Rajinikanth Jailer 2 Worldwide Box Office Collection: సూపర్‌స్టార్ రజనీకాంత్ థియేటర్లలోకి అడుగుపెడితే రికార్డులు తిరగరాయాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'జైలర్ 2' చిత్రం మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను ఊపేసింది.
75 ఏళ్ల వయసులో పోటీ

75 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ, రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద తన తిరుగులేని ఆధిపత్యం చాటుకున్నారు. మొదటి రోజే ఊహించని రీతిలో భారీ కలెక్షన్లు సాధించి, భారతీయ సినిమాలో తన పేరున మరో ఘనత రాసుకున్నారు.
ఇండియాలో 70 కోట్లు
అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ప్రకంపనలు సృష్టించిన జైలర్ 2 సినిమా తొలి రోజే భారత్‌లో రూ. 59.70 కోట్ల నెట్, రూ. 70.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో తమిళ సినీ చరిత్రలోనే భారతదేశంలో 4వ అతిపెద్ద ఓపెనింగ్ సాధించిన చిత్రంగా జైలర్ 2 నిలిచింది. ఈ జాబితాలో ముందున్న రోబో '2.0', 'కూలీ' చిత్రాల్లో కూడా రజనీకాంతే హీరో కావడం ఆయనకున్న క్రేజ్‌కు నిదర్శనం.
రూ. 125 కోట్ల రికార్డు ఓపెనింగ్స్
ఓవర్సీస్లోనూ రజనీ మేనియా పీక్స్‌కు చేరింది. అమెరికా, ఆగ్నేయాసియా దేశాల్లో తొలి రోజే ఏకంగా 6 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 'జైలర్ 2' మొదటి రోజు ఏకంగా రూ. 125 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ 'టైగర్ ముత్తువేల్ పాండియన్' హవా సాగింది.
టాప్ 20 జాబితాలో జైలర్ 2
రూ. 125 కోట్ల తొలి రోజు వసూళ్లతో 'జైలర్ 2' భారతీయ సినీ చరిత్రలోనే టాప్-20 బిగ్గెస్ట్ ఓపెనర్ల జాబితాలో చేరింది. తమిళ చిత్రాల పరంగా 'కూలీ' (రూ. 151 కోట్లు), విజయ్ 'లియో' (రూ. 143 కోట్లు) తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
భారీ పాన్ ఇండియా చిత్రాల రికార్డులు డౌన్
{{/usCountry}}రూ. 125 కోట్ల తొలి రోజు వసూళ్లతో 'జైలర్ 2' భారతీయ సినీ చరిత్రలోనే టాప్-20 బిగ్గెస్ట్ ఓపెనర్ల జాబితాలో చేరింది. తమిళ చిత్రాల పరంగా 'కూలీ' (రూ. 151 కోట్లు), విజయ్ 'లియో' (రూ. 143 కోట్లు) తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
భారీ పాన్ ఇండియా చిత్రాల రికార్డులు డౌన్
{{/usCountry}}బాలీవుడ్, పాన్ ఇండియా బ్లాక్బస్టర్లు అయిన 'పఠాన్' (రూ. 105 కోట్లు), 'యానిమల్' (రూ. 116 కోట్లు), 'గోట్' (రూ. 101 కోట్లు) చిత్రాల తొలి రోజు రికార్డులను జైలర్ 2 సునాయాసంగా దాటేసింది. ఈ ఘనతతో రజనీకాంత్ తన కెరీర్లో మూడోసారి రూ. 100 కోట్ల కంటే ఎక్కువ ఓపెనింగ్ సాధించిన ఏకైక తమిళ నటుడిగా చరిత్ర సృష్టించారు.
ప్రభాస్ తర్వాత రజనీకాంత్
భారతీయ సినిమాలో ఇప్పటివరకు ప్రభాస్ మాత్రమే 5 సార్లు వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ సాధించి మొదటి స్థానంలో ఉన్నారు. ప్రభాస్ తర్వాత మూడు సార్లు ఈ మార్కు దాటిన రెండో భారతీయ హీరోగా రజనీకాంత్ నిలిచారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్, యశ్, షారుఖ్ ఖాన్ రెండేసి సార్లు ఈ ఘనత సాధించారు.