...
...
Next Story

Illu Illalu Pillalu November 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-ట్రావెల్ ఏజెన్సీ సంబరం-రౌడీలతో భాగ్యం, భద్రావతి-చందు సారీ

Illu Illalu Pillalu November 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 12 ఎపిసోడ్ లో ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీ ఓపెనింగ్ పనుల్లో అందరూ సందడి చేస్తారు. వల్లిని రమ్మని నర్మద కాల్ చేస్తుంది. తండ్రికి చందు సారీ చెప్తాడు. మరోవైపు ఈవెంట్ ను చెడగొట్టేందుకు రౌడీలను భద్రావతి పురమాయిస్తుంది.

Published on: Nov 12, 2026, 07:54:51 IST
Advertisement

Illu Illalu Pillalu November 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ట్రావెల్ ఏజెన్సీ ఆఫీసు ఓపెనింగ్ కోసం రామరాజు ఫ్యామిలీ సందడి చేస్తుంది. అందరూ ఏర్పాట్లలో మునిగిపోతారు. నేమ్ బోర్డు మీద తన పేరు ఎలా రాయించాడో చూద్దామని ప్రేమ ట్రై చేస్తుంది.

ప్రేమ కంగారు

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

కర్రతో ఆ బోర్డు మీద ఉన్న క్లాత్ ను తీయాలని చూస్తుంది. కానీ ప్రేమకు అది అందదు. ప్రేమను చూసి అందరూ నవ్వుకుంటారు. ఎందుకే ఆ కంగారు? ఓపెనింగ్ అయిన తర్వాత చూస్తావ్ కదా అని ధీరజ్ వచ్చి మొట్టికాయలు వేస్తాడు. పేరు పెద్ద పెద్ద అక్షరాలతో రాయించా. నీకిష్టమైన కలరే అని ధీరజ్ వెటకారంగా అంటాడు.

సుక్కుకు వార్నింగ్

పేరు చూడాలని ఉందని ప్రేమ మెలికలు తిరిగిపోతుంది. భర్తలు మన కోసం ఏం చేసినా స్పెషలే అని అంటుంది. ఇదంతా మనదే కదా ప్రేమ అని సుక్కు అంటుంది. ఇదిగో బాబాయ్ మీ ఆవిడ మనదే అని కలుపుకుపోతుంది. ఈవిడ ఆ వల్లి అక్క మనిషి. ఇంకోసారి మనది అంటే ఊరుకోనని ప్రేమ వార్నింగ్ ఇస్తుంది.

పొట్ట తగ్గించాలి ధీరజ్

వచ్చిన గెస్ట్ లకు నర్మద, ప్రేమ నీళ్లు, టీ అందిస్తుంటారు. అప్పుడే వచ్చిన కామాక్షి ఏమో ప్రేమ చేతుల్లో నుంచి గ్లాస్ లు తీసుకుంటుంది. నువ్వు ఓనర్ అమ్మవి. ఈ రోజు నుంచి నీ కింద పనివాళ్లు ఉంటారు. మేం చేస్తాంలే అని కామాక్షి వెటకారంగా అంటుంది. నువ్వెందుకు అక్క చేయడం? అది చేస్తుందేలే. కాస్త ఒళ్లు వంగినట్లు కూడా ఉంటుందని ధీరజ్ అంటాడు. ధీరజ్ పొట్ట తగ్గించాలని ప్రేమ కౌంటర్ వేస్తుంది.

రూ.15 లక్షల అప్పు రాయించమంటావా?

మరోవైపు ఆరుగురు రౌడీలను భాగ్యం పురమాయిస్తుంది. మేడం, నేను కూడా వస్తాం. డబ్బులు ఎంతైనా సరే మేడం (భద్రావతి) ఇస్తుంది. నేను చెప్పిన పని చేయండని ఆ రౌడీలతో భాగ్యం ఫోన్లో మాట్లాడుతుంది. ఇక వల్లికి నర్మద కాల్ చేస్తుంది. ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేస్తున్నాడు. ఈ రోజే పూజ. నువ్వు ఇక్కడికి రా అని వల్లికి నర్మద చెప్తుంది.

అంతా చూసుకుంటా

నన్ను అసలు అక్కడికి రానిస్తారా? నేను వస్తే ఆనందంగా ఉన్న వాళ్ల మనసులు బాధపడతాయి. ఎందుకు వచ్చావని బా సీరియస్ అవుతాడు. బా అలా మాట్లాడితే నేను తట్టుకోలేనని వల్లి చెప్తుంది. నువ్వు రాకపోతే ఇక మాట్లాడను. ఇక్కడ ఏం జరగకుండా నేను చూసుకుంటా. ఓ నాలుగు మాటలు అంటే ఏం పర్లేదు. నేను చూసుకుంటానని నర్మద చెప్పడంతో వెళ్లేందుకు వల్లి సరేనంటుంది.

ధీరజ్ ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేస్తున్నాడంటా. నర్మద రమ్మందని తల్లి భాగ్యానికి బల్లక్కాయ్ చెప్తుంది. నీ కోసం హారతి పట్టేవాళ్లు ఎవరూ అక్కడ ఉండరు. ఎందుకు వచ్చావని పరువు తీస్తారని భాగ్యం చెప్తుంది. నా అత్తారోళ్లే కదా అని వల్లి వెళ్తుంది.

అంజలి పేరుతో

ఇటు ఇంట్లో అంజలి అంటూ నిద్రలో నుంచి చందు ఉలిక్కిపడి లేస్తాడు. ఇదంతా కలనా, ఇన్ని రోజుల తర్వాత అంజలి నా కలలోకి రావడం ఏంటని చందు అనుకుంటాడు. చిన్నోడి ట్రావెల్ ఆఫీసు ఓపెనింగ్ కు మీరు వెళ్లలేదా అని అమ్మానాన్నను అడుగుతాడు చందు. నువ్వు వస్తావని ఎదురు చూస్తున్నాం. కొత్తగా ఈ తాగడం ఎందుకురా? మేమెంత బాధపడతామో ఊహించావా? అని వేదవతి అంటుంది.

క్షమించు నాన్న

పెద్దోడా రెడీ అవ్వు. ట్రావెల్ ఏజెన్సీకి వెళ్దాం. చిన్నోడు అక్కడ ఎదురు చూస్తుంటాడని చందుకు రామరాజు చెప్తాడు. రామరాజును అన్న మాటలు గుర్తు తెచ్చుకుని చందు ఫీల్ అవుతాడు. తండ్రిని హత్తుకొని క్షమించమని అడుగుతాడు. కోపంలో ఏదో మాట్లాడానని చెప్తాడు. నువ్వు ఎందుకు అలా మాట్లాడావో నేను అర్థం చేసుకోగలను పెద్దోడా అని రామరాజు అంటాడు. విడాకుల విషయం తప్పా ఏది చెప్పినా వింటా నాన్న అని చందు ఏడుస్తాడు.

వేదవతికి కాల్ చేసి వస్తున్నారా లేేదా? అని ప్రేమ అడుగుతుంది. పది నిమిషాలని వేదవతి చెప్తుంది.

భద్రావతి కుట్ర

ధీరజ్ కల నిజం కాకూడదు. రామరాజు ఆనందం ఆవిరైపోవాలి. నా గురించి తెలిసి కూడా ఆ ధీరజ్ నా ముఖాన ఇన్విటేషన్ విసిరి కొట్టి, ముఖ్య అతిథి నేనే అని చెప్పాడు. ఇంకోసారి నా జోలికి రాకుండా చేయాలి. ధీరజ్ కు గుణపాఠం అంటే ఏంటో తెలియాలని రౌడీలకు భద్రావతి డబ్బు ఇప్పిస్తుంది.

మేడం నా మీద నమ్మకంతో మీకు పని అప్పగించారు. మేడం చేతికి మట్టి అంటకూడదు. మీరు చెప్పింది చెప్పినట్లు చేయాలని భాగ్యం రౌడీలతో అంటుంది. మీరు చెప్పినట్లు చేసి తీరుతామని రౌడీలు చెప్తారు. వాళ్లకు భాగ్యం ఏదో చెప్తుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks