...
...
Next Story

Illu Illalu Pillalu October 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు.. బల్లక్కాయ్ కన్నింగ్ బుర్ర-పిల్లల కోసం కొడుతున్నాడని నాటకం

Illu Illalu Pillalu October 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే అక్టోబర్ 7 ఎపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది. మాయ మాటలతో రామరాజును వల్లి బుట్టలో వేసుకుంటుంది. పిల్లలు పుట్టడం లేదని చందు కొడుతున్నాడని వల్లి కొత్త నాటకమాడుతుంది. దీంతో చందును బయటకు గెంటేసేందుకు రామరాజు గొడవ చేస్తాడు.

Published on: Oct 7, 2026, 07:40:06 IST
Advertisement

Illu Illalu Pillalu October 7 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. వల్లిపై ఆవేశంతో ఊగిపోయిన చందు ఆమెను బయటకు గెంటేసి డోర్ గడియ పెట్టుకుంటాడు. బయట వల్లి ఏడుస్తుంటుంది. మరోవైపు కాలు నొప్పి వేస్తుందని వేదవతి లేస్తుంది. రామరాజు టాబ్లెట్ ఇస్తాడు.

ప్రేమ ధీరజ్ పక్కనే

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

చిన్నోడు నాకు దెబ్బ తగలగానే చాలా భయపడ్డాడు. చిన్నోడిని ఏం అనకండని రామరాజుకు వేదవతి చెప్తుంది. అప్పుడే ప్రేమ కూడా అక్కడే పడుకుంటానని వస్తుంది. ధీరజ్ ను లేపి, మీ గదిలోకి వెళ్లండని రామరాజు చెప్తాడు. కానీ ఇక్కడే పడుకుంటే ప్రశాంతంగా ఉంటుందని చెప్పి ప్రేమ కూడా అక్కడే పడుకుంటుంది.

వల్లి ఏడుపు

మరోవైపు ఇంట్లో నుంచి వెళ్లిపోమ్మని తలుపులు వేస్తే వెళ్లాలా? నేను పోను అని వల్లి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. వల్లి ఏడుపు సౌండ్ విని రామరాజు బయటకు వస్తాడు. ఏమైందని వల్లిని రామరాజు అడుగుతాడు. పెద్దోడా అని రామరాజు పిలుస్తాడు. ఆయన తాగేసి వచ్చాడు. ఈ అర్ధరాత్రి గొడవలు వద్దని రామరాజును వల్లి రెచ్చగొడుతుంది.

బల్లక్కాయ్ మరో డ్రామా

వాడు నిన్ను కొట్టాడంటే అంత పెద్ద తప్పు ఏం చేశావని వల్లిని రామరాజు అడుగుతాడు. పిల్లలు పుట్టలేదని గొడవ మామయ్య అని వల్లి మరో నాటకం మొదలుపెడుతుంది. పిల్లలు పుట్టలేదని గొడవ పడి నిన్ను కొట్టాడా? అయినా మీకు పెళ్లి అయి సంవత్సరం కూడా కాలేదు కదా అప్పుడే పిల్లల కోసం గొడవలా? అని రామరాజు అడుగుతాడు.

వల్లి యాక్టింగ్

ఇదంతా నర్మదనే చేస్తుంది. ఈ ఇంట్లో నన్ను ఒంటరిని చేస్తున్నారని వల్లి మొసలి కన్నీరు కారుస్తుంది. నర్మద అలా ఎందుకు చేస్తుందని రామరాజు అడుగుతాడు. అసూయ మామయ్య. మీరు నన్ను ప్రేమగా చూసుకుంటారని అలా చేస్తుంది. అత్తయ్య, నర్మద, ప్రేమ ఒకేవైపు ఉంటారు. నేనే ఒంటరిదాన్ని. ఒక్కోసారి నాకు చచ్చిపోవాలనిపిస్తోందని వల్లి ఎమోషనల్ డ్రామా కంటిన్యూ చేస్తుంది.

మీకు కూడా నా గురించి రకరకాలుగా చెప్తారని వల్లి కన్నింగ్ మాటలు చెప్తుంది. ఆ దేవుడే దిగి వచ్చినా నేను నమ్మను. నా పెద్ద కోడలు బంగారమని రామరాజు చెప్పి వెళ్లిపోతాడు. ఇక ఆ నర్మద ఏం చెప్పినా మామయ్య నమ్మరు అని బల్లక్కాయ్ తెగ మురిసిపోతుంది.

నర్మద కౌంటర్లు

పొద్దున అత్త వేదవతికి నర్మద కౌంటర్లు వేస్తుంది. ఇద్దరు కోడళ్లం సేవ చేస్తున్నాం. మీ ఈగో సాటిస్ఫై అయినట్లేనా అని నర్మద ఎగతాళిగా అడుగుతుంది. అత్తకు కాదు అమ్మకు చేస్తున్నామని ప్రేమ అనగానే నా మేనకోడలు బంగారం అని వేదవతి అంటుంది. నర్మద మూతి తిప్పుకోగానే నా గవర్నమెంట్ కోడలు డైమండ్ అని వేదవతి అంటుంది.

రామరాజు సేవ

నా గవర్నమెంట్ కోడలు గయ్యాళి అని మీ ఉద్దేశం కదా అని నర్మద అనేసరికి కరెక్ట్ గా చెప్పావని వేదవతి అంటుంది. ఆ తర్వాత మాట మారుస్తుంది. ఇలా పేషేంట్ల ఉండటం నా వల్ల కాదు. అందరికీ కాఫీ పెడతానని వేదవతి వెళ్లబోతుంటే రామరాజు వచ్చి ఆపుతాడు. ఏం పని చేసేది లేదని కాఫీ తీసుకోమంటాడు. నీ కోసం నాలుగు రోజులు సేవ చేయలేనా? ఇది భార్య సేవలకు రుణం తీసుకోవడమని రామరాజు అంటాడు.

భర్త సేవలు చేస్తుంటే భార్యకు వచ్చే కిక్కే వేరు. ఇది తెలిసి ఉంటే వారానికి ఒకసారి కాలు నొప్పి, చేయి నొప్పి అని రెస్ట్ తీసుకునేదాన్ని అని వేదవతి అంటుంది. అప్పుడు నేనే కాళ్లు విరగ్గొట్టేవాడినని రామరాజు సరదాగా అనడంతో ప్రేమ, నర్మద నవ్వేస్తారు.

చచ్చేంత ప్రేమ బా

మరోవైపు ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉందంటే నర్మద నా విషయంలో వెనక్కి తగ్గినట్లే. ఈ లోపు ఏదో ఒకటి చేసేసి పర్మినెంట్ గా నోరుమూసేలా చేయాలని వల్లి అనుకుంటుంది. అప్పుడే వచ్చిన చందు మరోసారి వల్లిపై మండిపడతాడు. బల్లక్కాయ్ ను బయటకు వెళ్లమంటాడు. నువ్వంటే చచ్చేంత ప్రేమ బా. దయచేసి నా బాధను అర్థం చేసుకో బా అని వల్లి ఏడుస్తుంది.

కాలర్ పట్టుకొన్న రామరాజు

ఆ దొంగ ఏడుపు ఆపు. ఈ జన్మలో నిన్ను నమ్మనని వల్లి జుట్టు పట్టుకుంటాడు చందు. అప్పుడే వచ్చిన రామరాజు.. చందును కొడతాడు. ఇదేనా నీకు నేను నేర్పిన సంస్కారం? ఇంతకుముందు నిన్ను చూస్తే గర్వంగా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే అసహ్యంగా ఉంది. ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్లు అని కాలర్ పట్టుకొని రామరాజు లాక్కెళ్తాడు.

అందరూ షాక్

ఏమైందని అందరూ అడుగుతారు. కానీ వల్లి మాటల మాయలో పడ్డ రామరాజు చందును నానామాటలు అంటాడు. పిల్లలు పుట్టడం లేదని వల్లి మీద నిందలు వేస్తున్నాడంటా అని రామరాజు చెప్పడంతో చందుతో సహా అందరూ షాక్ అవుతారు. నీ భార్య బంగారం రా అని వల్లి గురించి గొప్పగా చెప్తాడు రామరాజు.

ఏమే పిల్లలు పుట్టడం లేదని నా కొడుకు నీపై నిందలు వేశాడా? అని వల్లిని వేదవతి గట్టిగా అడుగుతుంది. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks