...
...
Next Story

Karthika Deepam 2: కార్తీక దీపం 2లో ఊహించని మైండ్ గేమ్- జ్యోత్స్నను డమ్మీ చేసిన ఆ ముగ్గురు- కథను తిప్పే అసలు విలన్ ఎవరు?

Karthika Deepam 2: బుల్లితెరపై దూసుకుపోతున్న స్టార్ మా టాప్ సీరియల్ ‘కార్తీక దీపం 2’ సరికొత్త క్యారెక్టర్ల ఎంట్రీతో మరింత ఇంటెన్స్‌గా మారింది. కథలో ఇప్పటివరకు మెయిన్ విలన్‌గా హడావిడి చేసిన జ్యోత్స్న పాత్ర ఉన్నట్టుండి డమ్మీ అయిపోయింది. మరి రియల్ విలన్ ఎవరు? అనేదే ఇప్పుడు సస్పెన్స్.

Published on: Jul 12, 2026, 14:55:28 IST
Advertisement

Karthika Deepam 2: తెలుగు బుల్లితెర హిస్టరీలోనే ‘కార్తీక దీపం’ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీక్వెల్‌గా వచ్చిన ‘కార్తీక దీపం 2’ కూడా దీప, కార్తీక్ లాయల్ ఫ్యాన్స్ కారణంగా రేటింగుల్లో దూసుకుపోతోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ లో వస్తున్న ట్విస్ట్ లు, మలుపులు ఊహకు అందకుండా సాగుతున్నాయి.

కార్తీక దీపం 2 ట్విస్ట్ లు

కార్తీక దీపం 2లో ఊహించని మైండ్ గేమ్- జ్యోత్స్నను డమ్మీ చేసిన ఆ ముగ్గురు- కథను తిప్పే అసలు విలన్ ఎవరు? (jiohotstar)
కార్తీక దీపం 2లో ఊహించని మైండ్ గేమ్- జ్యోత్స్నను డమ్మీ చేసిన ఆ ముగ్గురు- కథను తిప్పే అసలు విలన్ ఎవరు? (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ మెయిన్ గా కార్తీక్, దీపను విడగొట్టే విలన్ జ్యోత్స్న కథ చుట్టూ తిరుగుతోంది. కానీ సడెన్ గా కొత్త క్యారెక్టర్లు సీరియల్ ను మరో లెవల్ కు తీసుకెళ్తున్నాయి. దక్షిణామూర్తి, సూరజ్, మాలిని పాత్రల ఎంట్రీతో అసలు విలన్ ఎవరు? అనేది సస్పెన్స్ గా మారింది.

జ్యోత్స్న డమ్మీ

కార్తీక దీపం 2 సీరియల్ కథ ప్రారంభం నుంచి దీప, కార్తీక్‌లను విడదీయడమే ధ్యేయంగా పెట్టుకుని, అహంకారంతో రెచ్చిపోయిన జ్యోత్స్న క్యారెక్టర్ గ్రాఫ్ ఇప్పుడు ఉన్నట్టుండి పడిపోయింది. దీప స్థానంలో వారసురాలిగా శివ నారాయణ ఇంటికి వచ్చిన జ్యోత్స్న.. మొన్నటివరకూ దీప, కార్తీక్ ను ఓ రేంజ్ లో ఆడుకుంది. చివరకు దీప తాళి కూడా తెంచింది. కానీ ఇప్పుడు ఆమె క్యారెక్టర్ డమ్మీగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

వీళ్ల ఎంట్రీతో

కార్తీక దీపం 2 సీరియల్ కథలోకి ఎప్పుడైతే సూరజ్, దక్షిణామూర్తి, మాలిని ఎంట్రీ జరిగిందో, అప్పటినుంచి జ్యోత్స్న కేవలం ఒక మూగ ప్రేక్ష‌కురాలిలా, ఒక ‘డమ్మీ’ విలన్‌లా మారిపోయింది.

కార్తీక దీపం 2 సీరియల్ చూసే చాలా మంది వీక్షకులు జ్యోత్స్న మాత్రమే విలన్ అనుకున్నారు. కానీ తాజా పరిణామాలు చూస్తే జ్యోత్స్న కేవలం ఒక సమిధ మాత్రమే అని, అసలు మాస్టర్ మైండ్స్ వేరే ఉన్నారని స్పష్టమవుతోంది. దక్షిణామూర్తి క్లాస్ లుక్‌లో కనిపిస్తున్నా.. అతని వెనుక ఉన్న గతం, దాచిన అజెండా కథను శాసిస్తున్నాయి.

అటు మాలిని మైండ్ గేమ్స్ స్టార్ట్ చేసింది. ఇక ఇటు సూరజ్ తెస్తున్న ఒత్తిడి జ్యోను అతలాకూతలం చేస్తోంది. దీంతో అసలు విలన్ ఎవరు? అనే సస్పెన్స్ క్రమంగా పెరుగుతోంది.

అదే కారణం

కార్తీక దీపం 2 సీరియల్ ఇంతలా క్లిక్ అవ్వడానికి కారణం కథలో కేవలం ఏడుపులు, పెడబొబ్బలు మాత్రమే లేకపోవడమే. కొత్త పాత్రల ప్రవేశంతో ప్రతి క్యారెక్టర్ వెనుక ఒక స్ట్రాంగ్ మోటివ్ కనిపిస్తోంది. దీపను కాపాడే క్రమంలో కార్తీక్ తీసుకునే నిర్ణయాలు, ఈ ముగ్గురు కొత్త విలన్ల వ్యూహాలను ఎలా తిప్పికొడతాయనేది రాబోయే ఎపిసోడ్స్ లో కీలకం కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks