Jr NTR Chuttamalle Song: దేవర' చిత్రంలోని బ్లాక్‌బస్టర్ 'చుట్టమల్లే' పాటను ఏఐతో నీచంగా మార్ఫింగ్ చేశారు. నిజానికి ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తుంటారు. వాళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ సెన్సేషన్ గా మారింది. అయితే ఇప్పుడు ఏఐని యూజ్ చేసి అత్యంత నీచంగా, అసభ్యకరంగా ఆ వీడియోను మార్ఫ్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ వార్నింగ్

చుట్టమల్లే సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఏఐని వాడి జాన్వీ కపూర్ న్యూడ్ గా ఉన్నట్లు ఆ వీడియో సాంగ్ లో చూపించారు. అదెంతో అసహ్యకరంగా ఉంది. ఈ వీడియోపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్టయ్యారు. సీరియస్ గా దీన్ని క్రియేట్ చేసిన, షేర్ చేస్తున్న వాళ్లకు తారక్ వార్నింగ్ ఇచ్చారు.
అసహ్యకరం
‘‘అసహ్యకరం, వికృతం, సిగ్గుచేటు. స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే ఈ దేశంలో, "మాతృదేవో భవ" అనేది కేవలం ఒక పదం మాత్రమే కాకుండా మన సంస్కృతిలో ఒక భాగమైన ఈ గడ్డపై, కొంతమంది ఏఐ (AI) ని ఉపయోగించి ఒక మహిళను అత్యంత దారుణంగా అవమానించేంతలా దిగజారిపోయారు. ఇలాంటి నీచమైన కంటెంట్‌ను సృష్టించడానికి ఏఐని వాడటం వర్ణించలేనంత సిగ్గుచేటు.
ఈ మార్ఫింగ్ చేసిన 'చుట్టమల్లే' వీడియో వెనుక ఉన్న ఆ నీచులకు చెప్తున్నా.. మీలో ఎవరినీ వదిలిపెట్టను. దీన్ని సృష్టించిన వారిపై, దీన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్న వారిపై సాధ్యమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటాను.
దయచేసి ఇలాంటి వీడియోలను చూడకండి, షేర్ చేయకండి, ప్రోత్సహించకండి. ఈ రోజు అది ఇంకెవరికో జరిగింది, రేపు అది మీ తల్లి, సోదరి, భార్య లేదా కూతురికి కూడా జరగవచ్చు.
{{/usCountry}}దయచేసి ఇలాంటి వీడియోలను చూడకండి, షేర్ చేయకండి, ప్రోత్సహించకండి. ఈ రోజు అది ఇంకెవరికో జరిగింది, రేపు అది మీ తల్లి, సోదరి, భార్య లేదా కూతురికి కూడా జరగవచ్చు.
{{/usCountry}}ఇది చాలా తీవ్రమైన సమస్య. ఏఐ దుర్వినియోగానికి వ్యతిరేకంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, పటిష్టమైన నిబంధనలను తీసుకురావాలని నేను కోరుతున్నా’’ అని జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఇంత నీచమా?
చుట్టమల్లే సాంగ్ ను ఎవరో నీచులు మార్ఫ్ చేశారు. అయితే ఆ వీడియో కోసం కొంతమంది నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ‘లింక్ కావాలి ప్లీజ్’ అంటూ ఎక్స్ లో అడుక్కుంటున్నారు. ఇదే ఛాన్స్ అని లింక్ ఇస్తామంటూ కొంతమంది సిగ్గులేనివాళ్లు తమ రీచ్ పెంచుకోవడం కోసం ఫాలో చేయమని చెప్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
మొత్తానికి ఏఐతో ఇలాంటి అసభ్యకరమైన పనులు చేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. టెక్నాలజీని మంచి కోసం వాడకుండా హీరోయిన్ల ఫొటోలు, వీడియోలను న్యూడ్ గా మార్ఫింగ్ చేయడం కోసం వాడటం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ కోరినట్లుగా దీనిపై ప్రభుత్వాలు స్పందించాల్సిన అవసరం ఉంది.