Itllu Arjuna Review:

సినిమా పేరు : ఇట్లు అర్జున
నటీనటులు : అనీష్, అనస్వర రాజన్, ముఖేష్ రుషి, కలైయారసన్, బ్రహ్మాజీ, గెటప్ శ్రీను తదితరులు
డైరెక్టర్ : మహేష్ ఉప్పాల
ప్రొడ్యూసర్ : వెంకీ కుడుముల
మ్యూజిక్ డైరెక్టర్ : తమన్
రిలీజ్ డేట్ : నవంబర్ 13, 2026
భారీ ప్రమోషన్స్‌తో టాలీవుడ్లో మంచి బజ్ క్రియేట్ చేసిన సినిమా ‘ఇట్లు అర్జున’. కొత్త హీరో అనీష్ ఎంట్రీ ఇస్తూ, మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం నేడు (నవంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొత్త దర్శకుడు మహేష్ ఉప్పల తెరకెక్కించిన ఈ మూవీకి డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూసర్. మూగ కుర్రాడి ప్రేమకథకి, ఓ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ కథకి ముడిపెట్టి తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ ఏంటంటే..
పెద్దన్న (ముఖేష్ రుషి) ఒక పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్. అతనికి సంబంధించిన ఒక ముఖ్యమైన పెన్‌డ్రైవ్‌ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి దొంగిలిస్తాడు. దాన్ని వెతికి తీసుకురావడానికి పెద్దన్న తన అనుచరులను రంగంలోకి దించుతాడు.
మరోవైపు మాటలు రాని ఓ పిక్‌పాకెటర్ అర్జున్ (అనీష్) చిన్నప్పటి నుంచే కీర్తి (అనస్వర రాజన్)ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. అర్జున్, కీర్తి మధ్య నెమ్మదిగా స్నేహం చిగురిస్తుండగా.. ఊహించని విధంగా వీళ్లు కొన్ని చిక్కుల్లో పడతారు. అసలు వీళ్లకి, పెద్దన్న గ్యాంగ్‌కి ఉన్న లింక్ ఏంటి? ఆ పెన్‌డ్రైవ్ ఎవరి దగ్గర ఉంది? ఫైనల్‌గా ఏమైంది? అనేది ఇట్లు అర్జున సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
ఇట్టు అర్జున (Itllu aruna review) మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే క్యూట్ సీన్స్, మంచి కామెడీ టైమింగ్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ కీర్తి కూడా మూగ అమ్మాయిగా యాక్ట్ చేసే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. అయితే సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కాస్త గ్రాఫ్ పడిపోతుంది.
{{/usCountry}}ఇట్టు అర్జున (Itllu aruna review) మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే క్యూట్ సీన్స్, మంచి కామెడీ టైమింగ్‌తో ఫస్ట్ హాఫ్ సరదాగా గడిచిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ కీర్తి కూడా మూగ అమ్మాయిగా యాక్ట్ చేసే సీన్స్ నవ్వులు పూయిస్తాయి. అయితే సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి కాస్త గ్రాఫ్ పడిపోతుంది.
{{/usCountry}}ఫస్ట్ హాఫ్‌లో ఉన్న కామెడీ సెకండ్ హాఫ్‌లో మిస్ అయ్యింది. గ్యాంగ్‌స్టర్ ట్రాక్, క్రైమ్ సెటప్ రొటీన్‌గా అనిపిస్తాయి. హీరో, విలన్ గ్యాంగ్‌ను బోల్తా కొట్టించే సీన్స్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేసుంటే బాగుండేది. ముఖేష్ రుషి లాంటి సీనియర్ యాక్టర్‌కు బలమైన క్యారెక్టరైజేషన్ దొరకలేదు. అయినప్పటికీ, ఎక్కడా పెద్దగా బోర్ కొట్టకుండా సినిమా సాగిపోతుంది.
ఎవరెలా చేశారంటే..
హీరో అనీష్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ.. మాటలు రాని కుర్రాడిగా చాలా బాగా నటించాడు. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్‌ని డెబ్యూ మూవీకే ఎంచుకోవడం సాహసమే. తన యాక్టింగ్‌తో చాలా చోట్ల ఆకట్టుకున్నాడు. అనస్వర రాజన్ చాలా క్యూట్‌గా కనిపించింది. ఆమె క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయ్యింది. బ్రహ్మాజీ, గెటప్ శ్రీను, కలైయరసన్ తదితరులు తమ పాత్రల మేరకు బాగా చేసి మెప్పించారు.
టెక్నికల్ గా..
ఇట్లు అర్జున సినిమాకు బ్యాక్‌బోన్ అంటే కచ్చితంగా తమన్ అనే చెప్పాలి. మాటలు లేని హీరో పాత్రకు తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. పాటలు కూడా చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ రొటీన్‌గా ఉన్నా తన బీజీఎమ్‌తో ఎలివేట్ చేశాడు. రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్‌గా ఉంది, ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్‌ను చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. కొత్త దర్శకుడు మహేష్ ఉప్పల.. ఎంచుకున్న పాయింట్‌ను ఓ మోస్తరుగా హ్యాండిల్ చేశాడు. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బాగుండేది.
ఫైనల్ గా..
‘ఇట్లు అర్జున’ ఒక డీసెంట్ రొమాంటిక్ క్రైమ్ యాక్షన్ కామెడీ. మొదటి సినిమాతోనే హీరో అనీష్ మంచి మార్కులు కొట్టేశాడు. అనస్వర రాజన్ గ్లామర్, ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన బలాలు. సెకండ్ హాఫ్‌లో క్రైమ్ ట్రాక్ కొంచెం రొటీన్‌గా ఉన్నా.. ఓవరాల్‌గా ఈ వీకెండ్లో సరదాగా టైమ్ పాస్ కోసం ఈ సినిమాను కచ్చితంగా చూడొచ్చు.