Kamal Haasan Letter To CEC Over Vote Chori Protest: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీరుపై ప్రతిపక్ష 'ఇండియా' కూటమి యుద్ధం ప్రకటించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, 'ఓటు చోరీ'కి పాల్పడుతున్నారంటూ ప్రతిపక్ష ఎంపీలు దిల్లీలోని అశోకా రోడ్డులో భారీ ధర్నా నిర్వహించారు.
ఓటర్ల హక్కు కాలరాస్తున్నారంటూ

ఓటర్ల హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఉద్రిక్తతల నడుమ మక్కల్ నీది మయ్యమ్ అధినేత, ఎంపీ, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు ఆసక్తికర లేఖ రాశారు.
ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతోందని
రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోతోందని, పార్లమెంట్‌లోని సంవిధాన్ భవన్‌లో ప్రతిపక్ష ఎంపీలతో సీఈసీ సమావేశమై వారి సందేహాలను నివృత్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
వేలాది మంది ఓటర్ల పేరు గల్లంతయ్యే ప్రమాదం
"ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనది. ఆ హక్కును పరిరక్షించాల్సిన ఎన్నికల సంఘంపై ఈ మధ్య కాలంలో ప్రజల్లో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి" అని కమల్ హాసన్ తమ లేఖలో స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో హడావుడిగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అర్హులైన వేలాది మంది ఓటర్ల పేరు గల్లంతయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కథలు కాదు, చర్చలు ముఖ్యం: సీఈసీకి కమల్ విజ్ఞప్తి
ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమో తాను ఈ లేఖ రాయడం లేదని, దేశ ప్రయోజనాలను కాపాడటమే తన ఉద్దేశమని కమల్ హాసన్ తెలిపారు. "మూసివేసిన తలుపుల వెనుక వాదనలు చేసుకోవడం కంటే, తెరిచిన తలుపులతో చర్చలకు ఆహ్వానించడమే ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూరుస్తుంది" అని కమల్ హాసన్ హితవు పలికారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడేందుకు సీఈసీ వెంటనే స్పందించి, ప్రతిపక్ష నేతల భేటీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
సీఈసీ రాజీనామా చేసేవరకు పోరాటం: రాహుల్ గాంధీ హెచ్చరిక
{{/usCountry}}ఏ ఒక్క రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసమో తాను ఈ లేఖ రాయడం లేదని, దేశ ప్రయోజనాలను కాపాడటమే తన ఉద్దేశమని కమల్ హాసన్ తెలిపారు. "మూసివేసిన తలుపుల వెనుక వాదనలు చేసుకోవడం కంటే, తెరిచిన తలుపులతో చర్చలకు ఆహ్వానించడమే ప్రజాస్వామ్య వ్యవస్థకు బలం చేకూరుస్తుంది" అని కమల్ హాసన్ హితవు పలికారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడేందుకు సీఈసీ వెంటనే స్పందించి, ప్రతిపక్ష నేతల భేటీకి అవకాశం ఇవ్వాలని కోరారు.
సీఈసీ రాజీనామా చేసేవరకు పోరాటం: రాహుల్ గాంధీ హెచ్చరిక
{{/usCountry}}మరోవైపు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిపక్షాలు రోడ్లపైకి వచ్చి పోరాడేందుకు, అరెస్టులయ్యేందుకు సైతం వెనుకాడబోవని ప్రకటించారు.
మా ఆందోళను ఆపేది లేదు
"జ్ఞానేష్ కుమార్ సీఈసీ పదవికి రాజీనామా చేసేవరకు మా ఆందోళనలు ఆపేది లేదు. దేశంలో అత్యంత పవిత్రమైన ఓటు హక్కును కాపాడుకునేందుకు ఇది మేము చేస్తున్న ధర్మపోరాటం. నరేంద్ర మోదీ, అమిత్ షా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు" అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
మరింత పారదర్శకంగా
ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా మార్చడానికే సవరణలు చేస్తున్నామని ఎన్నికల సంఘం చెబుతున్నప్పటికీ, ఈ ప్రక్రియ ఆధారంగా ప్రతిపక్షాల మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారన్నది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ. రానున్న ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం చుట్టూ ముసురుకున్న ఈ వివాదం జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.