Kalyanam Kamaneeyam Jeevitham Review And Rating In Telugu: ప్రేమ, పెళ్లి, అనుమానం, ప్రతీకారం అనే అంశాలు వెండితెరకు కొత్తేమీ కావు. అయితే, నేటితరం జెన్‌జీ యువత ఆలోచనలకు పాతకాలపు భావోద్వేగాలను, ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ కోణాన్ని జోడించి చెప్పిన సినిమానే 'కళ్యాణం కమనీయం జీవితం'.
లవ్ థ్రిల్లర్ డ్రామా

రవి లోకిరెడ్డి దర్శకత్వంలో ఖాన్ దుర్రానీ, సాహితి అవంచ జంటగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని వీవీఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై పైలా ప్రసాదరావు, కిషోర్ గుండాల నిర్మించారు. రాజవంశీ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన ఈ లవ్ థ్రిల్లర్ ఇవాళ (సెప్టెంబర్ 25) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి కళ్యాణం కమనీయం జీవితం రివ్యూలో తెలుసుకుందాం.
రెండు దారుల నడుమ జెన్‌జీ సందిగ్ధత.. కథేంటంటే?
హీరోయిన్ సునయన ఒక ఆధునిక జెన్‌జీ యువతి. తన జీవితంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఎవరిని ఎంచుకోవాలనే పెద్ద సందిగ్ధంలో పడుతుంది. నిజమైన ప్రేమకు, కేవలం ఆకర్షణకు తేడా ఏంటో తెలియక సతమతమవుతున్న సమయంలో ఒక సముద్ర తీరంలో విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ ఒక భిక్షగాడు ఆమెకు 'కల్యాణ్–కమనీయ' అనే దంపతుల ప్రేమకథను వివరిస్తాడు.
ఎంతో అన్యోన్యంగా సాగుతున్న ఆ దంపతుల జీవితంలోకి రాహుల్ అనే వ్యక్తి ప్రవేశిస్తాడు. అతడి పగ, గతం, కుట్రల కారణంగా ఆ దంపతుల నడుమ అనుమానాలు, వివాదాలు మొదలవుతాయి. అసలు కల్యాణ్-కమనీయ కథకు, నేటితరం సునయన నిర్ణయాలకు ఉన్న లింక్ ఏంటి? రాహుల్ ఎవరు? చివరికి సునయన ఏ నిర్ణయం తీసుకుంది? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
దర్శకుడి ఆలోచన.. నటీనటుల ప్రతిభ!
రొటీన్ రొమాంటిక్ డ్రామాలా కాకుండా, గతాన్ని వర్తమానంతో ముడిపెడుతూ సస్పెన్స్ ఎలిమెంట్స్ తోడయ్యేలా దర్శకుడు రవి లోకిరెడ్డి కథనాన్ని రాసుకున్నారు. బంధాల్లో నమ్మకం ఎంత కీలకమో చెప్పే ప్రయత్నం చేశారు. సెకండాఫ్లో ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులను మరికాస్త బలంగా రాసుకుని ఉంటే థ్రిల్లర్ మోతాదు మరింత పెరిగేది.
{{/usCountry}}రొటీన్ రొమాంటిక్ డ్రామాలా కాకుండా, గతాన్ని వర్తమానంతో ముడిపెడుతూ సస్పెన్స్ ఎలిమెంట్స్ తోడయ్యేలా దర్శకుడు రవి లోకిరెడ్డి కథనాన్ని రాసుకున్నారు. బంధాల్లో నమ్మకం ఎంత కీలకమో చెప్పే ప్రయత్నం చేశారు. సెకండాఫ్లో ఉత్కంఠ రేకెత్తించే ట్విస్టులను మరికాస్త బలంగా రాసుకుని ఉంటే థ్రిల్లర్ మోతాదు మరింత పెరిగేది.
{{/usCountry}}హీరో ఖాన్ దుర్రానీ తన పాత్రలో ఒదిగిపోయారు. ప్రేమ సన్నివేశాలతో పాటు భావోద్వేగాలు, గందరగోళం ఉండే దృశ్యాల్లో చక్కని నటన కనబరిచారు. హీరోయిన్ సాహితి అవంచ సరికొత్త హావభావాలతో మెప్పించారు. ప్రేమ, కుటుంబ బాధ్యతల మధ్య నలిగిపోయే పాత్రలో ఆమె నటన ఆకట్టుకుంటుంది. కథను నడిపించే సునయన పాత్ర నేటి యువత వైఖరికి ప్రతిబింబంగా నిలుస్తుంది.
సాంకేతిక బలం.. నిర్మాణ విలువలు!
సినిమాకు సాంకేతిక విభాగం మంచి సహకారం అందించింది. ఎడిటర్ ఉద్ధవ్ గతం, వర్తమానం మధ్య సాగే సన్నివేశాలను గందరగోళం లేకుండా ఎడిట్ చేసి స్క్రీన్ ప్లే ఫోని చాలా బాగా కాపాడారు. శ్రీమురళి కార్తికేయ అందించిన పాటలు, నేపథ్య సంగీతం రొమాంటిక్, థ్రిల్లర్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో తోడ్పడ్డాయి.
కెమెరా పనితనం ప్రతి దృశ్యాన్ని ఆకట్టుకునేలా ఆవిష్కరించింది. సత్యానంద్ లంక, కాకినాడ నాని, సోనీ రెడ్డి, ధనలక్ష్మి బల్ల తమ పరిధి మేరకు మంచి నటన కనబరిచారు.
ఫైనల్‌గా చెప్పాలంటే?
మొత్తానికి 'కళ్యాణం కమనీయం జీవితం' సినిమా కేవలం ఒక రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు. నమ్మకం, భావోద్వేగాలు, సస్పెన్స్ మిళితమైన మంచి ప్రయత్నం. జెన్‌జీ ప్రేమకథలను, ఫ్యామిలీ ఎమోషన్స్, థ్రిల్లర్ కథాంశాలను కోరుకునే ప్రేక్షకులు ఈ సినిమాను ఎంచక్కా చూసేయొచ్చు.