Illu Illalu Pillalu October 13 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. పెళ్లి రోజు సెలబ్రేషన్స్ కోసం నర్మదను ప్రేమ, సాగర్ ను ధీరజ్ రెడీ చేస్తారు. ఒరే నడిపోడా నా హ్యాండ్ లా మ్యాజిక్ ఉంది. అందుకే ప్రిన్స్ లా రెడీ చేశానని ధీరజ్ బిల్డప్ ఇస్తాడు.
ఇప్పుడు అవసరమా?

నేను మా అక్కను ఏంజెల్ లా రెడీ చేశానని ప్రేమ కౌంటర్ ఇస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఎవరి ముఖంలోనైనా నవ్వు ఉందా చెప్పండి. ఈ పరిస్థితుల్లో పెళ్లి రోజు చేసుకోవడం అవసరమా? అన్ని తెలిసి కూడా మీరు ఇలా రెడీ చేయడం ఏమైనా బాగుందా? అని నర్మద అడుగుతుంది.
ధీరజ్ చేసిన పెళ్లి
తప్పు చేసింది వల్లినే కావొచ్చు కానీ బాధపడుతోంది మన కుటుంబం కదా అని నర్మద అంటుంది. మీ పెళ్లి రోజు ఆ బాధ నుంచి బయటకు వచ్చి ఎంతో కొంత హ్యాపీగా ఉంటారు కదా అని ధీరజ్ చెప్తాడు. ఆ రోజు మీ ప్రేమను ఒప్పుకోని మీ నాన్న ఇప్పుడు సంతోషంగా ఉందన్నారు కదా అని ప్రేమ కూడా నర్మదను ఒప్పిస్తుంది. ధీరజ్ నువ్వు ఆ రోజు దగ్గరుండి పెళ్లి చేయడంతోనే నాకు నచ్చినవాడు భర్తగా వచ్చాడని నర్మద చెప్తుంది.
అప్పుడే సుకన్య వస్తుంది. బల్లి వెళ్లిన తర్వాత గోడ పక్కనుంచి వినే డ్యూటీ నువ్వు తీసుకున్నావా అని సుక్కును ప్రేమ అడుగుతుంది. ఆ వల్లిలా చేశావంటే బాగుండదని ప్రేమ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు అందరు ఆడవాాళ్లను భాగ్యం పోగు చేస్తుంది. మనల్ని చూస్తేనే వాళ్లకు చెమటలు పట్టాలని శ్రీవల్లి చెప్తుంది.
భద్రావతి కుట్ర
అప్పుడే భాగ్యం ఇంటికి భద్రావతి, సేనాపతి వస్తారు. పది మందిని తీసుకెళ్లి ఇంటి ముందు గొడవ చేస్తా. ఆ రామరాజు పరువు మీద కొడతా. అప్పుడే నా కూతురిని ఇంట్లోకి తీసుకెళ్తారని భాగ్యం చెప్తుంది. ఈ తాడు తీసుకెళ్లి ఏమైనా చేసుకుంటానని భయపెడతానని బల్లక్కాయ్ చెప్తుంది. ఆల్రెడీ ఓ సారి నూతిలో దూకినందుకే తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ ఆప్షన్ ఇవ్వరని భద్రావతి అంటుంది.
చచ్చిపో వల్లి
{{/usCountry}}అప్పుడే భాగ్యం ఇంటికి భద్రావతి, సేనాపతి వస్తారు. పది మందిని తీసుకెళ్లి ఇంటి ముందు గొడవ చేస్తా. ఆ రామరాజు పరువు మీద కొడతా. అప్పుడే నా కూతురిని ఇంట్లోకి తీసుకెళ్తారని భాగ్యం చెప్తుంది. ఈ తాడు తీసుకెళ్లి ఏమైనా చేసుకుంటానని భయపెడతానని బల్లక్కాయ్ చెప్తుంది. ఆల్రెడీ ఓ సారి నూతిలో దూకినందుకే తీసుకెళ్లారు. ఇప్పుడు ఆ ఆప్షన్ ఇవ్వరని భద్రావతి అంటుంది.
చచ్చిపో వల్లి
{{/usCountry}}మీకు హెల్ప్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ నువ్వు ఆ రామరాజు ఇంట్లో ఉండటం మాకు ఎప్పటికైనా అవసరమే. నన్ను నమ్మితే డైరెక్ట్ గా వెళ్లి ఆ ఇంట్లో కూర్చుంటావు. నర్మద కాదు కదా ఈగ కూడా నిన్ను టచ్ చేయలేదని తన ప్లాన్ ను భద్రావతి చెప్తుంది. అలా చచ్చినా చేయనని బల్లక్కాయ్ అంటుంది. అయితే చచ్చిపో అని భద్రావతి అంటుంది.
కలిసిపోయిన భద్రావతి, బల్లక్కాయ్
నువ్వు చెప్పినట్లు చేస్తే మా ఆయన, అత్తామామలను హింసించినదాన్ని అవుతా. అది తప్పే. నేను అలా చేయకూడదని శ్రీవల్లి భయపడుతుంది. నీకు సంసారం కావాలా వద్దా? నాలాగే నీక్కూడా పట్టుదల ఎక్కువ అని వల్లిని భద్రావతి రెచ్చగొడుతుంది. చివరకు బల్లక్కాయ్, భద్రావతి మళ్లీ కలిసిపోయి కుట్రలు పన్నుతారు.
చందు బాధ
మరోవైపు రామరాజు ఇంట్లో నర్మద, సాగర్ పెళ్లి రోజు వేడుకల సంబరాలు షురూ అవుతాయి. దొరికిందే ఛాన్స్ అని అమూల్యను ఇంప్రెస్ చేసేందుకు విశ్వ తెగ ట్రై చేస్తాడు. మ్యారేజ్ డే చేసుకోవడం నాకు అసలు ఇష్టం లేదురా పెద్దోడా అని చందుకు సాగర్ చెప్తాడు. నాకు ఎందుకు చెప్తున్నావ్? నా తమ్ముళ్లు సంతోషంగా ఉంటే ఆనందంతో పొంగిపోతా. నేనెందుకు బాధపడతానని చందు అంటాడు.
రామరాజు ఏమో గదిలో కూర్చుని బాధపడుతుంటాడు. వేదవతి, చందు వచ్చి రామరాజును బయటకు రమ్మంటారు. రేయ్ పెద్దోడా.. కొడుకు విషయంలో తండ్రి గెలిచేది ఎప్పుడో తెలుసా? వాడికి మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్ ను అందించినప్పుడు. నీ పెళ్లి విషయంలో ఈ నాన్న ఓడిపోయాడ్రా. ఈ నాన్నను క్షమిస్తావు కదూ అని రామరాజు ఫీల్ అవుతాడు.
ఓడిపోతున్నా నాన్న
మీరు ఇలా క్షమాపణలు చెప్తే కొడుకుగా ఓడిపోతున్నా నాన్న. మీరు ఇలా చెప్పి నన్ను బాధపెట్టకండి. మోసగత్తె పెళ్లాంగా వచ్చి నాతో ఆడుకుంది నాన్న అని తండ్రిని హత్తుకొని చందు ఏడ్చేస్తాడు. వేదవతి చెప్పడంతో ఇద్దరూ బయటకు వస్తారు. సాగర్, నర్మద కలిసి అత్తామామల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆ తర్వాత ముత్తయిదువులు ఆశీర్వదిస్తారు.
ఫుల్ జోష్
నర్మద డల్ గా ఉండటం చూసి నవ్వమని వేదవతి అడుగుతుంది. ఇక సుక్కుతో కలిసి తిరుపతి డ్యాన్స్ చేసి అందరిలో జోష్ నింపుతాడు. తిరుపతి కిందపడటంతో నర్మద నవ్వుతుంది. అందరూ కలిసి డ్యాన్స్ చేస్తారు. బయట ఏమో టైమ్ కోసం భద్రావతి, సేనాపతి వెయిట్ చేస్తుంటారు. ఈ నవ్వులన్నీ కాసేపట్లో ఏడుపుగా మారుతాయని భద్రావతి అనుకుంటుంది.
బాంబు బద్దలు
సాగర్, నర్మద కలిసి కేక్ కట్ చేస్తారు. అప్పుడే పోలీసులు వస్తారు. ఆ కూలోడి కొంపను కన్నీళ్లతో కూల్చబోయే బాంబు బద్దలు కానుందని సేనాపతితో భద్రావతి అంటుంది. ఇంట్లోకి వచ్చిన పోలీసులను చూసి రామరాజు ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఎందుకు వచ్చారని రామరాజు అడుగుతాడు. చందు, రామరాజు, వేదవతి ఎవరు? మీ ముగ్గురిని అరెస్టు చేస్తున్నామని ఆ పోలీసు ఆఫీసర్ చెప్తుంది.
మీ పెద్ద కోడలు శ్రీవల్లి మీ మీద కేసు పెట్టిందని ఆ ఎస్ఐ చెప్పడంతో అందరి ఫ్యూజులు ఔట్ అవుతాయి. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ముగుస్తుంది.