...
...
Next Story

Jana Nayagan: సీఎం విజ‌య్‌కు ఫ్యాన్‌లా మారిపోయిన కోలీవుడ్ స్టార్ హీరో.. థియేట‌ర్లో విజిల్స్ కొడుతూ జ‌యం ర‌వి ర‌చ్చ‌!

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ సినిమా విషయాలు ట్రెండింగ్ గా మారుతున్నాయి. జూలై 23న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఘనంగా విడుదలైంది. ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ (జయం రవి) ఈ సినిమాను థియేటర్లలో చూస్తూ, విజిల్స్ వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఈ వీడియో తెగ వైరల్ గా మారింది.

Published on: Jul 24, 2026, 16:10:02 IST
Advertisement

Jana Nayagan: ఎన్నో వివాదాలను అధిగమించి హెచ్.వినోత్ దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' ఈ గురువారం (జూలై 23) థియేటర్లలోకి వచ్చింది. విజయ్‌కి నటుడిగా ఇదే ఆఖరి సినిమా కావడంతో విమర్శకుల టాక్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులు భారీ ఎత్తున థియేటర్లకు తరలివస్తున్నారు.

విజయ్ ఎంట్రీకి జయం రవి హంగామాః

సీఎం విజ‌య్‌కు ఫ్యాన్‌లా మారిపోయిన కోలీవుడ్ స్టార్ హీరో.. థియేట‌ర్లో విజిల్స్ కొడుతూ జ‌యం ర‌వి ర‌చ్చ‌!
సీఎం విజ‌య్‌కు ఫ్యాన్‌లా మారిపోయిన కోలీవుడ్ స్టార్ హీరో.. థియేట‌ర్లో విజిల్స్ కొడుతూ జ‌యం ర‌వి ర‌చ్చ‌!

జన నాయగన్ సినిమా విడుదలై హంగామా సృష్టిస్తున్న వేళ, ప్రముఖ తమిళ నటుడు రవి మోహన్ చెన్నైలోని 'వెట్రి థియేటర్' లో సామాన్య ప్రేక్షకుడిలా సినిమా చూశాడు. థియేటర్ ఆఖరి వరుసలో కూర్చున్న రవి మోహన్.. దళపతి విజయ్ గ్రాండ్ ఎంట్రీ సీన్ రాగానే గట్టిగా ఈలలు వేస్తూ, చప్పట్లతో గోల చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమా ముగిసిన అనంతరం బయటకు వచ్చిన రవి మోహన్ (జయం రవి) థియేటర్ వద్ద వేచి ఉన్న అభిమానులతో ఓపిగ్గా సెల్ఫీలు దిగి వెళ్లిపోయాడు.

పండగలా మారిన రిలీజ్

మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన కథానాయకుడు.. చనిపోయిన తన స్నేహితుడి కుమార్తెను పెంచి పెద్దచేసి, ఆమె చిన్ననాటి భయాలను పోగొట్టి ఇండియన్ ఆర్మీలో చేరేలా ప్రోత్సహిస్తాడు. ఈ క్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను బెదిరించే అవినీతి పరులతో అతను జరిపిన పోరాటమే 'జన నాయగన్' కథాంశం. ఈ సినిమాలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరేన్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు.

డే 1 బాక్సాఫీస్ లెక్కలు

ట్రేడ్ ట్రాకర్ 'సక్నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం..

జన నాయగన్ ఇండియా నెట్ కలెక్షన్ (Day 1 Net): రూ. 41 కోట్లు.

వరల్డ్ వైడ్ గ్రాస్ (Day 1 Worldwide Gross): రూ. 78 కోట్లు.

విజయ్ గత చిత్రం 'లియో' (రూ.64.80 కోట్లు నెట్), రజనీకాంత్ 'కూలీ' (రూ.65 కోట్లు నెట్), 'రోబో 2.0' (రూ. 60.25 కోట్లు) లాగా జన నాయగన్ కూడా తొలిరోజే ఇండియాలో రూ.50 కోట్ల నెట్ దాటుతుందని అనుకున్నారు. కానీ సెకండ్ హాఫ్ పై వచ్చిన మిశ్రమ స్పందన వల్ల రూ.41 కోట్ల వద్ద ఆగిపోయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe