Janhvi Kapoor Peddi Controversy: రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi Movie) చిత్రంలో హీరోయిన్ పాత్రపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను కేవలం గ్లామర్ వస్తువులా (Objectification) చూపించారనే వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో గ్లామర్, అన్ కంఫర్టబుల్ కెమెరా యాంగిల్స్ పై జాన్వీ కపూర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
సెక్సువలైజ్ చేయడం తప్పు

గతంలో ప్రముఖ పాడ్‌కాస్టర్ రాజ్ షమాని షోలో పాల్గొన్న సమయంలో జాన్వీ కపూర్ సినిమాల్లో మహిళల గ్లామర్ ప్రదర్శన, మేకర్స్ మైండ్‌సెట్‌పై చాలా నిర్మొహమాటంగా మాట్లాడింది.
"మనం స్క్రీన్‌పై ఏం చేస్తామనేదానికి ఓకే చెప్పాం అనేదానిపై అంతా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, నేను ఒక సినిమాలో 'భీగీ శారీ' పాట చేశా. అందులో కాస్త గ్లామరస్‌గా, సెన్సువల్ గా డ్యాన్స్ చేశా. ఆ పాట ఉద్దేశం ప్రేక్షకులకు ఒక రొమాంటిక్, గ్లామరస్ ఫీల్ ఇవ్వడం. దానికి నేను పూర్తిగా అంగీకరించా. కానీ, ఒక నటి అనుమతి లేకుండా, కేవలం ఆమె బాడీని ఒక వస్తువులా చూపిస్తూ సెక్సువలైజ్ చేయడం అనేది పూర్తిగా వేరు. అలాంటి ప్రవర్తన నన్ను తీవ్రంగా కలచివేస్తుంది" అని జాన్వీ స్పష్టం చేసింది.
కెమెరా యాంగిల్స్ నచ్చకపోతే
షూటింగ్ స్పాట్‌లో హీరోయిన్లకు ఎదురయ్యే ప్రాక్టికల్ ఇబ్బందుల గురించి కూడా జాన్వీ కపూర్ ఓపెన్ అయింది. షూటింగ్ సమయంలో డీఓపీ (కెమెరామెన్) తనకు అసౌకర్యంగా అనిపించే యాంగిల్స్‌లో కెమెరా పెడితే, ఇప్పుడు మొహమాటం లేకుండా ఎదురు చెప్పడం నేర్చుకుంటున్నట్లు తెలిపింది.
భయం ఉండేది
"గతంలో కొన్నిసార్లు చాలా మర్యాదగా ఉందామని సర్దుకుపోయా. నో చెప్తే ఎక్కడ అన్‌ప్రొఫెషనల్ అనుకుంటారోనని భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నా పద్ధతి మార్చుకున్నాను. 'నాకిది వద్దు, ఇలాంటి షాట్స్ నాకు వద్దు' అని మర్యాదగానే నా పాయింట్ చెప్తున్నాను" అని జాన్వీ కపూర్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది.
{{/usCountry}}"గతంలో కొన్నిసార్లు చాలా మర్యాదగా ఉందామని సర్దుకుపోయా. నో చెప్తే ఎక్కడ అన్‌ప్రొఫెషనల్ అనుకుంటారోనని భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నా పద్ధతి మార్చుకున్నాను. 'నాకిది వద్దు, ఇలాంటి షాట్స్ నాకు వద్దు' అని మర్యాదగానే నా పాయింట్ చెప్తున్నాను" అని జాన్వీ కపూర్ ఆ ఇంటర్వ్యూలో పేర్కొంది.
{{/usCountry}}'అచ్చియమ్మ' పాత్రపై ట్రోలింగ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తోంది. అయితే సినిమాలోని హీరోయిన్ క్యారెక్టరైజేషన్ మాత్రం తీవ్ర వివాదాలకు దారితీసింది. జాన్వీ కపూర్ పాత్రను ఓవర్‌సెక్సువలైజ్ (Over-sexualization) చేశారని, కథకు అనవసరమైన గ్లామర్ సీన్స్ పెట్టారనే విమర్శలు వస్తున్నాయి.
డైరెక్టర్ క్షమాపణ!
దీనిపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు సాన ఇప్పటికే ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పడమే కాకుండా, థియేటర్ల నుంచి ఆ అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఈ లోపే నెటిజన్లు "ఇలాంటి పాత్రకు అసలు ఎలా ఒప్పుకున్నావ్ జాన్వీ?" అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. దీనికి సమాధానంగా ఆమె గతంలో ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
People Also Ask (PAA) - తరచుగా అడిగే ప్రశ్నలు
1. పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ వివాదం ఏంటి?
జవాబు: ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' అనే పాత్ర పోషించింది. అయితే ఈ పాత్రను కథకు సంబంధం లేకుండా మితిమీరిన గ్లామరస్‌గా, ఆబ్జెక్టిఫై చేస్తూ చూపించారనే విమర్శలు రావడంతో సోషల్ మీడియాలో వివాదం రేగింది.
2. పెద్ది మూవీలోని కొన్ని సీన్లు డిలీట్ చేశారా?
జవాబు: అవును.. ప్రేక్షకులు, నెటిజన్ల అభ్యంతరాలను గౌరవిస్తూ, హీరోయిన్ పాత్రకు సంబంధించిన కొన్ని వివాదాస్పద, అసౌకర్య సన్నివేశాలను థియేట్రికల్ ప్రింట్ నుంచి తొలగిస్తున్నట్లు దర్శకుడు బుచ్చిబాబు సానా అధికారికంగా ప్రకటించాడు.
3. జాన్వీ కపూర్ తెలుగులో చేసిన సినిమాలు ఏవి?
జవాబు: జాన్వీ కపూర్ ఇప్పటివరకూ తెలుగులో రెండు సినిమాలు చేసింది. ఎన్టీఆర్ హీరోగా ‘దేవర’ మూవీతో టాలీవుడ్ డెబ్యూ చేసింది. ఇప్పుడు పెద్దిలో నటించింది.