ఓటీటీలోకి ఈ వారం అనేక సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో ఇవాళ ఒక్కరోజు రెండు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. రెండు రొమాంటిక్ కామెడీ జోనర్స్ అయినప్పటికీ భిన్నమైన కథలతో ఈ సినిమాలు తెరకెక్కాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం సన్నీ సంస్కారి కీ తులసి కుమారి. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, బ్యూటిఫుల్ జాన్వీ కపూర్, సాన్య మల్హోత్రా, రోహిత్ సురేష్ షరఫ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించారు.
అక్టోబర్ 02న థియేటర్లలో విడుదలైన సన్నీ సంస్కారి కీ తులసి కుమారి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. సినిమాలోని కామెడీ బాగానే ఉందని టాక్ వచ్చింది. ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.2 రేటింగ్ సాధించుకుంది ఈ సినిమా.
సినిమా కథ
సన్నీ (వరుణ్ ధావన్)తో అనన్య (సాన్య మల్హోత్రా), తులసి (జాన్వీ కపూర్)తో విక్రమ్ (రోహిత్ సురేష్) పలు కారణాలతో బ్రేకప్ చెబుతారు. దాంతో సన్నీ, తులసి హార్ట్ బ్రేక్ అయి బాధపడుతుంటారు. ఈ క్రమంలో ఇద్దరు ఒకరికొకరు టీమ్‌గా ఏర్పడి తమ పార్టనర్స్‌కు తామెంటో నిరూపించాలనుకుంటారు.
ఎక్స్ లవర్స్ అంతా కలిసి చేసే డ్రామా అంతా కామెడీగా, రొమాంటిక్‌గా ఉంటూ అట్రాక్ట్ చేస్తుంది. చివరిగా ఎవరు ఎవరికి జోడీ అయ్యారనేది ఈ మూవీ కథ. నేడు (నవంబర్ 27) నెట్‌ఫ్లిక్స్‌లో సన్నీ సంస్కారి కీ తులసి కుమారి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. జాన్వీ కపూర్, సాన్య మల్హోత్రాల గ్లామర్‌తోపాటు కామెడీ టైమింగ్ చూడాలనుకునేవారు ఈ మూవీపై లుక్కేయొచ్చు.
నిక్కా జైల్దార్ 4
ఓటీటీలోకి నేడు స్ట్రీమింగ్‌కు వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ సినిమా నిక్కా జైల్దార్ 4. ఇది ఒక పంజాబీ చిత్రం. ఈ సినిమా కూడా రొమాంటిక్ కామెడీ అంశాలతో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ తాగుబోతు పెళ్లాంతో హీరో పడే తంటాలు నవ్వించేలా ఉంటాయి.
{{/usCountry}}ఓటీటీలోకి నేడు స్ట్రీమింగ్‌కు వచ్చిన మరో రొమాంటిక్ కామెడీ సినిమా నిక్కా జైల్దార్ 4. ఇది ఒక పంజాబీ చిత్రం. ఈ సినిమా కూడా రొమాంటిక్ కామెడీ అంశాలతో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ తాగుబోతు పెళ్లాంతో హీరో పడే తంటాలు నవ్వించేలా ఉంటాయి.
{{/usCountry}}నిక్కా జైల్దార్ 4 సినిమాలో తాగుబోతు పెళ్లాంగా బ్యూటిఫుల్ సోనమ్ బజ్వా చేసింది. ఖడ్గం మూవీలో హీరోయిన్‌గా సోనమ్ బజ్వా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. సోనమ్‌తోపాటు అమ్మీ విర్క్ హీరోగా చేశాడు. నిర్మల్ రిషి, సుఖి చాహల్, బీఎన్ శర్మ ఇతర కీలక పాత్రలు పోషించారు.
మద్యపానంపై పోరాటం
సిమెర్‌జిత్ సింగ్ దర్శకత్వం వహించిన నిక్కా జైల్దార్ 4 మూవీ కూడా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6 రేటింగ్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ అంశాలకు కాస్తా పాలిటిక్స్, ఫ్యామిలీ డ్రామాను అద్దారు. గ్రామంలో మద్యపానం పోరాటం చేసేందుకు నిక్కా (అమ్మీ విర్క్) బామ్మ పోరాటం చేస్తుంది.
ఈ క్రమంలో రాజకీయాల్లో నిలబడుతుంది. మరోవైపు సిటీ అమ్మాయి అయిన ఏంజిల్ ప్రీత్‌ను ఇష్టపడతాడు నిక్కా. మద్యంపై తను చెప్పిన స్పీచ్ చూసి ప్రేమలో పడతాడు. ఇంట్లోవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. తీరా శోభనం గదిలో ప్రీత్ తెగ తాగుతుందని తెలిసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏమైందనేదే ఈ సినిమా కథ.
నిక్కా జైల్దార్ 4 ఓటీటీ
ఇవాళ (నవంబర్ 27) చౌపల్ అనే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో నిక్కా జైల్దార్ 4 ఓటీటీ రిలీజ్ అయింది. పంజాబీ భాషలో మాత్రమే నిక్కా జైల్దార్ 4 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.