...
...
Next Story

JioHotstar OTT: జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఒకే కథతో 2 సిరీస్‌లు- సేమ్ సేమ్ బట్ ఢిపరెంట్- రేపటి వార్త ముందే తెలిస్తే?

Jio Hotstar OTT Series Telugu: జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఒకే కథతో రెండు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. రేపటి వార్త ముందే తెలిస్తే అనే కాన్సెప్ట్‌తో ఈ రెండు అలరిస్తున్నాయి. మరి జియో హాట్‌స్టార్‌లో తెలుగులో ఓటీటీ రిలీజ్ అయిన ఆ రెండు సిరీస్‌లు, వాటి కథ ఏంటో తెలుసుకుందాం.

Published on: Nov 24, 2026, 16:30:22 IST
Advertisement

Jio Hotstar OTT Series Telugu: ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తూనే ఉంటాయి. ఇక క్రైమ్, కామెడీ, సస్పెన్స్ అంశాలు కలగలిసిన కథలకు ఓటీటీ ఆడియెన్స్‌లో మంచి క్రేజ్ ఉంటుంది.

ఉత్కంఠభరితమైన ఓటీటీ సిరీస్

జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఒకే కథతో 2 సిరీస్‌లు- సేమ్ సేమ్ బట్ ఢిపరెంట్- రేపటి వార్త ముందే తెలిస్తే?
జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఒకే కథతో 2 సిరీస్‌లు- సేమ్ సేమ్ బట్ ఢిపరెంట్- రేపటి వార్త ముందే తెలిస్తే?

సరిగ్గా అలాంటి ఉత్కంఠభరిత మలుపులతో ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే రెండు ఓటీటీ సిరీసులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందులో ఒకదాంట్లో 'బీబీ కీ వైన్స్' (BB Ki Vines) ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాపులర్ యూట్యూబర్ భువన్ బామ్ ఇందులో హీరోగా నటించడం విశేషం. ఇప్పటికే రెండు సీజన్లు విడుదలై సూపర్ హిట్ అవ్వగా, అభిమానులు మూడో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ముంబై మురికివాడ నుంచి కోటీశ్వరుడి దాకా.. కథ ఏంటంటే?

ముంబైలోని ఓ మురికివాడలో నివసిస్తూ పబ్లిక్ టాయిలెట్లు శుభ్రం చేసే వస్య అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పేదరికంలో మగ్గిపోతున్న వస్య, మధు అనే సెక్స్ వర్కర్‌ను ప్రాణంగా ప్రేమిస్తాడు. అయితే ఓ శక్తివంతమైన మంత్రి కన్ను కూడా మధుపై పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వృద్ధురాలు వస్యకు ఇచ్చిన వింత వరం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. జరగబోయే సంఘటనలు, వార్తలు వస్యకు ముందే తెలిసిపోతుంటాయి.

ఈ అద్భుత శక్తిని ఆసరాగా చేసుకుని వస్య, తన స్నేహితుడు పీటర్‌తో కలిసి బెట్టింగ్‌ల ద్వారా భారీగా డబ్బు సంపాదిస్తాడు. రాత్రికి రాత్రే విలాసవంతమైన జీవితంలోకి అడుగుపెడతాడు. అయితే ఊహించని విధంగా వచ్చిపడిన ఈ సంపద అతనికి కొత్త చిక్కులను తెచ్చిపెడుతుంది.

ఇంతటి ఆసక్తికర కథనంతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ పేరు 'తాజా ఖబర్' (Taaza Khabar). హిమాంక్ గౌర్ ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. భువన్ బామ్ తన సహజ నటనతో యూట్యూబర్ ఇమేజ్‌ను దాటి నటుడిగా మెప్పించారు. ఇందులో శ్రియా పిల్గావ్కర్ కథానాయికగా నటించగా, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు జేడీ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు.

వీరితో పాటు మహేష్ మంజ్రేకర్, జావేద్ జాఫ్రీ, శిల్పా శుక్లా, దేవెన్ భోజాని, ప్రథమేష్ పరబ్, నిత్య మాథుర్ తదితరులు తమ నటనతో సిరీస్‌కు బలం చేకూర్చారు. అయితే, సేమ్ ఇలాంటి కథనంతోనే తెలుగులో వరం వెబ్ సిరీస్ కూడా వచ్చింది. ఇందులో విశ్వదేవ్ రాచకొండ, శివాత్మిక రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలుగా నటించారు.

దేని రేటింగ్ ఎంతంటే?

ఈ రెండు వెబ్ సిరీస్‌లు జియో హాట్‌స్టార్ (JioHotstar)లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. జియో హాట్‌స్టార్‌లో అత్యధిక మంది వీక్షించిన, ప్రేక్షకాదరణ పొందిన సిరీస్‌లలో 'తాజా ఖబర్' ఒకటిగా నిలిచింది. తాజా ఖబర్ తెలుగు భాషలో కూడా ఓటీటీ రిలీజ్ అయింది.

తాజా ఖబర్ సిరీస్ నాణ్యతకు, కథనంలోని వేగానికి నిదర్శనంగా ఐఎమ్‌డీబీ (IMDb)లో ఏకంగా 8 రేటింగ్ దక్కింది. ఇక వరం వెబ్ సిరీస్‌కు మాత్రం 4.7 రేటింగ్ దక్కింది. జియో హాట్‌స్టార్‌లోని ఈ రెండు వెబ్ సిరీస్‌లు చూసేందుకు సేమ్ సేమ్ అన్నట్లుగా ఉన్న రేటింగ్‌తో మాత్రం డిఫరెంట్ అనిపించుకున్నాయి.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks