...
...
Next Story

Kangana Ranaut: నీ వయసులోనే నాకు రెండు నేషనల్ అవార్డులు.. గూగుల్‌లో సెర్చ్ చేశా.. నువ్వో యూజ్‌లెస్‌: కంగనా రనౌత్

Kangana Ranaut: బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఎంపీ బాధ్యతలు, జెన్ జెడ్ (Gen Z) నిరసనలపై వ్యాఖ్యలను తప్పుబట్టిన సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్‌ పై కంగనా విరుచుకుపడింది. అతనో యూజ్ లెస్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఇంతకీ ఏమైందంటే?

Published on: Jul 29, 2026, 11:12:22 IST
Advertisement

Kangana Ranaut: బాలీవుడ్ క్వీన్, మండి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ కంగాన రనౌత్ (Kangana Ranaut) ఎప్పుడూ తన బోల్డ్ వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా జెన్ జెడ్ (Gen Z) నిరసనలపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమెను విమర్శించిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ప్రతినిధి సౌరవ్ దాస్‌పై కంగనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

28 ఏళ్లకే నాకు 2 జాతీయ అవార్డులు

నీ వయసులోనే నాకు రెండు నేషనల్ అవార్డులు.. గూగుల్‌లో సెర్చ్ చేశా.. నువ్వో యూజ్‌లెస్‌: కంగనా రనౌత్
నీ వయసులోనే నాకు రెండు నేషనల్ అవార్డులు.. గూగుల్‌లో సెర్చ్ చేశా.. నువ్వో యూజ్‌లెస్‌: కంగనా రనౌత్

తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో సౌరవ్ దాస్ వీడియోను రీపోస్ట్ చేస్తూ కంగనా రనౌత్ సంచలన కామెంట్లు చేశారు. "నేను ఈ వ్యక్తి గురించి గూగుల్ చేసి చూశా. అతనికి 28 ఏళ్లు. ఇప్పటికీ స్టూడెంట్ ను అని ఎలా చెప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు!

నేను రాజకీయాల్లోకి వచ్చి రెండేళ్లే కావచ్చు, కానీ గత 20 ఏళ్లుగా ప్రజల మధ్యే జీవిస్తున్నాను. అతడి వయస్సు (28 ఏళ్లు) నాకున్నప్పుడు, నా చేతిలో అప్పటికే 2 నేషనల్ అవార్డులున్నాయి’’ అని కంగనా రాసుకొచ్చింది.

నువ్వో యూజ్‌లెస్‌

తాను కొత్తగా ఎంపీ అయినందున, ఆ పనిభారం చూసి ప్రారంభంలో కాస్త ఒత్తిడికి గురైన మాట నిజమేనని కంగనా అంగీకరించారు. "కొత్తగా ఎంపీ అయినప్పుడు ఒత్తిడికి గురయ్యా. ఎందుకంటే నేను కేవలం ఎంపీ మాత్రమే కాదు.. ఫిలింమేకర్, పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, బిజినెస్ ఉమెన్.

ఇన్ని రంగాల్లో నిరంతరం డిమాండ్ ఉన్న వ్యక్తి భావనలు.. ఏ పనిపాటా లేని యూజ్‌లెస్‌, నిరుద్యోగి అయిన నీలాంటి వ్యక్తికి ఎలా అర్థమవుతాయి? డియర్ సౌరవ్.. ముందు ఏదైనా ఒక నైపుణ్యం (Skill) నేర్చుకో" అంటూ తీవ్రస్థాయిలో కంగనా ఆగ్రహం వ్యక్తం చేసింది.

కంగనా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ

వివాదానికి కారణమేంటి?

‘‘ఆ రీల్స్ చూస్తుంటే వాంతి వచ్చేలా ఉంది. వాళ్లు ఉపయోగించే భాష అసహ్యకరంగా ఉంది. వారి ప్రవర్తన 'కాక్రోచ్' (బొద్దింకల) తరహాలో ఉంది’’ అని కంగనా ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

సౌరవ్ దాస్ ఏమన్నాడంటే?

కంగనా వ్యాఖ్యలపై వార్తా సంస్థ ఏఎన్‌ఐ (ANI) తో మాట్లాడిన సౌరవ్ దాస్.. "కనీసం సొంత పార్టీ నాయకులే కంగనా మాటలను సీరియస్‌గా తీసుకోరు. ఆమె వ్యాఖ్యలను నేటి తరం జెన్ జెడ్ ఎందుకు పట్టించుకుంటుంది? ఎంపీ పనంటే తక్కువ అనుకున్నానని, ఇంత పని ఉంటుందని ఊహించలేదని ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలే ఆమె సీరియస్‌నెస్‌ను తెలియజేస్తున్నాయి" అని విమర్శించారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks