్ లో దాన్ని హింసించండని ఫ్రెండ్స్ కు చెప్పి పంపిస్తాడు విశ్వక్.
బాదేసిన అత్తాకోడళ్లు

విశ్వక్ ఫ్రెండ్స్ వెళ్లి అమూల్యతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారు. రూమ్ ఎక్కడ బుక్ చేయమంటావ్ అంటూ అసభ్యంగా మాట్లాడతారు. నేను మీకు బుక్ చేస్తారా ఐసీయూలో అని ధీరజ్ కోపంతో ఎంట్రీ ఇస్తాడు. మిమ్మల్ని ఆడ లేడీస్ తో కొట్టిస్తానని ధీరజ్ విజిల్ వేస్తాడు. కొబ్బరి బోండం తాగుతూ కళ్లద్దాలతో ప్రేమ, నర్మద, వేదవతి స్టైల్ గా ఎంట్రీ ఇస్తారు. వికెట్లతో విశ్వక్ బ్యాచ్ ను చితక్కొడతారు.
విశ్వక్ ను కొట్టిన ధీరజ్
మరోవైపు పారిపోతున్న విశ్వను ధీరజ్ పట్టుకుని కొడతాడు. విశ్వక్ తప్పించుకొని పారిపోతాడు. పోకిరీ గ్యాంగ్ ను వేదవతి, ప్రేమ, నర్మద కలిసి బాదేస్తారు. ఇక ప్రాబ్లెం సాల్వ్, హ్యాపీగా కాలేజీకి వెళ్లొచ్చని అమూల్యకు ధీరజ్ చెప్తాడు. చిన్న కొడుకును వేదవతి తెగ పొగిడేస్తుంది.
విశ్వక్ అబద్ధం
సీన్ భద్రావతి ఇంటికి మారుతుంది. ధీరజ్ నన్ను అన్యాయంగా కొట్టాడని విశ్వక్ తెగ నటించేస్తాడు. ముందు వీడు ఏం చేశాడో అడుగు? ఆ ధీరజ్ అన్యాయంగా ఎవరి జోలికి వెళ్లడని శారదాంబ అంటుంది. నా ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ కూర్చుంటే ధీరజ్ వచ్చి కొట్టాడని విశ్వక్ అబద్ధం చెప్తాడు. ధీరజ్ కూడా నా మనవడే. వాడు తప్పు చేయడని శారదాంబ గట్టిగానే చెప్తుంది.
భద్రావతి సీరియస్
ధీరజ్ చాలా ఎక్కువ చేస్తున్నాడక్కా. వాడిని ఏదో ఒకటి చేయాలక్కా అని సేనాపతి ఊగిపోతాడు. వాడికి కారు ఎలా వచ్చిందో కనుక్కోమన్నా కదా అని భద్రావతి అడుగుతుంది. ఫైనాన్స్ ఇచ్చిన దండపాణి మనకు చాలా కావాల్సినవాడని సేనాపతి చెప్తాడు. అక్కడి నుంచి నరుక్కొస్తే వాడి కుటుంబం మొత్తం నడిరోడ్డుపై ఉంటుందని భద్రావతి సీరియస్ గా చెప్తుంది.
వల్లి షాక్
{{/usCountry}}ధీరజ్ చాలా ఎక్కువ చేస్తున్నాడక్కా. వాడిని ఏదో ఒకటి చేయాలక్కా అని సేనాపతి ఊగిపోతాడు. వాడికి కారు ఎలా వచ్చిందో కనుక్కోమన్నా కదా అని భద్రావతి అడుగుతుంది. ఫైనాన్స్ ఇచ్చిన దండపాణి మనకు చాలా కావాల్సినవాడని సేనాపతి చెప్తాడు. అక్కడి నుంచి నరుక్కొస్తే వాడి కుటుంబం మొత్తం నడిరోడ్డుపై ఉంటుందని భద్రావతి సీరియస్ గా చెప్తుంది.
వల్లి షాక్
{{/usCountry}}మరోవైపు ఇంట్లో గీత గీసింది నేనే అంటూ సుక్కుతో కలిసి శ్రీవల్లి గెంతులు వేస్తుంది. అప్పుడే ప్రేమ, నర్మద రావడంతో ఈ పాపిష్టి చేతులతో గీత గీశానని వల్లి డ్రామా స్టార్ట్ చేస్తుంది. నువ్వసలు నిజంగా ప్రెగ్నెంట్ వేనా? అని ప్రేమ అడగడంతో వల్లి షాక్ అవుతుంది. కడుపుతో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ నువ్వు మాత్రం కల్లు తాగిన కోతిలా గెంతులేస్తున్నావని నర్మద అనుమానంతో అడుగుతుంది.
హాస్పిటల్ కు వెళ్దామని
కడుపులో బిడ్డ యాక్టివ్ గా ఉండాలంటే ఎక్సర్ సైజ్ లు చేయాలని డాక్టరమ్మా చెప్పిందని సుక్కు కవర్ చేస్తుంది. ఇలా పిచ్చిపట్టినట్లు ఎగరడం ఎక్సర్ సైజ్ కాదని ప్రేమ అంటుంది. డాక్టర్ కంటే ఎక్కువ తెలుసా? అని సుక్కు అడగడంతో ఇప్పుడు హాస్పిటల్ కు వెళ్దాం పదా బల్లక్కాయ్ అని నర్మద, ప్రేమ అనడంతో వల్లి షాక్ అవుతుంది.
వన్ సెకండ్ అని సుక్కు లోపలికి వెళ్లి ట్యాబ్లెట్స్ తో బయటకు వస్తుంది. ఆల్రెడీ హాస్పిటల్ కు తీసుకెళ్లా. ట్యాబ్లెట్స్ రాసి ఇచ్చారని సుక్కు చెప్తుంది. మరి ఆ విషయం వల్లి చెప్పాలి కదా, కానీ ఎందుకు సైలెంట్ గా ఉందని నర్మద అడుగుతుంది. సుక్కు ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది. ఈ ట్యాబ్లెట్స్ ఏంటి ఇన్ని ఉన్నాయి? పదండి హాస్పిటల్ కు వెళ్దాం అని వల్లిని ప్రేమ, నర్మద లాక్కొని వెళ్తారు.
వల్లి డ్రామా
అప్పుడే రామరాజును చూసిన వల్లి కళ్లు తిరిగి పడిపోయినట్లు డ్రామా చేస్తుంది. రామరాజు కంగారుగా వస్తాడు. వల్లి కడుపుతో ఉందని తెలిసినా ఈ ఇద్దరు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారని సుక్కు చెప్తుంది. ముఖంపై నీళ్లు చల్లితే వల్లి లేస్తుంది. అసలే టెన్షన్ లో ఉన్న వల్లిని వీళ్లు ఇంకా బాధపెడుతున్నారని సుక్కు చెప్తుంది.
కడుపుతో ఉన్నవాళ్లకు ఇన్ని ట్యాబ్లెట్స్ రాయరు కదా. అందుకే మంచి హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అనుకున్నామని ప్రేమ, నర్మద చెప్తారు. కోడలిని ఎలా చూసుకోవాలో అత్తమామకు తెలియదా? మీరేమైనా ఇద్దరు ముగ్గురు పిల్లలను కన్నారా? అని రామరాజును రెచ్చగొట్టేలా సుక్కు మాట్లాడుతుంది.
నర్మదపై ఫైర్
గీత బయట ఉన్న నీకు మా ఇంటి విషయాలు అనవసరం. మీ నాన్న రావడం వల్లే గొడవ జరిగింది. నీకు తెలియకుండా ఉంటుందా? అని నర్మదపై రామరాజు ఫైర్ అవుతాడు. వల్లిని ఇంకోసారి ఇబ్బంది పెడితే బాగోదని కోడళ్లకు రామరాజు వార్నింగ్ ఇస్తాడు.
కట్ చేస్తే ధీరజ్ ను గుర్తు చేసుకుంటూ ఉంటుంది ప్రేమ. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ ముగుస్తుంది.