...
...
Next Story

Irumudi Collection: బాహుబలి 2, పుష్ప 2, కల్కి రికార్డులు తుడిచిపెట్టేసిన ఇరుముడి- రవితేజ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Ravi Teja Irumudi Second Friday Collection: బాక్సాఫీస్ వద్ద 'ఇరుముడి' సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండో శుక్రవారం ఏకంగా రూ. 12.50 కోట్లు రాబట్టి పుష్ప 2, బాహుబలి 2, కల్కి సినిమాల రికార్డును తుడిచిపెట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత ఆ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

Published on: Aug 30, 2026, 08:52:09 IST
Advertisement

Ravi Teja Irumudi 8 Days Worldwide Collection: బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం కలెక్షన్ల జాతర కొనసాగిస్తోంది. తొలి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా, శుక్రవారం (ఆగస్టు 28) కూడా థియేటర్లలో భారీ వసూళ్లతో అదరగొట్టింది.

రెండో శుక్రవారం కలెక్షన్స్

బాహుబలి 2, పుష్ప 2, కల్కి రికార్డులు తుడిచిపెట్టేసిన ఇరుముడి- రవితేజ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయంటే?
బాహుబలి 2, పుష్ప 2, కల్కి రికార్డులు తుడిచిపెట్టేసిన ఇరుముడి- రవితేజ మూవీకి ఎన్ని కోట్లు వచ్చాయంటే?

రెండో శుక్రవారం భారతీయ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 12.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది ఇరుముడి సినిమా. గురువారం నాటి కలెక్షన్లతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం పెరుగుదల కావడం విశేషం.

8 రోజుల్లో 120 కోట్లు

సాధారణంగా ఏ సినిమాకైనా రెండో వారంలో వసూళ్లు తగ్గుతుంటాయి. కానీ 'ఇరుముడి' విషయంలో పరిస్థితి వేరేలా ఉంది. తొలి శుక్రవారంతో పోలిస్తే కేవలం 27 శాతం మాత్రమే వసూళ్లు తగ్గాయి. దీంతో ఎనిమిది రోజుల్లో భారత బాక్సాఫీస్ వద్ద ఇరుముడి చిత్రం మొత్తం రూ. 120 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది.

ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత 'ఇరుముడి'దే స్థానం!

ఈ ఆదివారం (ఆగస్టు 30) ముగిసేసరికి ఇరుముడు కలెక్షన్స్ రూ. 150 కోట్ల మైలురాయిని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) ఈ సినిమా ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో రెండో శుక్రవారం నాటి లెక్కలు నిరూపిస్తున్నాయి.

శుక్రవారం ఒక్కరోజే రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 11.50 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసి ఆశ్చర్యపరిచింది ఇరుముడి సినిమా. తెలుగు సినిమా చరిత్రలోనే రెండో శుక్రవారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో 'ఇరుముడి' రెండో స్థానంలో నిలిచింది.

పుష్ప 2, బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్

టికెట్ రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయంటే, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రా, నైజాంలలో ఇప్పటికే రూ. 100 కోట్ల మైలురాయి దాటిన ఇరుముడి చిత్రం ఫుల్ రన్‌లో రూ. 200 కోట్ల దిశగా దూసుకుపోతోంది.

ఇండియా వైడ్ కలెక్షన్ల వివరాలు (ఏరియా వైజ్ బ్రేక్‌డౌన్)

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 'ఇరుముడి' సాధించిన 8 రోజుల వసూళ్ల వివరాలను పరిశీలిస్తే, అన్ని చోట్లా ఈ చిత్రం జెండా పాతినట్లు స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రదేశ్ / తెలంగాణ: రూ. 107.25 కోట్లు

నైజాం: రూ. 51.50 కోట్లు

సీడెడ్: రూ. 14.75 కోట్లు

ఆంధ్ర: రూ. 41.00 కోట్లు

కర్ణాటక: రూ. 9.00 కోట్లు

భారతదేశంలోని ఇతర ప్రాంతాలు: రూ. 3.75 కోట్లు

మొత్తం ఇండియా గ్రాస్: రూ. 120.00 కోట్లు

ట్రేడ్ విశ్లేషకుల అంచనాల ప్రకారం 'ఇరుముడి' కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు, రానున్న రోజుల్లో సూపర్‌ బ్లాక్‌బస్టర్‌గా, ఆపై 'ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్'గా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీకెండ్‌లో వసూళ్లు మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks