Jailer 2 OTT Release Date: ఓటీటీ లవర్స్ గెట్ రెడీ. ముందుగానే సబ్ స్క్రిప్షన్ చెక్ చేసుకోండి. డివైజెస్ రెడీ చేసుకోండి. ఎందుకంటే ఓటీటీలోకి తలైవా సునామీ రాబోతుంది. బాక్సాఫీస్ ను షేక్ చేసిన జైలర్ 2 స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది.
జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్

ఓటీటీ ఆడియన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్న అనౌన్స్ మెంట్ వచ్చేసింది. జైలర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను ఇవాళ ప్రకటించేశారు. ఈ సినిమా నవంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఆ రోజు నుంచే ఓటీటీలో రజినీకాంత్ టైగర్ కా హుకుం స్టార్ట్ కానుంది.
డిజిటల్ రైట్స్
జైలర్ 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర బంపర్ హిట్ సాధించింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.160 కోట్లు చెల్లించినట్లు తెలిసింది. ఓ తమిళ మూవీ డిజిటల్ రైట్స్ కోసం ఇంత మొత్తం ఖర్చు పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్. ఇలా రిలీజ్ కు ముందే జైలర్ 2 రికార్డు క్రియేట్ చేసింది.
కలెక్షన్ రికార్డులు
కలెక్షన్ల పరంగా జైలర్ 2 సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కేవలం 21 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.821.10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇండియాలో రూ.545 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. కేరళ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 9 ఏళ్ల నాటి 'బాహుబలి 2' రికార్డును సైతం చెరిపేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓవర్సీస్ లోనూ రూ.276 కోట్ల వసూళ్లతో తన స్టామినా ఏంటో నిరూపించింది.
మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులు
బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో టైగర్ ముత్తువేల్ పాండియాన్ గా రజినీకాంత్ మరింత పవర్ ఫుల్ గా తిరిగొచ్చారు. ఫస్ట్ మూవీలో తన ఫ్యామిలీని రజినీకాంత్ కాపాడుకున్న సంగతి తెలిసిందే. ఈ సెకండాఫ్ లో వర్మన్ వెనుకాల ఉన్న పెద్ద గ్యాంగ్ తో రజినీకాంత్ తలపడతారు.
{{/usCountry}}బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ గా జైలర్ 2 వచ్చింది. నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమాలో టైగర్ ముత్తువేల్ పాండియాన్ గా రజినీకాంత్ మరింత పవర్ ఫుల్ గా తిరిగొచ్చారు. ఫస్ట్ మూవీలో తన ఫ్యామిలీని రజినీకాంత్ కాపాడుకున్న సంగతి తెలిసిందే. ఈ సెకండాఫ్ లో వర్మన్ వెనుకాల ఉన్న పెద్ద గ్యాంగ్ తో రజినీకాంత్ తలపడతారు.
{{/usCountry}}ఈ క్రమంలో మూవీలో వచ్చే మైండ్ బ్లాక్ ట్విస్టులు ఆడియన్స్ కు అదిరిపోయే థ్రిల్ అందిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు, క్లైమాక్స్ లో వచ్చే గెస్ట్ అప్పియరెన్స్ ట్విస్టులు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
5 కారణాలు
జైలర్ 2ను ఓటీటీలో చూసేందుకు 5 బలమైన కారణాలున్నాయి.
- 30 నిమిషాల ఎక్స్ట్రా ఫుటేజ్: థియేటర్ వెర్షన్ లో నిడివి కారణం వల్ల కట్ చేసిన దాదాపు 30 నిమిషాల సీన్లను ఓటీటీ వెర్షన్ లో కలపనున్నారు.
- అదిరిపోయే క్యామియోలు: మోహన్ లాల్, సంతోష్, విజయ్ సేతుపతితో పాటు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్లు ఈ అన్ కట్ వెర్షన్ లో మరింత ఎక్కువగా కనువిందు చేయనున్నారు.
- టైగర్ ముత్తువేల్ పాండియన్ స్వాగ్: సూపర్ స్టార్ రజనీకాంత్ స్క్రీన్ ప్రెజెన్స్, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్ లు మరోసారి ఆడియన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం. విద్యాబాలన్, రమ్యకృష్ణల నటన కూడా అలరిస్తుంది.
- నెల్సన్ మార్క్ టేకింగ్: నెల్సన్ దిలీప్ కుమార్ మార్క్ డార్క్ కామెడీ, యాక్షన్ ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి.
- రికార్డుల రారాజు: థియేటర్లలో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన ఈ ఇండస్ట్రీ హిట్ ను మన ఇంట్లో ఫ్యామిలీతో కలిసి అద్భుతమైన క్వాలిటీలో చూసేయొచ్చు.