...
...
Next Story

OTT Family: ఓటీటీలోకి ఎమోషనల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా- 50 ఏళ్ల బంధానికి విడాకులు- ట్రైలర్ రిలీజ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Family Emotional Comedy Drama Jab Khuli Kitaab Trailer: ఓటీటీలోకి ఎమోషనల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా సినిమా జబ్ ఖులి కితాబ్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా జబ్ ఖులి కితాబ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 50 ఏళ్ల బంధానికి విడాకులు తీసుకునే జంట కథగా ఉన్న జబ్ ఖులి కితాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో చూద్దాం.

Published on: Mar 3, 2026, 12:29:25 IST
Advertisement

ఓటీటీలోకి ఫ్యామిలీ ఆడియెన్స్ కోసం కామెడీగా ఉంటూనే ఎమోషనల్‌గా సాగే కుటుంబ కథా చిత్రం వచ్చేయనుంది. ఆ సినిమానే జబ్ ఖులి కితాబ్. ప్రేక్షకులకు ఓ అందమైన, పరిణతి చెందిన ప్రేమను చూపించే ప్రయత్నంగా ఈ సినిమా ఉండనుందని మేకర్స్ చెబుతున్నారు.

ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ స్టార్స్

ఓటీటీలోకి ఎమోషనల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా- 50 ఏళ్ల బంధానికి విడాకులు- ట్రైలర్ రిలీజ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి ఎమోషనల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా- 50 ఏళ్ల బంధానికి విడాకులు- ట్రైలర్ రిలీజ్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

జబ్ ఖులి కితాబ్ సినిమాకు సౌరభ్ శుక్లా రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్ని పోషించారు. అపరశక్తి ఖురానా మరో కీలక పాత్ర పోషించారు. తాజాగా జబ్ ఖులి కితాబ్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

వృద్దాప్యంలో విడాకులు

ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన వివాహాబంధం, భావోద్వేగ సంక్లిష్టతలు, వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జబ్ ఖులి కితాబ్ ట్రైలర్‌లో ఎంతగా నవ్వించారో.. అంతే స్థాయిలో ఎమోషనల్ సీన్లతో ఆలోచనల్ని రేకెత్తించారు.

మనవళ్లు, మనవరాళ్ల చేష్టలతో

జబ్ ఖులి కితాబ్ ట్రైలర్‌ను చూస్తే.. గోపాల్ (పంకజ్ కపూర్), అనసూయ (డింపుల్ కపాడియా) భార్యాభర్తలు. అనసూయ కోమాలో ఉంటుంది. తల్లి కోమాలో ఉండటంతో కొడుకులు, కూతుళ్లు అంతా వస్తారు. మనవళ్లు, మనవరాళ్ల చేష్టలతో కోమా నుంచి అనసూయ లేస్తుంది.

వివాహా బంధానికి పుల్ స్టాప్ పెట్టాలని

అనంతరం 50 సంవత్సరాల తమ వివాహా బంధానికి పుల్ స్టాప్ పెట్టాలని, విడాకులు తీసుకోవాలని అనుకుంటారు గోపాల్, అనసూయ. గోపాల్ విడాకులు కావాలని కోరితే.. అనసూయ మాత్రం విడాకులకు అంగీకరించదు. ఇక వారి పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో కుటుంబం ఎంతో నిండుగా ఉంటుంది.

ఇంట్రెస్టింగ్, కామెడీగా ట్రైలర్‌

ఇక ట్రైలర్‌తో పాటు జబ్ ఖులి కితాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5లో జబ్ ఖులి కితాబ్ ఓటీటీ రిలీజ్ కానుంది. మార్చి 6 నుంచి జబ్ ఖులి కితాబ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. అయితే, ఇప్పటికీ కేవలం హిందీ భాషలోనే జబ్ ఖులి కితాబ్ ఓటీటీ ప్రీమియర్ కానుందని మేకర్స్ తెలిపారు.

జీ5 ఓటీటీలో

"‘జబ్ ఖులి కితాబ్’ సినిమా వృద్యాప్యం, ఆ దశలో ఉండే ప్రేమ, కుటుంబ విలువలు, ప్రేమకి అసలు నిర్వచనం చెప్పేలా ఉంటుంది. ఈ చిత్రం మార్చి 06, 2026న జీ5 ఓటీటీలో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది" అని మేకర్స్ అనౌన్స్ చేశారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe