Serial: ఇదేం సీరియల్‌రా నాయనా? ఫస్ట్ నైట్ పాలల్లో బొద్దింకను ముంచి తినే హీరో- భార్యపై ప్రేమతోనే!
Kamala Nivas Serial First Night Cockroach Scene: బుల్లితెర సీరియల్స్‌లో టీఆర్‌పీ రేటింగుల కోసం దర్శకులు లాజిక్‌ను పక్కనపెట్టడమే కాకుండా జుగుప్సాకరమైన సీన్లను పెడుతున్నారు. తాజాగా ఒక సీరియల్‌లో హీరో శోభనం రాత్రి పాలల్లో బొద్దింకను ముంచి నమిమిలి తినే సీన్ చూసి వీక్షకులు తలలు పట్టుకుంటున్నారు.
Kamala Nivas Serial First Night Cockroach Scene: కొన్నిసార్లు బుల్లితెరపై వచ్చే రోజువారీ సీరియల్స్ కొన్నిసార్లు ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తే.. మరికొన్నిసార్లు అస్సలు నమ్మశక్యం కాని వింత సీన్లతో షాక్‌కు గురిచేస్తుంటాయి. రేటింగుల వేటలో పడి కథకులు, దర్శకులు లాజిక్‌కు పూర్తిగా పాతర వేస్తున్నారు.

హార్పిక్‌తో స్వీట్లు
గతంలో ల్యాప్‌టాప్‌ను డిటర్జెంట్ సబ్బుతో కడగడం, హార్పిక్‌తో స్వీట్లు చేయడం, చీర కొంగు మెడకు చుట్టుకుని ఊపిరాడక చనిపోవడం వంటి విచిత్రమైన సీన్లు హిందీ సీరియల్స్‌లో చూశాం. ఇప్పుడు వాటన్నింటినీ మించిపోయేలా ఓ బెంగాలీ సీరియల్‌లో ఏకంగా హీరో బొద్దింకను నమిలి తినేసిన సీన్ సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతోంది.
శోభనం రాత్రి అసలేం జరిగిందంటే?
జీ బంగ్లా ఛానల్‌లో ప్రసారమవుతున్న ‘కమల నివాస్’ (Kamala Nivas) సీరియల్‌లోని ఈ వింత సీన్‌తో నెటిజన్ల తీవ్ర ఆగ్రహానికి గురైంది. ధ్రువ జ్యోతి సర్కార్, సంఘతి బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్‌లో ఇటీవల ఒక విచిత్రమైన ఎపిసోడ్‌ను ప్రసారం చేశారు.
కథ ప్రకారం హీరో, హీరోయిన్లు పెళ్లయిన తర్వాత మొదటి రాత్రి గదిలోకి అడుగుపెడతారు. ఇద్దరూ ముచ్చటించుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఒక బొద్దింక వచ్చి భార్యను కుడుతుంది. దాంతో ఆమె భయంతో గట్టిగా అరుస్తుంది. తన భార్యను కుట్టి, తమ శోభనం ముచ్చట్లకు అడ్డుపడిందనే కోపంతో హీరోకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది.
వెంటనే ఆ బొద్దింకను చేత్తో పట్టుకుంటాడు. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న పాల గ్లాసులో ఆ బొద్దింకను ముంచి, భార్య చూస్తుండగానే నోట్లో వేసుకుని నమిలేస్తాడు. ఈ సీన్ చూసి ఆ భార్యతో పాటు టీవీల ముందున్న ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు.
నెట్టింట ట్రోల్స్.. మీమ్స్‌తో ఆడుకుంటున్న నెటిజన్లు
ఈ వింత సీన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను సదరు ఛానల్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ పిచ్చి సీన్‌ను చూసిన నెటిజన్లు దర్శకుడిపై, స్క్రీన్‌ప్లే రైటర్లపై ఘాటుగా విమర్శలు గుప్పిస్తున్నారు.
"సీరియల్స్‌లో భార్యపై ప్రేమను చూపించడానికి ఇప్పుడు బొద్దింకలను కూడా తినాలా? ఈ దారుణాన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు" అని ఒక వీక్షకుడు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ సీరియల్‌లో కూడా
మరికొందరు నెటిజన్లు దీనిని గతంలో హిందీలో వచ్చిన సూపర్ హిట్ సీరియల్ 'సౌభాగ్యవతి భవ' లోని విరాజ్ దోబ్రియాల్ (కరణ్‌వీర్ బోహ్రా) సైకో పాత్రతో పోలుస్తున్నారు. ఆ సీరియల్‌లో కూడా భార్యను భయపెట్టడానికి విరాజ్ పాత్ర ఇలాగే బొద్దింకను తింటుంది.
"ఆ సీన్‌ను విరాజ్ దోబ్రియాల్ ఇంతకంటే బాగా చేశాడు" అంటూ కొందరు వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఆ వీడియోలో ఉన్నది బొద్దింక కాదని, ఓరియో బిస్కెట్ అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు.
టీఆర్‌పీ పిచ్చితో బుల్లితెరకు పట్టిన గ్రహణం
సాధారణంగా తెలుగు, హిందీ, తమిళ సీరియల్స్‌లో సైతం రేటింగుల కోసం వింత వింత ప్రయోగాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ, ఈ స్థాయి అసహ్యకరమైన దృశ్యాలను కుటుంబ సమేతంగా చూసే టీవీ సీరియల్స్‌లో పెట్టడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రేమ, సెంటిమెంట్ పేరుతో ఇలాంటి విపరీత ధోరణులను స్క్రీన్ మీద చూపించడం సరికాదని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
వివాదాల సంగతి పక్కనబెడితే, ఈ ఒక్క సీన్‌తో ఈ బెంగాలీ సీరియల్ పేరు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


