...
...
Next Story

Illu Illalu Pillalu November 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు-వల్లికి నర్మద 420 ఐడియా-బల్లక్కాయ్ గెటప్-సాగర్ లంచం డబ్బు

Illu Illalu Pillalu November 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే నవంబర్ 17 ఎపిసోడ్ లో వల్లికి నర్మద ఐడియా ఇస్తుంది. లంచం డబ్బు తీసుకొచ్చి సాగర్ దాస్తాడు. నర్మదకు అనుమానం వస్తుంది. ఇక వల్లి ఏమో కూరగాయలు అమ్మే మహిళగా ముసుగు వేసుకొని వస్తుంది. చందు సీరియస్ వార్నింగ్ ఇస్తాడు.

Published on: Nov 17, 2026, 08:01:44 IST
Advertisement

Illu Illalu Pillalu November 17 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. ట్రావెల్ ఏజెన్సీకి తన పేరు పెట్టడంపై వేదవతితో మురిసిపోతూ రామరాజు మాట్లాడతాడు. చిన్నోడు, చిన్న కోడలి గురించి బెంగ లేదు. నా బాధంతా పెద్దోడు చందు గురించే. వాడు త్వరగా ఆ బాధ నుంచి బయటపడాలని రామరాజు అంటాడు.

రామరాజు కంగారు

ఇల్లు ఇల్లాలు పిల్లలు-వల్లికి నర్మద 420 ఐడియా-బల్లక్కాయ్ గెటప్-సాగర్ లంచం డబ్బు (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు-వల్లికి నర్మద 420 ఐడియా-బల్లక్కాయ్ గెటప్-సాగర్ లంచం డబ్బు (jiohotstar)

పెద్దోడు ఆ బాధ నుంచి బయటపడేందుకు కాస్త సమయం పడుతుంది. మీరు ఏం అనకండి, ఏం అడక్కండని భర్తకు వేదవతి చెప్తుంది. మరి నడిపోడి గొడవ ఏంటీ? రూ.20 లక్షలు తెస్తానన్నాడు కదా అని రామరాజు అంటాడు. మీరు వాడి జోలికి వెళ్లకండి. వాడు కష్టపడతా అంటున్నాడు కదా అని వేదవతి చెప్తుంది. వాడు ఆవేశంలో ఏం గొడవలు తెస్తాడో అని కంగారుగా ఉందని రామరాజు అంటాడు.

మరోవైపు ఎవరో వ్యక్తి నుంచి లంచం తీసుకొని ఫైల్ ఇస్తాడు సాగర్. ఇదంతా అతని ఫ్రెండ్ వీడియో తీస్తాడు. ప్రాబ్లం ఎలా రాదో నేనూ చూస్తా. పొద్దున ప్రాబ్లం మీ ఇంటివరకూ వస్తుందని ఆ ఫ్రెండ్ అనుకుంటాడు.

వల్లికి నర్మద ఐడియా

ఇక వల్లిని చందు అన్న మాటలు తలుచుకుని నర్మద బాధపడుతుంది. మరోవైపు అంజలి ఎవరు? అని వల్లి ఆలోచిస్తుంటుంది. అప్పుడే వల్లికి నర్మద కాల్ చేస్తుంది. బావ తిట్టారని బాధపడుతున్నావా అక్కా అని నర్మద అడుగుతుంది. లేదు చెల్లి. నన్ను రానిచ్చినందుకు సంతోషంగానే ఉందని వల్లి చెప్తుంది. కానీ చందు బావ అంత ఈజీగా మారేలా లేడని నర్మద అంటుంది. తరచుగా బావకు, ఇంట్లోవాళ్లకు కనిపిస్తూ ఉండమని వల్లికి నర్మద ఐడియా ఇస్తుంది.

అప్పుడే సాగర్ కంగారుగా వచ్చి బయట మొక్కల దగ్గర డబ్బు దాచడాన్ని నర్మద చూస్తుంది. ఏం దాచిపెడుతున్నావ్ అని నర్మద అడుగుతుంది. ఏం లేదని సాగర్ చెప్తాడు. డబ్బులు అరెంజ్ అయ్యాయని చెప్తాడు. మా ఫ్రెండ్స్ ను అడిగానని అబద్ధం చెప్తాడు. ఏమన్నా తేడా వస్తే అప్పుడు నీ సంగతి చెప్తానని నర్మద అనుకుంటుంది.

అర్ధరాత్రి విశ్వ

ఇక విశ్వ అర్ధరాత్రి దొంగలా అమూల్య కోసం వస్తాడు. అతణ్ని చూసి అమూల్య గట్టిగా అరుస్తుంది. ఏంట్రా అత్తారింటికి వచ్చినట్లు వస్తున్నావని కోప్పడుతుంది. నీకు ఇష్టమని ఛాక్లెట్ తెచ్చానని విశ్వ ఇస్తాడు. రాత్రి ఎవరైనా పడుకొనే ముందు ఛాక్లెట్ తింటారా? ఇప్పటికే మా ఫ్రెండ్స్ నన్ను గుమ్మడికాయ అని పిలుస్తున్నారని అమూల్య చెప్తుంది. గాడిదకేం తెలుసు గంధపు వాసన.

అయినా నాకు లేని బాధ వాళ్లకు ఎందుకు? నువ్వు సన్నగా అయిపోతే మనల్ని జంటగా చూడటానికి బాగుండదని విశ్వ అంటాడు. ఛాక్లెట్ తీసుకొని విశ్వను అమూల్య పంపించేస్తుంది.

అయితే విశ్వను సుకన్య చూస్తుంది. ఈ టైమ్ లో ఎవరు అని సుక్కు వెనుకాల పడుతుంది. అప్పుడే తిరుపతి బయటకు వస్తాడు. ఎవరో అనుకొని తిరును సుక్కు కుమ్మేస్తుంది. అప్పుడే మళ్లీ విశ్వను సుక్కు చూస్తుంది. అమూల్య, విశ్వకు మధ్య ఏడో నడుస్తుందని అనుకుంటుంది.

వల్లి కొత్త అవతారం

ఉదయం కూరగాయలు అమ్మే అమ్మాయిలా నెత్తిపై బుట్ట ఎత్తుకొని, ముఖానికి ముసుగు వేసుకొని రామరాజు ఇంటికి వల్లి కొత్త అవతారంలో వస్తుంది. ఈ కూరగాయలు అమ్మే ఆవిడను ఎక్కడో చూసినట్లు ఉందే అని ధీరజ్, ప్రేమ, సుక్కు అనుమానపడతారు. అలా అనుమానంగా చూడకు మరిది. ప్రేమ నువ్వు నాకు చెల్లెలాంటివే. ఏమంటావ్ సుకన్య అని అందరి పేర్లు చెప్పి వల్లి ఇరుక్కుంటుంది. వేదవతిని అత్తయ్య అని అంటుంది.

ముసుగు లాగేసిన సుక్కు

ఏంటే అత్తయ్య అంటున్నావ్? పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా కూరగాయలు ఎలా ఇస్తున్నావో చెప్పు అని వేదవతి అడుగుతుంది. కూరగాయల రేట్లు అన్ని చాలా తక్కువగా చెప్తుంది వల్లి. మోసపోకు అమ్మాయి అని వేదవతి అంటుంది. ఎన్నో మోసాలు చేశానని వల్లి అంటుంది. ఏదో డౌట్ కొడుతుందని ముఖానికి ఉన్న చీర కొంగు ముసుగును సుక్కు లాగేస్తుంది.

చందు సీరియస్ వార్నింగ్

రామరాజు పెద్ద కోడలివి. భాగ్యం ముద్దుల కూతురివి. నువ్వు కూరగాయల అమ్మడం ఏంటీ అని సుక్కు అడుగుతుంది. హే గవర్నమెంటూ ఈ ప్లాన్ నీదేనా అని నర్మదపై వేదవతి అనుమానపడుతుంది. ఇందులో ఎవరి ప్రమేయం లేదని వల్లి చెప్తుంది. నేను మారిపోయాను. ఆ విషయం మీకు ఎలా అర్థమయేలా చెప్పాలో తెలియడం లేదని వల్లి అంటుంది.

నువ్వు ఏం చేసినా మా ఇంట్లోకి రావు. అయినా నీకు బుద్ధి లేదు. కూరగాయలు అమ్ముతూ మా పరువు తీస్తున్నావ్. జనాలు తలా ఒక మాట అనుకుంటూ మా నాన్నను బాధపెట్టాలనే కదా ఈ ప్లాన్ చేశావని చందు అంటాడు. దీంతో వల్లి ప్లాన్ రివర్స్ అయినట్లు కనిపిస్తుంది. కానీ డివోర్స్ పేపర్స్ పంపించాక ఆవిడ ఏం చేస్తే మనకేంటని చందుకు నర్మద కౌంటర్ వేస్తుంది.

విడాకులు కాగితాలు పంపించా కదా నువ్వు మా ఇంటి చుట్టూ తిరగకు అని చందు గట్టిగా చెప్తాడు. విడాకుల పేపర్లపై ప్రాణం పోయినా సంతకం పెట్టమని వల్లి అంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks