Imran Khan Notice: అక్టోబర్ 28లోగా భారత్ వదిలి వెళ్లిపోండి.. యంగ్ హీరోకు ఆదేశాలు!
Imran Khan Asked To Leave India By October 28th: యంగ్ హీరో, అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్‌ను అక్టోబర్ 28వ తేదీలోగా భారతదేశం విడిచి వెళ్లాలని ముంబై ఎఫ్ఆర్ఆర్ఓ ఆదేశించింది. సీజేపీ నిర్వహించిన ఓటు చోరీ ధర్నాలో ఇమ్రాన్ ఖాన్ పాల్గొనడంపై బీజేపీ నేత కిరీట్ సోమయ్య ఇచ్చిన ఫిర్యాదుతో నోటీసులు అందాయి.
Imran Khan Asked To Leave India By October 28th: బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు, యంగ్ హీరో ఇమ్రాన్ ఖాన్‌కు భారత ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ తగిలింది. ఈ నెల అంటే అక్టోబర్ 28వ తేదీలోగా దేశం విడిచి వెళ్లాలని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్ఆర్ఆర్ఓ) ఆయనకు నోటీసులు జారీ చేసింది.

నిబంధనలకు విరుద్ధంగా
ఓసీఐ (ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా) కార్డు ఆధారంగా భారతదేశంలో నివసిస్తున్న ఇమ్రాన్ ఖాన్, నిబంధనలకు విరుద్ధంగా ఒక రాజకీయ ఆందోళనలో పాల్గొన్నారనే ఆరోపణలతో ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ముంబైలోని ఖార్ ప్రాంతంలో నివసిస్తున్న ఇమ్రాన్ ఖాన్ అమెరికా పౌరుడు. అక్టోబర్ 10న ముంబై సెంట్రల్‌లోని అగస్ట్ క్రాంతి మైదాన్‌లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం జరిగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) విధానంలో అక్రమాలు జరిగాయంటూ సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనల్లో హీరో ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు.
కిరీట్ సోమయ్య ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
అమెరికా పాస్‌పోర్ట్, ఓసీఐ కార్డు ఉన్న విదేశీ పౌరుడు భారతదేశంలో రాజకీయ నిరసనల్లో ఎలా పాల్గొంటారని బీజేపీ నాయకుడు కిరీట్ సోమయ్య ముంబై పోలీసులకు, ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్ ఖాన్ అమెరికాలోనే పుట్టి చదువుకున్నారని, ఇక్కడ సినిమాలు చేస్తూ ఉపాధి పొందుతూనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని సోమయ్య ఆరోపించారు.
దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర హోం శాఖ పరిధిలోని నిఘా యంత్రాంగం, నిబంధనల ఉల్లంఘన జరిగిందని స్పష్టం చేస్తూ ఆయన్ను అక్టోబర్ 28 లోపు దేశం విడిచి వెళ్లాలని ఉత్తర్వులు ఇచ్చింది. భారత ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఓసీఐ కార్డుదారులకు ఇక్కడ నివసించడానికి, వ్యాపార-ఉపాధి అవకాశాలు పొందేందుకు పూర్తి హక్కులు ఉంటాయి.
అయితే ఓటు వేసే హక్కు గానీ, రాజకీయ ప్రచారాలు, ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు, ధర్నాలలో పాల్గొనే హక్కు గానీ విదేశీ పౌరులకు ఉండవు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఓసీఐ రద్దు చేయడమే కాకుండా దేశం నుంచి పంపించే అధికారం ఎఫ్ఆర్ఆర్ఓకు ఉంటుంది.
"పౌరుడిగానే వచ్చాను" – ఇమ్రాన్ ఖాన్ వివరణ
ధర్నా స్థలి వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఇమ్రాన్ ఖాన్ తన చర్యలను సమర్థించుకున్నారు. "నేను ఇక్కడ ఎటువంటి ప్రత్యేక డిమాండ్లతో రాలేదు. ఈ నగరంలో నివసిస్తున్న ఒక సాధారణ పౌరుడిగా మాత్రమే వచ్చాను. ప్రజల స్వేచ్ఛను ఎందుకు అడ్డుకుంటున్నారు, వారి గొంతును ఎందుకు నొక్కుతున్నారో తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చాను" అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ ఆందోళన సమయంలో ఇమ్రాన్ ఖాన్‌తో పాటు ఆయన స్నేహితురాలు లేఖా వాషింగ్టన్, అమీర్ ఖాన్ మేనకోడలు, డెకాయిట్ నటి జైన్ మేరీ సహా సుమారు 400 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
భౌతికదాడికి పాల్పడ్డారు
కస్టడీలో ఉన్న సమయంలో అధికారులు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని, నెట్టివేశారని జైన్ మేరీ ఆరోపిస్తూ దెబ్బతిన్న గాయాలను వీడియో ద్వారా ప్రదర్శించడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఎఫ్ఆర్ఆర్ఓ జారీ చేసిన ఉత్తర్వులపై ఇమ్రాన్ ఖాన్ చట్టపరంగా ఎలా ముందుకు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


