Illu Illalu Pillalu October 21 Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో.. రాత్రి రోడ్డు పక్కన కూర్చున్న శ్రీవల్లి దగ్గరకు ఓ తాగుబోతు వచ్చి అల్లరి చేస్తాడు. అతణ్ని కొట్టేందుకు వల్లి రాయి ఎత్తుతుంది. అప్పుడే ధీరజ్ కార్లో వస్తాడు. ఆ తాగుబోతును చితక్కొడతాడు.
బల్లక్కాయ్ ఎమోషనల్

అర్ధరాత్రి ఇలా బ్యాగు పట్టుకొని కూర్చుంటే అత్తారింటోల్లు తీసుకెళ్తారులే అని మీ అమ్మ కొత్త డ్రామా ప్లాన్ చేసిందా అని బల్లక్కాయ్ ను ధీరజ్ అడుగుతాడు. నువ్వు అనడంలో తప్పు లేదు ధీరజ్, నా జీవితమే ఓ డ్రామా అయిపోయింది. నేను చెప్పినంత మాత్రాన ఎవరు నమ్ముతారు అని శ్రీవల్లి ఎమోషనల్ అవుతుంది.
ఎవరి కోసం బతకాలి
తప్పులు చేశానని మీరు గెంటేశారు. తప్పులు తెలుసుకున్నానని మా అమ్మ గెంటేసింది. మా ఆయనకు ఫోన్ చేస్తే చస్తే చావని అన్నాడు. ఇక నేను ఎవరి కోసం బతకాలని శ్రీవల్లి ఏడ్చేస్తుంది. నీ కోసం బతకాలి. ఇది నువ్వు చేసిన పాపాలకు శిక్ష. కళ్యాణ్ విషయం తెచ్చి ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసని ధీరజ్ అంటాడు. శ్రీవల్లిని తీసుకొని వాళ్ల ఇంటికి వెళ్తాడు ధీరజ్.
అమూల్యకు విశ్వ ఫోన్
మరోవైపు అమూల్యకు విశ్వ కాల్ చేస్తాడు. నిద్రపోతున్నావా అమూల్య కన్నలు అని విశ్వ అడుగుతాడు. అర్ధరాత్రి కాల్ చేసి మళ్లీ నిద్రపోతున్నావా అని అడుగుతావేంటీ అని అమూల్య తిడుతుంది. నిద్ర రావడం లేదు కాసేపు మాట్లాడమని విశ్వ అడుగుతాడు.
రొమాన్స్ ప్రయోగం
ఇక ధీరజ్ కు వల్లి కనిపించిందో లేదో అని సుక్కు టెన్షన్ పడుతుంది. అప్పుడే తిరుపతి వచ్చి సుక్కును హగ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ సుక్కు పక్కకు తప్పుకోవడంతో కింద పడిపోతాడు. రొమాన్స్ లో చిన్న ప్రయోగం చేద్దామనుకున్నా కానీ వికటించిందని తిరు మూలుగుతూ చెప్తాడు. అమూల్య వచ్చి ఏమైందని అడిగితే.. కాలు జారి పడ్డానని తిరు అబద్ధం చెప్తాడు.
ఫోన్లో ఎవరు?
{{/usCountry}}ఇక ధీరజ్ కు వల్లి కనిపించిందో లేదో అని సుక్కు టెన్షన్ పడుతుంది. అప్పుడే తిరుపతి వచ్చి సుక్కును హగ్ చేసుకోవాలనుకుంటాడు. కానీ సుక్కు పక్కకు తప్పుకోవడంతో కింద పడిపోతాడు. రొమాన్స్ లో చిన్న ప్రయోగం చేద్దామనుకున్నా కానీ వికటించిందని తిరు మూలుగుతూ చెప్తాడు. అమూల్య వచ్చి ఏమైందని అడిగితే.. కాలు జారి పడ్డానని తిరు అబద్ధం చెప్తాడు.
ఫోన్లో ఎవరు?
{{/usCountry}}అర్ధరాత్రి నిద్ర పోకుండా ఏం చేస్తున్నావ్? ఫోన్లో ఎవరో లైన్లో ఉన్నట్లున్నారని అమూల్యను సుక్కు అడుగుతుంది. ఫ్రెండ్ కు సబ్జెక్ట్ లో డౌట్ ఉంటే చెప్తున్నానని అమూల్య కవర్ చేస్తుంది. అసలు ఫ్రెండ్ అని గ్యారెంటీ ఏంటీ అని సుక్కు డౌట్ పడుతూ చెప్తుంది. వల్లిలాగా నిన్నూ గెంటేయమంటావా? అని తిరు వార్నింగ్ ఇస్తాడు.
కూతురి కోసం టెన్షన్
ఉదయం ఇడ్లీ బాబాయి తెగ టెన్షన్ పడుతూ ఇంటి బయట తిరుగుతాడు. తెల్లారినా కానీ కూతురు ఇంకా రాలేదు. ఎక్కడుందో? అసలు నీకు ఏమైనా బాధ ఉందా అని భాగ్యాన్ని ఇడ్లీ బాబాయి అడుగుతాడు. అందరికీ ఈ భాగ్యం లోకువ అయిపోయిందని భాగ్యం అంటుంది. నన్ను కూడా ఇంట్లో నుంచే తోలేస్తావా? అని ఇడ్లీ బాబాయి అడుగుతాడు.
రామరాజు ఫ్యామిలీకి చెప్పావా అని భాగ్యం అడుగుతుంది. సుక్కుకు చెప్పానని ఇడ్లీ బాబాయి చెప్తాడు. వాళ్ల కోడలిని వాళ్లే తీసుకెళ్తారు. ఒకవేళ వల్లి తిరిగి వస్తే అప్పుడు అల్లడిస్తానని భాగ్యం బిల్డప్ ఇస్తుంది. అప్పుడే వచ్చిన ధీరజ్ ను చూసి భాగ్యం, ఇడ్లీ బాబాయి షాక్ అవుతారు. వల్లిని చూసి ఇడ్లీ బాబాయి హ్యాపీగా ఫీల్ అవుతాడు.
భాగ్యం వార్నింగ్
మాటలు జాగ్రత్త రాని అని ధీరజ్ కు భాగ్యం వార్నింగ్ ఇస్తుంది. తల్లివి ఇలా ఉన్నావ్ కాబట్టే కూతురిని అలా తయారు చేశావ్. అసలు నువ్వు మనిషివేనా అని డౌట్ వస్తుందని ధీరజ్ అంటాడు. కామెడీ అయిపోతే ఆ మనిషిని తీసుకొని వెళ్లిపో అని భాగ్యం అంటుంది. నీ కూతురిని ఇక్కడే ఉంచేందుకు వచ్చానని ధీరజ్ చెప్తాడు.
ఎస్ఐ సీరియస్
అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదని భాగ్యం అంటుంది. ఆ ప్రాణం తీసేస్తే అని ఎస్ఐ ఎంట్రీ ఇస్తుంది. స్టేషన్ లో పెట్టి బెండు తీసేద్దాం. ఇలా అవతలి వాళ్ల జీవితాలతో ఆడుకునేవాళ్లకు మాటలతో చెప్తే పని అవ్వదు ధీరజ్. మా స్టైల్లో కోటింగ్ ఇస్తే దెబ్బకు లైన్లోకి వస్తుందని ఎస్ఐ సీరియస్ గా చెప్తుంది.
గన్ తో ఫైరింగ్
ఏంటమ్మా పోలీస్ ఆఫీసర్ బెదిరించడానికి వచ్చారా? చేతులు కట్టుకుని వణికిపోవడానికి పిల్లాబచ్చా అనుకున్నారా? భాగ్యం అంటే ఒక బ్రాండ్. భాగ్యంతో పెట్టుకుంటే ఎవరినైనా దడదడలాడిస్తా అని భాగ్యం ఓవరాక్టింగ్ చేస్తుంది. వెంటనే ఎస్ఐ గన్ తీసి ఇడ్లీ బాబాయి లుంగీపై కాలుస్తుంది. దడదడలాడించడమంటే ఇదేనా? ఏమంటావ్ భాగ్యలక్ష్మి అని ఎస్ఐ అడుగుతుంది.
మీరు ఏదంటే అదే. పదమ్మా లోపలికి వెళ్దామని వల్లిని భాగ్యం ఇంట్లోకి తీసుకెళ్తుంది. వల్లికి దిష్టి తీసి మరీ ఇంట్లోకి రమ్మంటుంది. థ్యాంక్స్ ధీరజ్ అని వల్లి చెప్తుంది. ఏ ప్రాబ్లమ్ ఉన్నా నాకు కాల్ చేయ్ అని ఎస్ఐ చెప్తుంది. ప్రతి ఉదయం, సాయంత్రం వచ్చి చెక్ చేస్తా. తేడా వస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చి ఎస్ఐ, ధీరజ్ వెళ్లిపోతారు.
నమ్మని వేదవతి
వల్లిని భాగ్యం గెంటేసిన విషయం తల్లికి ధీరజ్ చెప్తాడు. నిజంగానే గెంటేసిందా? నాకైతే నమ్మకం లేదురా. కష్టం అంటే మీ నాన్న ఎన్నిసార్లు సాయం చేశారు. ఆ ఖిలాడీలను అంత తేలిగ్గా నమ్మలేమని వేదవతి అంటుంది. కరెక్ట్ చెప్పారు అత్త అని ప్రేమ ఉంటుంది. ఆ భాగ్యం మామూలిది కాదు. వల్లిని గెంటేసిందని నర్మద అంటుంది.
మిమ్మల్ని నమ్మించడానికి ఆ తల్లీకూతురు ఇంకెన్ని డ్రామాలు ఆడతారో చూడండని చందు అంటాడు. ఇక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.