జాన్వీ కపూర్‌కు మరో బంపర్ ఆఫర్.. మొన్న ఎన్టీఆర్, నిన్న రామ్ చరణ్, ఇప్పుడు అల్లు అర్జున్‌తో..!

జాన్వీ కపూర్ తెలుగులో మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందా? ఈసారి అల్లు అర్జున్, అట్లీ మూవీలో నటించబోతోందా? తాజాగా వస్తున్న రిపోర్టులు ఇవే చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.

Published on: Feb 14, 2026 8:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్-ఇండియా మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో దీపికా పదుకోన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ అప్డేట్ వివరాలు ఇక్కడ చూడండి.

జాన్వీ కపూర్‌కు మరో బంపర్ ఆఫర్.. మొన్న ఎన్టీఆర్, నిన్న రామ్ చరణ్, ఇప్పుడు అల్లు అర్జున్‌తో..!
జాన్వీ కపూర్‌కు మరో బంపర్ ఆఫర్.. మొన్న ఎన్టీఆర్, నిన్న రామ్ చరణ్, ఇప్పుడు అల్లు అర్జున్‌తో..!

జాన్వీ కపూర్ ఎంట్రీ..

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు. 'పుష్ప' సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న బన్నీ.. తన నెక్ట్స్ సినిమాలను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగానే వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అట్లీ కుమార్ తో చేతులు కలిపాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మరో కథానాయికగా అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన, చేస్తున్న జాన్వీ.. ఇప్పుడు అల్లు అర్జున్‌తో కూడా జతకట్టనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోయే కొద్ది రోజుల్లోనే వెలువడే అవకాశం ఉంది.

దీపికా పదుకోన్‌తో స్క్రీన్ షేరింగ్..

ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే అట్లీ ఏమాత్రం రాజీ పడటం లేదు. ఇప్పటికే బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఈ మూవీలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడు జాన్వీ కపూర్ కూడా తోడవడంతో.. ఇద్దరు బాలీవుడ్ భామలు అల్లు అర్జున్‌తో కలిసి నటించబోతున్నారు. ఇది సినిమాకు మరింత గ్లామర్, పాన్-ఇండియా అప్పీల్‌ను తీసుకురానుంది.

అట్లీ కుమార్ సినిమాలంటేనే భారీతనం, కమర్షియల్ హంగులకు పెట్టింది పేరు. అతని సినిమాల్లో హీరోయిజం, ఎమోషన్స్, భారీ సెట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇప్పుడు అల్లు అర్జున్ వంటి ఎనర్జిటిక్ స్టార్ దొరకడంతో.. అట్లీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడు.

జాన్వీ కపూర్ కనుక ఈ ప్రాజెక్ట్‌లో ఖరారైతే.. ఆమె కెరీర్‌లోనే ఇది అతిపెద్ద ప్రాజెక్ట్ అవుతుంది. తెలుగులో అగ్ర హీరోలందరితోనూ నటించిన ఘనత ఆమెకు దక్కుతుంది. ఇప్పటికే ఆమె ఎన్టీఆర్ తో కలిసి దేవరలో కనిపించగా.. రామ్ చరణ్ తో పెద్దిలోనూ నటిస్తోంది. అల్లు అర్జున్ మాస్ ఇమేజ్, అట్లీ టేకింగ్, దీపికా, జాన్వీల గ్లామర్.. వెరసి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.