OTT Romantic Crime Thriller Ishqa Ishqa Trailer Released: ప్రేమ ఒక అందమైన అనుభూతి. అయితే ఆ ప్రేమే హద్దులు దాటి అజమాయిషీగా, ఒక రకమైన పిచ్చిగా (Obsession) మారితే ఎలాంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో చూపించే సరికొత్త ఓటీటీ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇష్కా ఇష్కా'.
ఓటీటీలోకి ఇష్కా ఇష్కా

తాజాగా ఇవాళ (అక్టోబర్ 5) ఇష్కా ఇష్కా ట్రైలర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. రాజేష్ బచ్చానీ కథ అందించిన ఈ ఓటీటీ సిరీస్‌ను అమిత్ కుమార్ ఝా తెరకెక్కించారు. హెల్లీ షా, సత్యజీత్ దూబే, అనుష్క కౌశిక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. మూవీయింగ్ ఇమేజెస్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ సిరీస్‌ను నిర్మించింది.
రెండు విభిన్నమైన ప్రేమల నడుమ రచయిత నలిగిపోతే..
ఒకవైపు ప్రశాంతతను పంచే ప్రేమ, మరోవైపు జీవితంలో అలజడి రేపే తీవ్రమైన ఆరాధన.. ఈ రెండింటి మధ్య నలిగిపోయే కబీర్ అనే రచయిత కథే ఈ ఓటీటీ సిరీస్. ఇష్కా ఇష్కా ట్రైలర్ ఆధారంగా చూస్తే ఆరోహి (హెల్లీ షా), కబీర్ (సత్యజీత్ దూబే), సుహాసిని (అనుష్క కౌశిక్)ల చుట్టూ కథ తిరుగుతుంది.
ఆరోహి దృష్టిలో ప్రేమంటే భాగస్వామిని పూర్తిగా తన గుప్పెట్లో ఉంచుకోవడమే. అక్కడ దూరానికి గానీ, సందేహాలకు గానీ తావుండదు. అదే సమయంలో కబీర్ జీవితంలోకి సుహాసిని వస్తుంది. ఆమె నుంచి అతడికి మానసిక ప్రశాంతత, నమ్మకం, స్పష్టత లభిస్తాయి.
అయితే ఊహించని విధంగా ఆరోహి మళ్లీ అతడి జీవితంలోకి అడుగుపెట్టడంతో కబీర్ ప్రశాంతత గాల్లో కలిసిపోతుంది. స్వేచ్ఛకు, బంధనానికి మధ్య, జీవితాన్ని నిలబెట్టే ప్రేమకు, జీవితాన్ని నాశనం చేసే పిచ్చికి మధ్య కబీర్ ఎలా నలిగిపోయాడు అనేది సైకలాజికల్ గేమ్‌గా మారుతుంది. ప్రేమ ఎప్పుడు ఒక జబ్బుగా మారుతుందో ప్రశ్నించేలా ఈ కథనం సాగుతుంది.
పాత్రలపై నటీనటులు, మేకర్స్ స్పందన
{{/usCountry}}అయితే ఊహించని విధంగా ఆరోహి మళ్లీ అతడి జీవితంలోకి అడుగుపెట్టడంతో కబీర్ ప్రశాంతత గాల్లో కలిసిపోతుంది. స్వేచ్ఛకు, బంధనానికి మధ్య, జీవితాన్ని నిలబెట్టే ప్రేమకు, జీవితాన్ని నాశనం చేసే పిచ్చికి మధ్య కబీర్ ఎలా నలిగిపోయాడు అనేది సైకలాజికల్ గేమ్‌గా మారుతుంది. ప్రేమ ఎప్పుడు ఒక జబ్బుగా మారుతుందో ప్రశ్నించేలా ఈ కథనం సాగుతుంది.
పాత్రలపై నటీనటులు, మేకర్స్ స్పందన
{{/usCountry}}ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్లకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్‌ను రూపొందించినట్లు మేకర్స్ తెలిపారు. "ప్రేమ అనే అనుభూతి అజమాయిషీగా, వదులుకోలేని భయంగా మారినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇందులో చూపించాం" అని ప్రైమ్ వీడియో ఇండియా ఏవోడీ కంటెంట్ హెడ్ అమోగ్ దూసద్ పేర్కొన్నారు.
తన పాత్ర గురించి నటి హెల్లీ షా మాట్లాడుతూ, "ఆరోహి కబీర్‌ను అమితంగా ప్రేమిస్తుంది. కానీ ఆమె దృష్టిలో ప్రేమ, అజమాయిషీ ఒకటే. తీవ్రమైన భావోద్వేగాలు ఉన్న ఈ పాత్రలో నటించడం ఎంతో సవాలుగా అనిపించింది" అని అన్నారు.
అలాగే సత్యజీత్ దూబే స్పందిస్తూ, "ఈ తీవ్రమైన పరిస్థితుల నుంచి బయటపడటానికి కబీర్ చేసే ప్రయత్నమే ఈ సిరీస్ సారం" అని చెప్పారు. సుహాసిని పాత్ర పోషించిన అనుష్క కౌశిక్ మాట్లాడుతూ, "ప్రేమలో నమ్మకం, స్వేచ్ఛ ఉండాలని నమ్మే అమ్మాయిగా కనిపించబోతున్నాను" అని తెలిపారు.
స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
డిజిటల్ వినోద ప్రపంచంలో ఈ తరహా కథనాలు ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 7, 2026 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఎంఎక్స్ ప్లేయర్ ఆండ్రాయిడ్ యాప్‌లో 'ఇష్కా ఇష్కా' ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఉచితంగా ఇష్కా ఇష్కా సిరీస్‌ను ఆస్వాదించవచ్చు.