Illu Illalu Pillalu October 12 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. పెద్ద కొడుకు జీవితం నాశనమైందని రామరాజు కుమిలి కుమిలి ఏడుస్తాడు. వాళ్లు తీయన మాటలతో మోసం చేశారు. పెద్ద బంగ్లా చూపించారు. అలాంటి వాళ్లు మోసం చేస్తారని ఎవరైనా అనుకుంటారా? అని భర్తను ఓదార్చేందుకు వేదవతి ప్రయత్నిస్తుంది.
సీక్రెట్ గా విశ్వ, అమూల్య

భర్త రామరాజుకు ప్రేమగా అన్నం తినిపిస్తుంది వేదవతి. ఈ సీన్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. మరోవైపు రాత్రి పూట భద్రావతి ఇంటి పక్కన విశ్వ, అమూల్య సీక్రెట్ గా కలుస్తారు. మీ కుటుంబం సంతోషంగా ఉందనుకునే సమయంలోనే వల్లి విషయం బయటపడింది. మళ్లీ బాధే మిగిలింది. మా పెద్దత్త అలా చేసిందని తెలిసింది. ఇంత జరుగుతుంటే నువ్వు నాకు ఎందుకు చెప్పలేదని అమూల్యను విశ్వ అడుగుతాడు.
అమూల్య కౌంటర్
నీకు ఎందుకు చెప్పాలి? మా అన్నయ్య, వదిన కలిసేంతవరకే మనం ఇద్దరం కలిసి ప్రయత్నించాలనుకున్నాం. ఆ ఛాప్టర్ క్లోజ్ అయిందని అమూల్య అంటుంది. మన బాండ్ ఎంతో స్పెషల్, స్ట్రాంగ్ అమూల్య అని విశ్వ చెప్తాడు. లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ లేదని అమూల్య గట్టిగానే చెప్తుంది. మా వల్లి వదనది, నీది కొంపలు కూల్చే క్యారెక్టర్ అని అమూల్య కౌంటర్లు వేస్తుంది.
శారదాంబ ఎంట్రీ
తనకేం తెలియదని విశ్వ అమాయకంగా చెప్తాడు. ధీరజ్, ప్రేమ విడిపోవడం వెనుక మా పెద్దత్త ఉందని తెలిసి షాక్ అయ్యా. నువ్వు నన్ను నమ్మకపోతే మన ప్రేమ ముందుకు ఎలా వెళ్తుంది చెప్పు అని విశ్వ అడుగుతాడు. ఏంటీ ఎక్స్ ట్రాలు వాగుతున్నావని అమూల్య అడుగుతుంది. ఫ్రెండ్ షిప్ అని విశ్వ కవర్ చేస్తాడు. ఎవర్రా అది అని శారదాంబ వస్తుంది. దీంతో అమూల్య పరుగెత్తుకుంటూ వెళ్తుంది.
రాత్రి పూట ఎవరికీ కనిపించకుండా ప్రేమ పక్షుల్లాగా మాట్లాడుకుంటున్నారు. ఏంటీ సంగతి అని శారదాంబ అడుగుతుంది. అమూల్యను ప్రేమిస్తున్నా నానమ్మ అని విశ్వ చెప్తాడు. నువ్వు మారావని నమ్మించు. అప్పుడు అమూల్య నమ్ముతుందని శారదాంబ చెప్తుంది. అప్పుడే వల్లి గురించి చెప్తాడు విశ్వ.
నర్మద పెళ్లి రోజు
{{/usCountry}}రాత్రి పూట ఎవరికీ కనిపించకుండా ప్రేమ పక్షుల్లాగా మాట్లాడుకుంటున్నారు. ఏంటీ సంగతి అని శారదాంబ అడుగుతుంది. అమూల్యను ప్రేమిస్తున్నా నానమ్మ అని విశ్వ చెప్తాడు. నువ్వు మారావని నమ్మించు. అప్పుడు అమూల్య నమ్ముతుందని శారదాంబ చెప్తుంది. అప్పుడే వల్లి గురించి చెప్తాడు విశ్వ.
నర్మద పెళ్లి రోజు
{{/usCountry}}ఉదయం రామరాజు ఇంటికి వెళ్లి శారదాంబ మాట్లాడుతుంది. ఆ దేవుడు ఏదో పగబట్టినట్లు మాకు ఇన్ని బాధలు ఎందుకు ఇస్తున్నాడో అర్థం కావడం లేదని వేదవతి ఫీల్ అవుతుంది. అప్పుడే నర్మద తల్లిదండ్రులు వస్తారు. మళ్లీ ఏం చేయడానికి వచ్చారో మహానుభావులు అని రామరాజు వెటకారంగా మాట్లాడతాడు. మా అల్లుడికి, కూతురికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చామని ప్రసాద్ రావు చెప్తాడు.
తప్పు తెలుసుకున్న ప్రసాద్ రావు
ఈ రోజు మీ పెళ్లి రోజని చెప్పలేదు ఏంటీ అని నర్మదను ప్రేమ అడుగుతుంది. ఇక అందరూ నర్మద, సాగర్ ను విష్ చేస్తారు. మేం కాదన్నా పెళ్లి చేసుకున్నారు. మీ జీవితం ఎలా అవుతుందోనని భయపడ్డాం. కానీ మీ వెనుక గొప్ప కుటుంబం ఉందని నిరూపించారు. మా కళ్లు తెరిపించారు. ఇన్ని రోజులు కూతురిని దూరం పెట్టి తప్పు చేశామని తెలిసొచ్చిందని ప్రసాద్ రావు ఎమోషనల్ అవుతాడు.
నర్మద కడుపు పండేలా
ఈ రోజు గుడిలో పూజ చేయించాం. అయిదుగురు ముత్తయిదువులతో ఆశీర్వాదం ఇప్పిస్తే మా అమ్మాయి కడుపు పండుతుందని పూజారి చెప్పారు. మీకు ఎలాంటి ఇబ్బంది లేదంటే ఆ తంతు మేం జరిపిస్తామని రామరాజు, వేదవతిని నర్మద తల్లి సుజాత అడుగుతుంది. వద్దమ్మా వద్దు. ఇప్పుడు అలాంటివి వద్దు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న పరిస్థితి మీకు తెలియదని నర్మద అంటుంది.
ఎవరి కోసమో మీ సంతోషాన్ని కోల్పోవద్దు. ఇప్పటికే నువ్వు మా కుటుంబం కోసం పుట్టింటికి దూరమయ్యావు. ఇప్పుడు సంతోషాన్ని కూడా దూరం చేసుకోవద్దని నర్మదకు రామరాజు చెప్తాడు. వేదవతి కూడా ఇదే విషయం చెప్తుంది. దీంతో నర్మద ఒప్పుకుంటుంది.
వల్లికి సుక్కు ఫోన్
మరోవైపు గోడపై చందు లవ్స్ వల్లి అని రాస్తూ శ్రీవల్లి ఏడుస్తుంది. అప్పుడే వల్లికి సుక్కు ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన వల్లి.. చందు ఫోన్ చేశాడేమోనని బా బా అని మాట్లాడుతుంది. ఇక్కడ అందరూ నిన్ను మర్చిపోయారు. ఈ రోజు నర్మద, సాగర్ వెడ్డింగ్ యానివర్సరీ. ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నారని వల్లికి సుక్కు చెప్తుంది.
ఈ ఈవెంట్ ను అడ్డం పెట్టుకొని ఇంట్లోకి రీ ఎంట్రీ ఎలా ఇవ్వాలో ప్లాన్ చేసుకో అని బల్లక్కాయ్ కు సుక్కు చెప్తుంది. సుక్కును తిరుపతి చూస్తాడు. ఎవరితో మాట్లాడుతున్నావని తిరు అడగడంతో సుక్కు టెన్షన్ పడుతుంది. కానీ సినిమా గురించి మాట్లాడుతున్నానని సుక్కు అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. మన ఇంటికి వెళ్లిపోదామని భద్రావతి ఇల్లును సుక్కు చూపిస్తుంది. అక్కడ అడుగుపెడితే పెద్దక్క నీ కాళ్లు తీసేస్తుందని తిరు చెప్తాడు.
బల్లక్కాయ్ ప్లాన్
మరోవైపు బల్లక్కాయ్ మళ్లీ రివేంజ్ డ్రామా ప్లాన్ చేస్తుంది. నర్మదను టార్గెట్ చేస్తుంది. ఇంత జరిగినా కూడా బల్లక్కాయ్ బుద్ధి మాత్రం మారదు. ఇటు భద్రావతి దగ్గరకు వెళ్లి సేనాపతి మాట్లాడతాడు. ఆ రామరాజు కుటుంబం ఇప్పుడే ముక్కలవడం మొదలైంది. ఆ రామరాజు పెద్ద కోడలు వల్లిని ఇంట్లో నుంచి గెంటేశారంటా. ఆ రామరాజును ఆడుకోవడానికి ఇదో బ్రహ్మాస్త్రంలా పనికొస్తుంది అక్కా అని భద్రావతితో సేనాపతి అంటాడు.
ఆ వల్లి ఉంటేనే వాడుకోవచ్చు. దాన్ని తరిమేస్తే మనకేం ఉపయోగం అని భద్రావతి అడుగుతుంది. అప్పుడే సాగర్, నర్మదల వెడ్డింగ్ యానివర్సరీ గురించి సేనాపతి చెప్తాడు. ఇదే మనకు అసలైన ఆయుధం. నర్మద పెళ్లి రోజున దానికి ఊహించని గిఫ్ట్ ఇవ్వబోతున్నానని భద్రావతి అంటుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.