బిల్లా తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసిన ఉష శ్రీ హీరోయిన్‌గా మారిన సినిమా ఇట్స్ ఓకే గురు. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి చరణ్ హీరోగా చేశాడు. ప్రొడ్యూసర్ క్రాంతి ప్రసాద్ నిర్మించిన ఇట్స్ ఓకే గురు సినిమాకు మణికంఠ దర్శకత్వం వహించారు.
ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్

డిసెంబర్ 12న ఇట్స్ ఓకే గురు మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ మెహర్ రమేష్ అతిథిగా హాజరైన ఇట్స్ ఓకే గురు ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో మూవీ నిర్మాత క్రాంతి ప్రసాద్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
ప్రొడ్యూసర్ క్రాంతి ప్రసాద్ మాట్లాడుతూ.. "చాలా మంచి టీంతో చేస్తున్న సినిమా ఇది. నేను స్వతహాగా మార్చల్ ఆర్ట్స్ ట్రైనర్‌ని. 30 గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. మన దైనందిన జీవితంలో చిన్న విషయాలకు కూడా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటాము. చిన్న చిన్న వాటికి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు" అని అన్నారు.
మంచి లవ్ స్టోరీతో
"ఈ ఇట్స్ ఓకే గురు సినిమాలో ఎమోషన్స్‌ని ఎలా అధిగమించాలి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. డిప్రెషన్‌లో ఉన్న వాళ్లు ఈ సినిమా చూస్తే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. మంచి లవ్ స్టోరీతో పాటు అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. కచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది" అని తెలిపారు నిర్మాత క్రాంతి ప్రసాద్.
ఇక హీరో సాయి చరణ్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. రమేష్ గారికి థాంక్యూ. ఇట్స్ ఓకే గురు టైటిల్ నా లైఫ్‌లో చాలా కనెక్ట్ అయింది. రవి బాబు గారితో నా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎమోషనల్‌గా మెంటల్ గా చాలా లో అయ్యాను. చాలా విమర్శలు, ట్రోలింగ్ ఇప్పటికీ వస్తున్నాయి" అని చెప్పారు.
ఎంతో ఎనర్జీ నింపింది
{{/usCountry}}ఇక హీరో సాయి చరణ్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. రమేష్ గారికి థాంక్యూ. ఇట్స్ ఓకే గురు టైటిల్ నా లైఫ్‌లో చాలా కనెక్ట్ అయింది. రవి బాబు గారితో నా ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎమోషనల్‌గా మెంటల్ గా చాలా లో అయ్యాను. చాలా విమర్శలు, ట్రోలింగ్ ఇప్పటికీ వస్తున్నాయి" అని చెప్పారు.
ఎంతో ఎనర్జీ నింపింది
{{/usCountry}}"జీవితంలో ఏం చేయాలో తోచని సమయంలో మా అమ్మ ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు ఇట్స్ ఓకే ప్రయత్నించమని చెప్పింది. ఆ మాట నాలో ఎంతో ఎనర్జీని నింపింది. అక్కడి నుంచి ప్రతిక్షణం మళ్లీ కొత్తగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అలాంటి సమయంలో ఈ సినిమా ఈ సినిమా వచ్చింది" అని హీరో సాయి చరణ్ తెలిపారు.
"టైటిల్ ఇట్స్ ఓకే గురు అని చెప్పారు. అది నాకు చాలా పర్సనల్ కనెక్షన్ అనిపించింది. డిసెంబర్ 12న ఈ సినిమా థియేటర్స్‌లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా అందరికి కూడా పర్సనల్‌గా కనెక్ట్ అవుతుంది" అని కథానాయకుడు సాయి చరణ్ చెప్పుకొచ్చారు.
యూత్ చూడాల్సిన సినిమా
ఈస్ట్ వెస్ట్ సీఈవో రాజీవ్ మాట్లాడుతూ.. "అందరికి నమస్కారం. ఈ సినిమా టైటిల్ జనాల్లోకి వెళ్లింది. ప్రమోషన్స్‌ని కూడా చాలా కొత్తగా చేశారు. మణికంఠ చాలా పాషన్ ఉన్న డైరెక్టర్. హీరో హీరోయిన్స్ సోషల్ మీడియాలో చాలా చక్కగా ప్రమోషన్స్ కూడా చేశారు. ఇది యూత్ చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది" అని పేర్కొన్నారు.