...
...
Next Story

Dhurandhar 2: ఆరు రోజుల్లోనే 100 మిలియన్ డాలర్లు.. బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధురంధర్ 2.. కానీ నెగెటివ్ కామెంట్లు

Dhurandhar 2: 'ధురంధర్ 2' కేవలం 6 రోజుల్లోనే $100 మిలియన్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. కానీ అంతర్జాతీయ మీడియా ఈ సినిమాలోని హింసను ఎందుకు విమర్శిస్తోంది? న్యూయార్క్ టైమ్స్ ఏమందో ఇక్కడ చూసేయండి.

Published on: Mar 25, 2026, 10:40:54 IST
Advertisement

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సునామీ క్రియేట్ చేస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా $100 మిలియన్ల మార్కును దాటేసింది. ఇండియాలో రూ.575 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో ఏకంగా $27 మిలియన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

విమర్శలు

ధురంధర్ 2 లో రణ్ వీర్ సింగ్
ధురంధర్ 2 లో రణ్ వీర్ సింగ్

ధురంధర్ 2 సినిమాపై కాసులు కురుస్తున్నా, అంతర్జాతీయ విమర్శకులు మాత్రం దీనిపై పెదవి విరుస్తున్నారు. రివ్యూ అగ్రిగేటర్ సైట్ రోటెన్ టొమాటోస్ లో ఈ చిత్రానికి కేవలం 38% రేటింగ్ మాత్రమే లభించింది. సినిమాలోని అతి తీవ్రమైన హింస, రాజకీయ అంశాలపై విదేశీ మీడియా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

న్యూయార్క్ టైమ్స్ షాకింగ్ కామెంట్స్

'న్యూయార్క్ టైమ్స్' విమర్శకుడు నికోలస్ రాపోల్డ్ ఈ సినిమాను ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్‌తో పోల్చారు. మతపరమైన విభేదాలపై హింసను ప్రేరేపించేలా ఈ సీక్వెల్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరో విమర్శకురాలు సారా మ్యాన్వెల్ అయితే, ఈ సినిమా చూస్తుంటే ఒక సోషియోపాథిక్ అనుభవం కలిగిందని చాలా కఠినంగా రాసుకొచ్చారు.

ధ్రువ్ రాఠీ విమర్శలు

భారతదేశంలో కూడా ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత ధ్రువ్ రాఠీ ఈ చిత్రాన్ని 'బ్రెయిన్ రాట్' (Brain Rot) అని పిలిచారు. మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్ సరిగ్గా తెరకెక్కించలేకపోయారని, ప్రచార చిత్రంలా ఉందని ఆయన తన సమీక్షలో పేర్కొనడం గమనార్హం.

రికార్డుల వేటలో రణ్‌వీర్

మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఇందులో రణ్‌వీర్ సింగ్ జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు క్యారెక్టర్లు ప్లే చేశారు. ఈ సినిమాకు ఆదిత్య ధర్ డైెరెక్టర్. డిసెంబర్ 5, 2025న రిలీజైన ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ధురంధర్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లు కలెక్ట్ చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks