...
...
Next Story

దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపం టాక్.. కానీ కలెక్షన్లలో షాక్.. కాంత మూవీ ఫస్ట్ వీకెండ్ వసూళ్లు ఎంతంటే?

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన కాంత చిత్రంలో దుల్కర్ సల్మాన్ నట విశ్వరూపానికి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ మూవీ కలెక్షన్లు చూసుకుంటే మాత్రం సీన్ రివర్స్ అయిందనే అనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో ఇక్కడ చూసేయండి.

Published on: Nov 17, 2025, 05:39:39 IST
Advertisement

సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన రెట్రో డ్రామా 'కాంత' శుక్రవారం (నవంబర్ 14) థియేటర్లలో విడుదలైంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమిళం, తెలుగులో మిశ్రమ స్పందనలు రావడంతో మొదటి వారాంతంలో వసూళ్లలో కాస్త తగ్గుదల కనిపించింది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ మాత్రం ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది.

కాంతా బాక్స్ ఆఫీస్ కలెక్షన్

కాంత పోస్టర్ లో దుల్కర్, సముద్రఖని, రానా దగ్గుబాటిి
కాంత పోస్టర్ లో దుల్కర్, సముద్రఖని, రానా దగ్గుబాటిి

దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లేెటెస్ట్ మూవీ కాంత వసూళ్లు షాకింగ్ గానే ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ లో ఈ మూవీ అదిరే ప్రదర్శన చేయలేకపోయింది. ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం, 'కాంత' ఆదివారం భారతదేశంలో సుమారు రూ.3.87 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి మూడు రోజుల్లో కలిపి ఇండియాలో వసూళ్లు రూ.13.22 కోట్లకు చేరుకున్నాయి.

సండే తగ్గిన వసూళ్లు

విడుదలైన మొదటి రోజు కాంత మూవీకి భారతదేశంలో రూ.4.35 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.10.50 కోట్ల ఓపెనింగ్ దక్కింది. శనివారం వసూళ్లు పెరిగి, భారతదేశంలో రూ.5 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ.16 కోట్లు సాధించింది. కానీ ఫస్ట్ సండే మాత్రం కలెక్షన్లు పడిపోయాయి. ఆదివారం తమిళంలో 26.49% ఆక్యుపెన్సీ, తెలుగులో 17.16% ఆక్యుపెన్సీ నమోదైంది.

కాంత గురించి..

కాంత సినిమాకు సెల్వమణి దర్శకత్వం వహించారు. వేఫారర్ ఫిల్మ్స్, స్పిరిట్ మీడియా బ్యానర్లపై దుల్కర్, రానా నిర్మించారు. 1950ల నాటి మద్రాస్‌లో జరిగే కథ ఇది. తమిళంలోనే మొదటి హారర్ చిత్రమైన 'శాంత' షూటింగ్ చేస్తున్న సూపర్ స్టార్ టికె మహదేవన్ (దుల్కర్), అతని మాజీ గురువు, దర్శకుడు అయ్య (సముద్రఖని) మధ్య ఈగో కథను ఇది చెబుతుంది. వీరిద్దరి మధ్య అహం దెబ్బతినడంతో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. కుమారి అనే యువ నటిగా భాగ్యశ్రీ, ఫీనిక్స్ అనే పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా రానా నటించారు.

హిందుస్థాన్ టైమ్స్ రివ్యూ

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks