...
...
Next Story

NTR Anil Ravipudi: వారెవా టైటిలే క్రేజీ ఉందిగా..అనిల్ రావిపూడి-ఎన్టీఆర్ మూవీ పేరు ఇదేనా..తాత సెంటిమెంట్..ఇంటర్నెట్ షేక్!

NTR Anil Ravipudi: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ టైటిల్ గురించి నెట్టింట ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది.

Published on: Nov 16, 2026, 12:58:45 IST
Advertisement

NTR Anil Ravipudi: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, అనిల్ రావిపూడి ఫస్ట్ టైమ్ జతకడుతుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ టైమింగ్, ఎన్టీఆర్ యాక్షన్ ఇమేజ్ కలయికలో ఈ సినిమా సరికొత్తగా ఉండబోతోంది. ఈ సినిమాకు దివంగత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు బ్లాక్ బస్టర్ సినిమా స్ఫూర్తితో ఓ పేరును పరిశీలిస్తున్నారట.

'దాన వీర శూర' ఫైనల్ అయినట్లేనా?

వారెవా టైటిలే క్రేజీ ఉందిగా..అనిల్ రావిపూడి-ఎన్టీఆర్ మూవీ పేరు ఇదేనా..తాత సెంటిమెంట్..ఇంటర్నెట్ షేక్! (x/NTRArtsOfficial)
వారెవా టైటిలే క్రేజీ ఉందిగా..అనిల్ రావిపూడి-ఎన్టీఆర్ మూవీ పేరు ఇదేనా..తాత సెంటిమెంట్..ఇంటర్నెట్ షేక్! (x/NTRArtsOfficial)

తాజా ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ మూవీకి 'దాన వీర శూర' (Dhana Veera Soora) అనే పవర్ ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే టైటిల్ ఫైనల్ అయితే మాత్రం థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు. ఈ పవర్ ఫుల్ టైటిల్ వినగానే నందమూరి అభిమానుల్లో ఎక్కడలేని జోష్ కనిపిస్తోంది.

కామెడీతో పాటు యాక్షన్ ధమాకా

ఈ 'దాన వీర శూర' టైటిల్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా, ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్లుగా పవర్ ఫుల్ మాస్ యాక్షన్ తో మలచబోతున్నారట. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కనుంది.

మ్యూజిక్, హీరోయిన్ల వేటలో మేకర్స్

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో తారక్ సరసన స్టార్ హీరోయిన్లను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే క్యాస్ట్ అండ్ క్రూ వివరాలను నందమూరి కళ్యాణ్ రామ్ అఫిషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.

తారక్ పాన్ ఇండియా జోరు

ఇలా ఒక పక్క ప్రశాంత్ నీల్ తో హై-వోల్టేజ్ మాస్ యాక్షన్, మరో పక్క త్రివిక్రమ్ తో మైథలాజికల్ యాక్షన్, ఇప్పుడు అనిల్ రావిపూడితో ఫుల్ లెన్త్ ఎంటర్టైనర్.. ఇలా మూడు విభిన్నమైన జానర్లతో తారక్ తన లైనప్ సెట్ చేసుకున్నారు. ఈ ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా లెవల్లో తారక్ స్టామినాను మరోసారి బాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks