...
...
Next Story

Kamal Haasan OTT: కమల్ హాసన్ మాస్టర్ మైండ్.. షూటింగ్ కాకముందే ఒకే ఓటీటీకి 3 సినిమాలు.. కళ్లు చెదిరే రికార్డ్ డీల్!

Kamal Haasan OTT: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నిర్మాతగా సరికొత్త సంచలనం సృష్టిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్, శివకార్తికేయన్ లాంటి స్టార్లతో ఆయన నిర్మిస్తున్న క్రేజీ ప్రాజెక్టుల డిజిటల్ రైట్స్ విషయంలో మాస్టర్ ప్లాన్ వేశారు. ఒకే ఓటీటీతో మూడు సినిమాల డీల్ సెట్ చేశారని టాక్.

Published on: Oct 26, 2026, 06:01:17 IST
Advertisement

Kamal Haasan OTT: నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో మెప్పించిన యూనివర్సల్ హీరో కమల్ హాసన్.. ఇప్పుడు నిర్మాతగానూ తన మార్క్ చూపిస్తున్నారు. తన హోమ్ బ్యానర్ అయిన 'రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' పై వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తూ కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారుతున్నారు. ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న కమల్, తాజాగా ఓ భారీ ఓటీటీ డీల్ తో ట్రేడ్ వర్గాల దృష్టిని ఆకర్షించారు.

కమల్ హాసన్ ఓటీటీ డీల్

కమల్ హాసన్ మాస్టర్ మైండ్.. షూటింగ్ కాకముందే ఒకే ఓటీటీకి 3 సినిమాలు.. కళ్లు చెదిరే రికార్డ్ డీల్! (x/RKFI)
కమల్ హాసన్ మాస్టర్ మైండ్.. షూటింగ్ కాకముందే ఒకే ఓటీటీకి 3 సినిమాలు.. కళ్లు చెదిరే రికార్డ్ డీల్! (x/RKFI)

సాధారణంగా సినిమా పూర్తయ్యాక లేదా విడుదలకు ముందు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం చూస్తుంటాం. కానీ, కమల్ హాసన్ మాత్రం ఇంకా పూర్తి కాని మూడు పెద్ద సినిమాలను ఏకంగా ఒకే ఓటీటీ సంస్థకు కట్టబెట్టడం విశేషం. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ 'జియోహాట్‌స్టార్‌' తో కమల్ హాసన్ నిర్మాణ సంస్థ భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

ఈ మూడు సినిమాల డిజిటల్ రైట్స్ కోసం జియోహాట్‌స్టార్‌ రికార్డ్ స్థాయి మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తమిళ సినిమా చరిత్రలోనే ఇదొక బిగ్గెస్ట్ ఓటీటీ డీల్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ మూడు క్రేజీ సినిమాలు ఇవే..

కమల్ హాసన్ జియోహాట్‌స్టార్‌ కు విక్రయించిన ఆ మూడు సినిమాల లైనప్ చూస్తే అంచనాలు పెరిగిపోవడం ఖాయం. ఇందులో మొదటిది సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ధర్మన్'. రెండవది.. టాలెంటెడ్ యువ హీరో శివ కార్తికేయన్ తో రూపొందుతున్న యాక్షన్ డ్రామా 'సీయన్'. ఇక మూడవది స్వయంగా కమల్ హాసన్ హీరోగా నటించనున్న మరో భారీ ప్రాజెక్ట్.

ఒకప్పుడు కేవలం నటనకే పరిమితమైన కమల్.. ఇప్పుడు కమర్షియల్ గానూ దూసుకెళ్తున్నారు. రజినీకాంత్, శివకార్తికేయన్ లాంటి క్రేజ్ ఉన్న హీరోల చిత్రాలను ప్యాకేజీగా మార్చి డీల్ సెట్ చేయడంలో కమల్ వ్యూహం అద్భుతంగా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. అటు జియోహాట్‌స్టార్‌ కు కూడా ఈ మూడు సినిమాలు సౌత్ మార్కెట్ లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి గట్టిగా ఉపయోగపడతాయి.

మొత్తానికి కమల్ హాసన్ మాత్రం యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఎక్కడా తగ్గకుండా పక్కా ప్లానింగ్ తో ఓ రేంజ్ లో దూసుకెళ్తున్నారని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks