Illu Illalu Pillalu November 5 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. విడాకుల నిర్ణయం తన ఇష్టమని చందు చెప్పడంతో రామరాజుకు ఎక్కడలేని కోపం వస్తుంది. ఈ ఒక్క విషయంలో మాత్రం తన ఇష్టానికి వదిలేయ్యాలని తండ్రిని చందు రిక్వెస్ట్ చేస్తాడు.
తెగేసి చెప్పిన చందు

దయచేసి ఈ విషయంలో నా మనసు మార్చాలని చూడకండి. వల్లికి విడాకులు ఇచ్చి తీరుతానని చందు తెగేసి చెప్తాడు. వెంటనే కుదరదు అని రామరాజు అరుస్తాడు. వల్లికి విడాకులు ఇస్తానంటే ఒప్పుకోను. పెళ్లి చేసుకుంది చిన్న గొడవ రాగానే విడాకులు ఇవ్వడం కోసం కాదు. కలకాలం కలిసి ఉంటారని అని రామరాజు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు.
తండ్రికి షాక్
విడాకులు ఇస్తే ఆ అమ్మాయికి జీవితమే దూరమవుతుంది. మన ఇంటిబిడ్డకు ఇలాగే విడాకులు ఇస్తామంటే ఎలా ఉంటుంది? వల్లి మారిందని నమ్ముతున్నా. నీకు నమ్మకం కలిగినప్పుడే ఇంటికి తీసుకు రా అని రామరాజు చెప్తాడు. కానీ చందు వినడు. వల్లికి విడాకులు ఇవ్వాల్సిందేనంటాడు. వల్లిని పెళ్లి చేసుకునే విషయంలోనే మీ మాట విని తప్పు చేశాననిపిస్తుందని చందు బాంబ్ పేలుస్తాడు.
రామరాజు మాటతో నాశనం
నీ జీవితం నేను నాశనం చేశానా పెద్దోడా అని రామరాజు ఫీల్ అవుతాడు. అవును మీ మాట వినడం వల్లే నా జీవితం నాశనమైంది. చిన్నోడు, నడిపోడి లాగా మీ మాట వినకుండా నా నిర్ణయం నేను తీసుకుంటే వాళ్లలాగా హ్యాపీగా ఉండేవాడిని. నేను ప్రేమించిన అమ్మాయిని కూడా మీ వల్లే వదిలేశా. నేను తనకు దూరమైనప్పుడు ఎంతలా ఏడ్చిందో నాకు తెలుసు నాన్న. ఆమె ఉసురు తగిలే నా జీవితం ఇలా అయిందేమోనని చందు కుండబద్ధలు కొడతాడు.
నేను చేసింది తప్పా?
చిన్నప్పటి నుంచి మీకు నచ్చినట్లే బతికా నాన్న. నిన్ను, అమ్మను మోసం చేసిందనే వల్లిపై నాకు కోపం. ఇప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తున్నా నాన్న అని చందు చెప్తాడు. నా కొడుకులు గొప్పగా ఉండాలనుకోవడం తప్పా? నాకు చదువు లేదని తల దించుకున్నా. అలాంటి పరిస్థితి మీకు రాకూడదని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానని రామరాజు ఎమోషనల్ అవుతాడు.
{{/usCountry}}చిన్నప్పటి నుంచి మీకు నచ్చినట్లే బతికా నాన్న. నిన్ను, అమ్మను మోసం చేసిందనే వల్లిపై నాకు కోపం. ఇప్పుడు కూడా మీ గురించే ఆలోచిస్తున్నా నాన్న అని చందు చెప్తాడు. నా కొడుకులు గొప్పగా ఉండాలనుకోవడం తప్పా? నాకు చదువు లేదని తల దించుకున్నా. అలాంటి పరిస్థితి మీకు రాకూడదని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చానని రామరాజు ఎమోషనల్ అవుతాడు.
{{/usCountry}}ఇంకా మీరు వల్లి గురించి ఆలోచించి నా జీవితం నాశనం చేయొద్దు. ఇకనైనా నా జీవితం నన్ను బతకనివ్వండి ప్లీజ్ అని తండ్రికి చందు చేతులెత్తి మొక్కుతాడు. అప్పుడే అలా చేయడం తప్పు బావ అని చెప్పిన విశ్వపై చందు సీరియస్ అవుతాడు. వాడిని కాదు నన్ను కొట్టు అని రామరాజు గొడవను ఇంకా పెద్దది చేస్తాడు. చందు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
బాధతో రామరాజు కూలబడిపోతాడు. పెద్దోడు మానసికంగా సరిగ్గా లేడని వేదవతి చెప్తుంది. పెద్దోడి మనసులోని ఆవేదన బయటకు వచ్చిందని తండ్రిని మరింత బాధపెట్టేలా సాగర్ మాట్లాడతాడు.
భద్రావతి ఆనందం
ఇటు భద్రావతి, సేనాపతి తెగ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు చందు, వల్లి విడాకుల విషయం ఊరంతా తెలిసింది. ఈ ఆనందం ఊరందరితో పంచుకోవాలని విశ్వను భద్రావతి పిలుస్తుంది. కూలీలందరికీ నెల జీతం బోనస్ గా ఇవ్వు. షాప్ లకు ఒక నెల రెంట్ లేదని చెప్పమని భద్రావతి చెప్తుంది. రామరాజుపై పగ తీర్చుకోవడానికి ఇది సరిపోదు. ఇంకా డోస్ పెంచాలని భద్రావతి అంటుంది.
రామరాజుపై పెద్ద కొడుకు తిరగబడ్డాడంటా అని భద్రావతికి సేనాపతి చెప్తాడు. ముందు ధీరజ్ ను దెబ్బ కొట్టాలిరా సేనా. చింతామణికి కాల్ చేయ్. ట్రావెల్స్ ఆక్షన్ కు డబ్బులు కట్టడానికి ఇవాళే లాస్ట్ రోజు అని చెప్పమను. ధీరజ్ ను పాలేరును చేయాలని భద్రావతి చెప్తుంది. ఈ మాటలను విశ్వ వింటాడు.
చింతామణి కాల్
అప్పుడే ధీరజ్ కు చింతామణి కాల్ చేస్తుంది. డబ్బులు కట్టేద్దామంటుంది. అప్పుడే ప్రేమ వచ్చి సంగతి ఏంటీ అని అడుగుతుంది. ట్రావెల్స్ ఆఫీస్ కు రమ్మని చింతామణి ఫోన్ చేసిందని ధీరజ్ చెప్తాడు. హమ్మయ్యా డబ్బులు సెట్ అయిపోయాయన్నమాట అని ధీరజ్ బుగ్గలు పట్టుకుంటుంది ప్రేమ.
నిజం దాచిన ప్రేమ, ధీరజ్
అప్పుడే నర్మద వస్తుంది. డబ్బులు ఏంటీ అని అడుగుతుంది. కానీ చింతామణి విషయం చెప్పకుండా ధీరజ్, ప్రేమ దాచేస్తారు. ఫైనాన్స్ లో డబ్బులు తీసుకుంటున్నామని చెప్తారు. ఇక వల్లి గురించి బావగారికి నువ్వే చెప్పాలని ధీరజ్ ను నర్మద అడుగుతుంది. కానీ ఈ విషయంలో ప్రేమ ఏకీభవించదు. వల్లి నాటకాలు ఆడుతుందని అంటుంది.
విడాకులు ఇవ్వమంటావా?
వల్లక్క అలా ప్రవర్తించడానికి కారణం వాళ్ల అమ్మ. ఇప్పటికే తను చేసిన తప్పు వల్లక్క తెలుసుకుందని నర్మద చెప్తుంది. నువ్వు దానికి సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదని ప్రేమ అంటుంది. మరి విడాకులు ఇవ్వమంటావా? చిన్న గొడవలకే విడాకులిస్తే అసలు పెళ్లి బంధాలే ఉండవని నర్మద వివరిస్తుంది. నాలుగు కన్నీటి చుక్కలు కార్చిందని ఇప్పుడే ఇంట్లోకి తీసుకొస్తారా అని ప్రేమ ప్రశ్నిస్తుంది.
ఆ వల్లి మమ్మల్ని విడదీయాలని చూసింది. అలాంటిదాన్ని నేను క్షమించలేనని ప్రేమ అంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.