Illu Illalu Pillalu September 23 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. మీ అమ్మ అద్భుతమైన ఐడియా వేసిందంటా అని ధీరజ్ ను నర్మద తీసుకెళ్తుంది. వాళ్ల ఇంటి వైపు ఎందుకు తొంగి చూస్తున్నావని వేదవతిని ధీరజ్ అడుగుతాడు. దొంగ కోళ్లు పట్టడానికేమోనని నర్మద కౌంటర్ వేస్తుంది.
ప్రేమ కిడ్నాప్ ప్లాన్

కారు తీసి రెడీ పెట్టు. నీ పెళ్లాన్ని కిడ్నాప్ చేద్దాం. దానితో మాట్లాడదామంటే కొత్త పెళ్లి కూతురిలా అది బయటకు రావడం లేదని వేదవతి ప్లాన్ చేస్తుంది. మీరు కానివ్వండి ఫైర్ వతి గారు అని నర్మద మళ్లీ కౌంటర్ వేస్తుంది. కిడ్నాప్ వద్దు అమ్మ, నేను ఒప్పిస్తానని ధీరజ్ అంటాడు. మీరు మాట్లాడుకుంటే శాంతి చర్చలు కాదు, రక్తపాతాలు జరుగుతాయని వేదవతి అంటుంది.
ప్రేమకు సెక్యూరిటీ
అప్పుడే ప్రేమ బయటకు వస్తుంది. ప్రేమ వెనుకాల బాడీగార్డులా ఇద్దరు మనుషులు వస్తారు. ప్రేమ ఆటలో వెళ్తుంటే, ఆ ఇద్దరు బాడీగార్డులు కూడా వెనుకాలే వెళ్తారు. కొత్తగా ప్రేమకు సెక్యూరిటీ ఏంట్రా అని వేదవతి ఆశ్చర్యపోతుంది. అప్పుడే నవ్వుకుంటూ భద్రావతి వస్తుంది.
చింతామణి పని
ఓ ఇది నీ పనా అని వేదవతి అడుగుతుంది. కాదు చింతామణి పని అని భద్రావతి చెప్తుంది. ఏరా? నా తమ్ముడికి చింతామణి కూతురితో ఎంగేజ్మెంట్ చేసుకుంటుంటే నువ్వు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఆ సుకన్యతో పెళ్లి చేస్తావా? ఆ చింతామణి నీ మీద పగతో రగిలిపోతుంది. నీ పెళ్లి జరగకూడదని దాని మనుషులను సెక్యూరిటీగా పంపించిందని భద్రావతి ధీరజ్ కు షాక్ ఇస్తుంది.
భద్రావతి వార్నింగ్
ఒక గూటి పక్షులన్నీ ఒకే గూటికి చేరుతాయంటే ఇదేనన్నమాట. మంచిని అర్థం చేసుకోకుండా పగలు, ప్రతీకారాలంటూ చచ్చిపోతుంటారని వేదవతి కౌంటర్ వేస్తుంది. మీ నాన్న సవాలు చేశారు. ప్రేమ మనసు మారదు. మీ నాన్న ఛాలెంజ్ చేసినట్లుగా మీ పెళ్లి జరగదు. నా ముందు తలదించుకోక తప్పదని భద్రావతి వార్నింగ్ ఇస్తుంది.
ధీరజ్ కౌంటర్
{{/usCountry}}ఒక గూటి పక్షులన్నీ ఒకే గూటికి చేరుతాయంటే ఇదేనన్నమాట. మంచిని అర్థం చేసుకోకుండా పగలు, ప్రతీకారాలంటూ చచ్చిపోతుంటారని వేదవతి కౌంటర్ వేస్తుంది. మీ నాన్న సవాలు చేశారు. ప్రేమ మనసు మారదు. మీ నాన్న ఛాలెంజ్ చేసినట్లుగా మీ పెళ్లి జరగదు. నా ముందు తలదించుకోక తప్పదని భద్రావతి వార్నింగ్ ఇస్తుంది.
ధీరజ్ కౌంటర్
{{/usCountry}}మీ తాతలు దిగొచ్చినా సరే మా పెళ్లి ఆపరు. కాసేపు ఆగు, మా పెళ్లి చూసి ఏడుద్దువు. అందరి సమక్షంలో ప్రేమ మెడలో తాళి కడతా. మా నాన్నను గెలిపిస్తానని భద్రావతికి ధీరజ్ రివర్స్ వార్నింగ్ ఇస్తాడు. పదిన్నరకు పెళ్లి అని చూసుకోవడానికి వాచ్ పెట్టుకో అని భద్రావతికి వేదవతి సెటైర్ వేస్తుంది.
పెళ్లి ఏర్పాట్లు
ఇటు రామరాజు ఏమో చిన్నోడి పెళ్లికోసమని చీరలు తెచ్చానంటాడు. మీ అమ్మకు చీరను ఇవ్వమని అమూల్యకు ఇస్తాడు. కానీ వేదవతి తీసుకోదు. పెళ్లాన్ని పిలవడానికి నోరు రానప్పుడు చీరలు ఎందుకంటా? అని వేదవతి కోప్పడుతుంది. అయితే రిటర్న్ ఇచ్చేయండి నాన్న అని అమూల్య అనడంతో వేదవతి తగ్గుతుంది. కొడుకు పెళ్లి కదా అని ఇష్టం లేకపోయినా తీసుకుంటున్నానని చీర తీసుకుంటుంది.
శుభలేఖ ఇచ్చిరమ్మని
ప్రేమ కోసం చీరను ధీరజ్ ను సెలెక్ట్ చేయమని రామరాజు అడుగుతాడు. అమ్మ సెలెక్ట్ చేస్తుందని ధీరజ్ చెప్తాడు. కానీ నర్మద ఏమో ధీరజ్ ను సెలెక్ట్ చేయమంటుంది. ఇక వేదవతి, నర్మదను వెళ్లి ప్రేమకు పెళ్లి చీరను ఇవ్వమంటాడు రామరాజు. అలాగే వియ్యంకుల వారికి శుభలేఖ ఇవ్వమంటాడు.
ఆయననే రమ్మని వేదవతి అంటుంది. కానీ రామరాజు సీరియస్ అవుతాడు. దీంతో అత్తయ్య, తాను వెళ్తామని నర్మద చెప్తుంది. పెళ్లి ఏర్పాట్లు చూసుకోమని కొడుకులకు రామరాజు చెప్తాడు. గ్రాండ్ గా పెళ్లి జరగాలంటాడు.
మీ పుట్టింటికి వెళ్దాం అత్తయ్య అంటే వేదవతి భయపడుతుంది. కానీ మీరు శివగామి అని నర్మద రెచ్చగొట్టడంతో వేదవతి ఒప్పుకొంటుంది. మర్యాదగా రమ్మని బల్లక్కాయ్ ను కూడా రమ్మని వార్నింగ్ ఇస్తుంది నర్మద.
తిరుపతి బాధ
మరోవైపు భాగ్యం తెగ ఆలోచిస్తుంటుంది. తోడుగా ఇడ్లీ బాబాయ్ కూడా ఆలోచిస్తాడు. అక్కడ ధీరజ్, ప్రేమ పెళ్లి జరుగుతుందా? ఆ పెళ్లికి మన సుక్కును, తిరుపతిని పిలవలేదు కదా. పిలిస్తే అదే సాకుతో అక్కడికి వెళ్లి కలిసిపోతారు కదా అని భాగ్యం చెప్తుంది. ఇంటి లోపల ఏమో సుక్కుతో మాట్లాడుతూ తిరుపతి బాధపడుతుంటాడు. కార్డు ముక్క పడేస్తే పరుగెత్తుకొని వెళ్లేవాడినని అంటాడు.
భాగ్యం మాటలు
అప్పుడే ఫుడ్ డెలివరీ బాయ్ వస్తాడు. అతణ్ని చూసి పెళ్లి పత్రిక పంపించారని భాగ్యం పిలుస్తుంది. కానీ తిరుకు స్వీట్స్ ఇష్టమని తానే ఆర్డర్ పెట్టానని సుక్కు చెప్పడంతో తిరుపతి ఇంకా ఫీల్ అవుతాడు. వాళ్లు పిలవకపోయినా వెళ్లు. పిలిస్తే కానీ రారని వాళ్లు అనుకుంటున్నారేమో. నిన్ను వాళ్లు దూరం చేసుకోరు. ఇప్పుడు అందరితో కలిసిపోవాలి. మిమ్మల్ని నవ్వుతూ ఆహ్వానిస్తారని భాగ్యం లేనిపోని మాటలు చెప్తుంది. దీంతో పెళ్లికి వెళ్తానని తిరు రెడీ అవుతాడు.
వేదవతి బిల్డప్
ఇక నర్మద, బల్లక్కాయ్ ను తీసుకొని వేదవతి వెళ్తుంది. బయట సెక్యూరిటీ ఉన్నారని, లోపల మా అన్నయ్య, అక్క ఉన్నారని బయపడకండని వేదవతి బిల్డప్ ఇస్తుంది. కానీ సెక్యూరిటీ ఆపగానే వేదవతి వెెళ్లి నర్మద వెనుకాల దాక్కుంటుంది. ఈ సారి నీకు ఛాన్స్ ఇస్తున్నానని వేదవతి తప్పించుకునేందుకు చూస్తుంది. మీ బీభత్సం చూస్తామని నర్మద అనగానే వేదవతి గట్టిగా అరుస్తుంది.
నర్మద గవర్నమెంట్ ఎంప్లాయ్. తనకు సీఎం, పీఎం తెలుసు. ఫోన్ చేయ్ నర్మద అని వేదవతి అంటుంది. ఫోన్ తీసుకురాలేదని నర్మద చెప్పేసరికి వేదవతి తుస్ మంటుంది. వల్లక్కా వీళ్ల సంగతేంటో చూడు అని నర్మద అనడంతో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.