సన్‌రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పై ఇండియన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. దేశద్రోహి, సిగ్గు లేదు అంటూ తీవ్రమైన మాటలతో రెచ్చిపోతున్నారు. ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లను బాయ్ కాట్ చేస్తామంటున్నారు. దీనంతటికి కారణం.. ది హండ్రెడ్ లీగ్ లోని కావ్య మారన్ టీమ్ సన్‌రైజర్స్ లీడ్స్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడమే.
అబ్రార్ అహ్మద్

ఇంగ్లాండ్ లో జరిగే ది హండ్రెడ్ క్రికెట్ లీగ్ లో కావ్య మారన్ కు సన్‌రైజర్స్ లీడ్స్ అనే టీమ్ ఉంది. రీసెంట్ గా జరిగిన ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కావ్య టీమ్ కొనుగోలు చేసింది. వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ ఓనర్ కావ్య మారన్, హెడ్ కోచ్ డానియల్ వెటోరీ పాల్గొన్నారు. అయితే పాకిస్థాన్ స్పిన్నర్ ను ఓ ఇండియన్ తన టీమ్ లోకి తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
సిగ్గు లేదు
‘‘ఈ పాకిస్థానీ మన ఇండియన్ టీమ్ ను, ఇండియన్లను అవమానించాడు. కానీ సిగ్గు లేకుండా డీఎంకే కుటుంబానికి చెందిన కావ్య మారన్ అతణ్ని తీసుకుంది. ఇది సిగ్గు చేటు. మీ మ్యాచ్ లను బాయ్ కాట్ చేస్తాం’’ అని ఓ నెటిజన్ ఎక్స్ లో తన కోపాన్ని వెళ్లగక్కాడు. గతంలో ఆసియా కప్ సందర్భంగా భారత ఆర్మీని, ఆటగాళ్లను ఎగతాళి చేస్తూ అహ్మద్ ప్రవర్తించిన సంగతి తెలిసిందే.
దేశభక్తే ముందు
‘‘డీఎంకే, సన్ గ్రూప్, కావ్య మారన్ కలిసి మన దేశ గౌరవాన్ని అమ్మేశారు. మన భారత అమర జవాన్లను అవమానించిన పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను వీళ్లు తమ టీమ్ లోకి తీసుకున్నారు. దీని వెనుక ఎవరున్నారు? అన్నిటికంటే దేశభక్తే ముందు. సన్ నెట్ వర్క్, సన్ రైజర్స్, మారన్ ను బాయ్ కాట్ చేయాలి’’ అని మరో యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
{{/usCountry}}‘‘డీఎంకే, సన్ గ్రూప్, కావ్య మారన్ కలిసి మన దేశ గౌరవాన్ని అమ్మేశారు. మన భారత అమర జవాన్లను అవమానించిన పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను వీళ్లు తమ టీమ్ లోకి తీసుకున్నారు. దీని వెనుక ఎవరున్నారు? అన్నిటికంటే దేశభక్తే ముందు. సన్ నెట్ వర్క్, సన్ రైజర్స్, మారన్ ను బాయ్ కాట్ చేయాలి’’ అని మరో యూజర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
{{/usCountry}}ఎక్స్ అకౌంట్ సస్పెండ్
పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను సన్‌రైజర్స్ లీడ్స్ తీసుకోవడంపై ఇండియన్లు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ లీడ్స్ అధికారిక ఎక్స్ అకౌంట్ సస్పెండ్ కావడం వైరల్ గా మారింది. చాలా మంది రిపోర్ట్ కొట్టడం ఓ కారణంగా తెలుస్తోంది.
ఐపీఎల్ లో
ది హండ్రెడ్ లీగ్ లో సన్‌రైజర్స్ లీడ్స్ కోసం అబ్రార్ అహ్మద్ ను కావ్య మారన్ తీసుకోవడంతో ఐపీఎల్ 2026లో ఆమె టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే మ్యాచ్ లను బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు.
అందుకే అబ్రార్
అబ్రార్ అహ్మద్ ను తీసుకోవడంపై డానియల్ వెటోరీ క్లారిటీనిచ్చాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ టీమ్ నుంచి వెళ్లిపోవడంతో మరో స్పిన్నర్ కావాలని అబ్రార్ అహ్మద్ ను తీసుకున్నామని చెప్పాడు. పాక్ ఆటగాళ్లను టీమ్ లోకి తీసుకోవద్దనే చర్చ ఏం జరగలేదని అన్నాడు.