January 12 Vidudala Diviki Diviki Song: సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టే హిట్ మెషిన్ అనిల్ రావిపూడి మరోసారి పండగ సందడిని ముందే తీసుకొచ్చారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ తొలిసారి కలిసి నటిస్తున్న భారీ ఎంటర్‌టైనర్ 'జనవరి 12 విడుదల' (January 12 Vidudala) నుంచి తొలి పాట అప్‌డేట్ వచ్చేసింది.
డివికి డివికి సాంగ్

సంక్రాంతి 2027 రేసులో ఉన్న సినిమాలన్నింటికంటే ముందుగానే జనవరి 12 విడుదల మూవీ టీమ్ మ్యూజికల్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సినిమాలోని మొదటి పాట 'డివికి డివికి’ (Divviki Divviki) ప్రోమోను శుక్రవారం (నవంబర్ 20) రిలీజ్ చేసింది. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాటలో హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి తమ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టారు.
ఫుల్ సాంగ్ ఎప్పుడంటే?
సంప్రదాయ లంగా ఓణీల్లో మెరిసిపోతూనే కీర్తి సురేష్, కృతి శెట్టి పోటాపోటీగా వేసిన ఫుల్ మాస్ స్టెప్పులు డివికి డివికి సాంగ్ పై భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన పక్కా మాస్ బీట్ ఈ ప్రోమోకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాట పూర్తి లిరికల్ వీడియోను రేపు (నవంబర్ 21) విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
అనిల్ రావిపూడి మార్క్
మూవీ ప్రమోషన్ల విషయంలో ఎప్పుడూ తనదైన శైలిని చూపించే అనిల్ రావిపూడి.. ఈ ఫస్ట్ సింగిల్ అనౌన్స్‌మెంట్ కోసం నిన్న (నవంబర్ 19) ఓ సరదా వీడియోను వదిలారు. రజనీకాంత్ నటించిన క్లాసిక్ చిత్రం 'దళపతి'లోని ఓ ఐకానిక్ సీన్‌ను అనిల్ రావిపూడి, కృతి శెట్టి, కీర్తి సురేష్ కామెడీ టచ్‌తో రీక్రియేట్ చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో తొలి పాటపై ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ నెలకొంది.
బావ బామ్మర్ది కాంబినేషన్
'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 12 విడుదల తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా కనిపించనుండగా, ఆయన సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన 'దీపు' అనే పాత్రలో కృతి శెట్టి సందడి చేయనుంది. వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'ఎఫ్2', 'ఎఫ్3', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రాల తర్వాత వస్తున్న ఐదో సినిమా ఇది.
{{/usCountry}}'బావ బామ్మర్ది సౌజన్యంతో' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జనవరి 12 విడుదల తెరకెక్కుతోంది. ఇందులో వెంకటేష్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా కనిపించనుండగా, ఆయన సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన 'దీపు' అనే పాత్రలో కృతి శెట్టి సందడి చేయనుంది. వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'ఎఫ్2', 'ఎఫ్3', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మన శంకర వర ప్రసాద్ గారు' చిత్రాల తర్వాత వస్తున్న ఐదో సినిమా ఇది.
{{/usCountry}}అలాగే దర్శకుడిగా తనకు తొలి హిట్ ఇచ్చిన 'పటాస్' తర్వాత కళ్యాణ్ రామ్‌తో అనిల్ మళ్లీ జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లోనూ భారీ హైప్ ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తున్నాయి. టైటిల్‌కు తగ్గట్టుగానే 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.