Janhvi Kapoor Sreeleela: హిందీ, తెలుగు ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు స్టార్ హీరోయిన్లు జాన్వీ కపూర్, శ్రీలీల తొలిసారిగా ఒకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఇంకా అధికారికంగా టైటిల్ నిర్ణయించని ఈ భారీ రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌లో సిద్ధార్థ్ గుప్తా (Siddharth Gupta) హీరోగా నటిస్తున్నాడు. 'పగ్లైట్' వంటి ప్రశంసలు పొందిన కల్ట్ సినిమాను అందించిన ఉమేష్ బిష్త్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
షూటింగ్ షురూ

జాన్వీ కపూర్, శ్రీలీల కలిసి నటిస్తున్న రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ షురూ అయింది. ప్రకృతి అందాలకు నిలయమైన ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ (Nainital) కొండప్రాంతాలలో ఈ సినిమా తొలి షూటింగ్ షెడ్యూల్‌ను మేకర్స్ ప్రారంభించారు. ప్రస్తుతం లొకేషన్లలో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఆబ్సెసివ్ లవ్ డ్రామా!
ఈ సినిమా స్టోరీ సాధారణ రొమాంటిక్ సినిమాలకు భిన్నంగా అత్యంత డార్క్ అండ్ మైండ్-బెండింగ్ ఎలిమెంట్స్‌తో సాగనుందని తెలుస్తోంది. ఒకే పురుషుడితో ప్రేమలో పడి, అతనిపై విపరీతమైన పిచ్చి వ్యామోహాన్ని (Obsessive Love) పెంచుకునే ఇద్దరు స్త్రీల మానసిక సంఘర్షణ, వారి మధ్య జరిగే ఆధిపత్య పోరు ఈ కథకు ప్రధాన ఆధారం.
ప్రేమను కేవలం గ్లామరస్ డ్రామాగా కాకుండా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కోణంలో ఆవిష్కరించడంలో సిద్ధహస్తుడైన ఉమేష్ బిష్త్.. జాన్వీ కపూర్-శ్రీలీల ఇమేజ్‌కు తగినట్లుగా పవర్ఫుల్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్లను డిజైన్ చేశారని తెలిసింది.
టాప్ ప్రొడ్యూసర్స్
ఈ వినూత్న ప్రాజెక్ట్ కోసం ఏక్తా ఆర్ కపూర్ (Balaji Motion Pictures), ఆస్కార్ అవార్డు గ్రహీత గునీత్ మోంగా కపూర్ (Sikhya Entertainment) చేతులు కలపడం విశేషం. కమర్షియల్ వినోదాన్ని అందించడంలో ఏక్తా కపూర్, పవర్ఫుల్ కంటెంట్-డ్రివెన్ సినిమాలను రూపొందించడంలో గునీత్ మోంగాలకు ఉన్న అనుభవం ఈ సినిమా మేకింగ్ వాల్యూస్ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనుంది.
బాలీవుడ్ లో పాగా
'ధమాకా', 'గుంటూరు కారం' చిత్రాలతో పాటు 'పుష్ప 2' లో ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్‌తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన శ్రీలీల.. ఈ ప్రాజెక్ట్‌తో హిందీ బెల్ట్‌లో నటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. కేవలం రొటీన్ గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ ఎంచుకోవడం ఆమె కెరీర్‌కు మైలేజ్ ఇస్తుంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ హీరోగా శ్రీలీల హిందీలో ఓ మూవీ చేస్తోంది.
{{/usCountry}}'ధమాకా', 'గుంటూరు కారం' చిత్రాలతో పాటు 'పుష్ప 2' లో ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్‌తో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన శ్రీలీల.. ఈ ప్రాజెక్ట్‌తో హిందీ బెల్ట్‌లో నటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందనే టాక్ వినిపిస్తోంది. కేవలం రొటీన్ గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ ఎంచుకోవడం ఆమె కెరీర్‌కు మైలేజ్ ఇస్తుంది. ఇప్పటికే కార్తీక్ ఆర్యన్ హీరోగా శ్రీలీల హిందీలో ఓ మూవీ చేస్తోంది.
{{/usCountry}}దేవర, పెద్ది లాంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన జాన్వీ కపూర్ ఇప్పుడు శ్రీలీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. జాన్వీ, శ్రీలీల ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై హైప్ భారీగా పెరిగింది.