...
...
Next Story

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఆర్కే స్టూడియో, మళ్లీ పునరుద్ధరణ? రణ్‌బీర్ ఫ్యామిలీ గ్రూపులో చర్చ- కరీనా కపూర్ క్లారిటీ

Kareena Kapoor Clarity On RK Studios Revival: దిగ్గజ ఆర్కే స్టూడియోస్‌ను రణ్‌బీర్ కపూర్ మళ్లీ ప్రారంభిస్తున్నారనే వార్తలపై కరీనా కపూర్ స్పందించారు. రణ్‌బీర్, కరీష్మా ఫ్యామిలీ గ్రూపుల్లోనూ దీనిపై చర్చలు జరిగినట్లు కరీనా కపూర్ పేర్కొన్నారు. దీంతో కరీనా కపూర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Mar 23, 2026, 14:57:12 IST
Advertisement

భారతీయ చలనచిత్ర చరిత్రలో చెంబూర్‌లోని 'ఆర్.కె. స్టూడియోస్'కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. దిగ్గజ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ 1948లో స్థాపించిన ఈ చారిత్రక కట్టడం మళ్లీ ప్రాణం పోసుకోబోతోందని, రణ్‌బీర్ కపూర్ దీని కోసం ముంబైలో ఒక పెద్ద స్థలాన్ని లీజుకు తీసుకున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ తాజాగా చెప్పేసింది.

ఫ్యామిలీ గ్రూపుల్లోనూ చర్చ జరిగింది!

అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఆర్కే స్టూడియో, మళ్లీ పునరుద్ధరణ? రణ్‌బీర్ ఫ్యామిలీ గ్రూపులో చర్చ- కరీనా కపూర్ క్లారిటీ
అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఆర్కే స్టూడియో, మళ్లీ పునరుద్ధరణ? రణ్‌బీర్ ఫ్యామిలీ గ్రూపులో చర్చ- కరీనా కపూర్ క్లారిటీ

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కరీనా కపూర్ ఈ విషయంపై స్పందిస్తూ.. "ఆర్.కె. స్టూడియోస్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నారనే వార్తల్లో అస్సలు నిజం లేదు. మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో కూడా దీనిపై చర్చ జరిగింది. 'ఇది జరగడం లేదు' అని అందరూ స్పష్టం చేశారు. బహుశా అభిమానులు అది మళ్లీ రావాలని బలంగా కోరుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు వస్తున్నాయని నేను భావిస్తున్నాను" అని తెలిపారు.

రణ్‌బీర్ ఫోకస్ అంతా నటనపైనే..

ఆర్కే స్టూడియో పునరుద్ధరణ బాధ్యతలపై మాట్లాడుతూ.. "రణ్‌బీర్ ప్రస్తుతం ఇండియాలోనే బెస్ట్ యాక్టర్. అతని దృష్టి అంతా నటనపైనే ఉంది. దర్శకత్వం లేదా ప్రొడక్షన్ గురించి నేను ఆలోచించలేను. భవిష్యత్తులో ఒకవేళ రణ్‌బీర్, కరిష్మా (లోలో) దీని గురించి ఏమైనా ఆలోచిస్తారేమో చూడాలి. ప్రస్తుతం మాత్రం అలాంటి ప్లాన్స్ ఏవీ లేవు" అని కరీనా కపూర్ వివరించారు.

అభిమానుల కోరిక

2017లో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత, కపూర్ కుటుంబం ఈ స్టూడియో ఆస్తిని 2019లో గోద్రెజ్ ప్రాపర్టీస్‌కు రూ. 180 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే. అనుకోకుండా అగ్ని ప్రమాదంలో స్టూడియో కాలిపోవడంతో దాన్ని మళ్లీ పునరుద్ధరిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నట్లు సమాచారం.

మేఘనా గుల్జార్‌తో కొత్త సినిమా..

భారతీయ సినిమా గమనాన్ని మార్చిన 'ఆవారా', 'శ్రీ 420', 'బాబీ' వంటి అద్భుత చిత్రాలు ఇక్కడే ఈ స్టూడియోలోనే రూపుదిద్దుకున్నాయి. సామాజిక అంశాలను సంగీతంతో మేళవించి చెప్పే రాజ్ కపూర్ శైలికి ఈ స్టూడియో చిరునామాగా నిలిచింది. 1999లో వచ్చిన 'ఆ అబ్ లౌట్ చలే' చిత్రం ఆర్.కె. ఫిలింస్ బ్యానర్‌లో వచ్చిన చివరి సినిమా.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks