Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో మ్యారేజ్ గిఫ్ట్ అని చెప్పి కార్తీక్ చేతిలో తాళి పెడుతుంది జ్యోత్స్న. తాళి తన మెడలో కట్టి తననే బహుమతిగా తీసుకో అని అంటుంది జ్యోత్స్న. ఇందులో విశేషం ఏంటంటే నీ మొదటి పెళ్లి రోజు నాడే నీకు రెండో పెళ్లి అని జ్యో అంటుంది. కార్తీక్ తెగ షాక్ అయిపోతాడు.
నా మెడలో నువ్వే తాళి కట్టు

ఇదంతా నేను నైట్ ప్లాన్ చేసుకున్నా. అందుకే నీకోసం చీర కట్టుకుని వచ్చాను. సంగీతం, వాయిద్యాలు, ముహుర్తాలు లేవని ఆగిపోవద్దు బావ. నువ్వే నా మెడలో తాళి కట్టు. అన్ని సమస్యలకు ఇంతకంటే మంచి పరిష్కారం ఎవరు చెప్పరు. ఇది మన పెళ్లి కానుక అని దీపకు పరిచయం చేయి. చాలా సర్‌ప్రైజ్ అవుతుందని జ్యోత్స్న అంటుంది. ఇక ఆపుతావా అని కార్తీక్ అంటే.. ఇది డ్రామా అనుకుంటున్నావా అని జ్యో అంటుంది.
డ్రామా కాకపోతే బాగోతం. బాగోతం కాకపోతే వీధి నాటకం. ఇలాంటివి మాట్లాడేముందు ఒళ్లు దగ్గపెట్టుకో అని కార్తీక్ వార్నింగ్ ఇస్తాడు. నీ తాళి నీ దగ్గర పెట్టుకో నేను షేర్ ఆటోలో వెళ్లిపోతాను అని కార్తీక్ వెళ్లబోతుంటే హలో మిస్టర్.. నువ్వు నన్ను కమెడియన్‌గా చూడొచ్చేమో కానీ నేను మాత్రం విలన్‌ని బావ. అనుకున్నది సాధించాలి, లేకపోతే చావాలి అని కారులో నుంచి గన్ తీసుకొస్తుంది జ్యోత్స్న. గన్ చూసి కార్తీక్ షాక్ అవుతాడు.
నన్ను సేఫ్‌గా తీసుకెళ్తావో, శవంగా తీసుకెళ్తావో నీ ఇష్టం. నాకు ఏదైనా అయితే నీ అత్త బ్రతకదు. ఇది బొమ్మ తుపాకీ కాదు అని పైకి గన్ కాల్చి బెదిరిస్తుంది జ్యోత్స్న. తలకు గన్ గురి పెట్టుకుని తాళి కడతావా ట్రిగర్ నొక్కమంటావా అని జ్యో అంటుంది. నీకు చచ్చేంత ధైర్యం లేదు అని కార్తీక్ అంటే.. నీకోసం చచ్చిపోయినా నేను గెలిచినట్లే. నా చావుతో నువ్వు కోరుకున్న శాంతి పొందలేవు. మా అమ్మ బతకదు. దీప నీ కూతురు అని ఎవరికి పరిచయం చేస్తావ్, జీవచ్ఛంలా బతికే నా తల్లికా, ఎవరికి పరిచయం చేస్తావ్ అని బెదిరిస్తుంది జ్యోత్స్న.
కార్తీక్‌కు బ్లాక్ మెయిల్
నేను మూడు అంకెలు లెక్కపెడతాను.. తాళి కట్టు లేదా చావనివ్వు. బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తాను అని కార్తీక్‌ను బ్లాక్ మెయిల్ చేస్తుంది జ్యోత్స్న. తాళి కట్టను అని కార్తీక్ అంటాడు. అయితే, చస్తాను అని ట్రిగర్ నొక్కి గన్ పేల్చుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ షాక్ అయి చూస్తాడు. కట్ చేస్తే మరోవైపు కాశీ కారు క్లీన్ చేస్తుంటాడు. బయటకు వచ్చిన స్వప్న కాశీని చూసి లోపలికి వెళ్లాలనుకుని మళ్లీ బయటే కూర్చుంటుంది.
{{/usCountry}}నేను మూడు అంకెలు లెక్కపెడతాను.. తాళి కట్టు లేదా చావనివ్వు. బతికి సాధించలేనిది చచ్చి సాధిస్తాను అని కార్తీక్‌ను బ్లాక్ మెయిల్ చేస్తుంది జ్యోత్స్న. తాళి కట్టను అని కార్తీక్ అంటాడు. అయితే, చస్తాను అని ట్రిగర్ నొక్కి గన్ పేల్చుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ షాక్ అయి చూస్తాడు. కట్ చేస్తే మరోవైపు కాశీ కారు క్లీన్ చేస్తుంటాడు. బయటకు వచ్చిన స్వప్న కాశీని చూసి లోపలికి వెళ్లాలనుకుని మళ్లీ బయటే కూర్చుంటుంది.
{{/usCountry}}ఇంతలో అత్త కావేరి వచ్చి కాశీకి కాఫీ ఇస్తుంది. స్వప్న పక్కన వచ్చి కాఫీ తాగుతూ భార్యతో సరదాగా ముచ్చట్లు పెడతాడు. స్వప్న తను చదివే పుస్తకం గురించి చెబుతుంది. ఏ నవల అయిన చదువు గొడవ పడని జంట ఉండదు అని ఒకరి తప్పులను మరొకరు క్షమించుకోవడమే జీవితం అని చెబుతాడు కాశీ. బంధాల గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. నీ నుండి స్వేచ్ఛను కోరుకుంటున్నా. అది ఇవ్వలేనంటున్నావ్. ఇక ప్రేమ ఏం ఇస్తావ్. నీది ప్రేమ కాదు స్వార్థం అని స్వప్న అంటుంది.
మరోవైపు జ్యోత్స్న, పారిజాతం మాటలు గుర్తు చేసుకున్న దశరథ్ ఆలోచనలో పడతాడు. కార్తీక్ దీపను వేరు చేయడానికి జ్యోత్స్న ఏం ప్లాన్ చేయట్లేదుగా అని దశరథ్ అనుకుంటాడు. ఇంతలో శివ నారాయణ వచ్చి జ్యో గురించి అడిగితే.. ఫోన్ కలవట్లేని చెబుతాడు దశరథ్. జరిగింది అంతా చెప్పి ఇదంతా జ్యోత్స్న కావాలని చేస్తున్నట్లు అనిపిస్తుందని శివ నారాయణ అనుమానిస్తాడు. అప్పుడే వచ్చిన సుమిత్ర అంత అవసరం జ్యోత్స్నకు ఏంటీ అని అడుగుతుంది.
కాశీపై స్వప్న ఫైర్
అక్కడ ఏం జరిగిందో తెలియనప్పుడు ఎందుకు అన్ని అనుకోవడం. నిజంగా జ్యోత్స్నే తప్పు చేసి ఉంటే నేను ఊరుకోను. కాసేపైన తర్వాత అయిన ఇంటికి రావాలిగా. అప్పుడే దాన్ని అడుగుదాం అని సుమిత్ర అంటుంది. ఇంట్లోకి స్వప్న అంటూ కాశీ వస్తే.. కాలింగ్ బెల్ కొట్టి రావాలని తెలియదా, ఏకవచనంతో పిలవడం ఏంటీ అని తిడుతుంది స్వప్న.
ఉదయం అన్నావుగా నాది స్వార్థం అని. కానీ, కాదు ప్రేమ. నేను ఎప్పుడు నీ సంతోషమే కోరుకుంటాను అని స్వప్నను రెండో పెళ్లి చేసుకునే వసంత్ వస్తాడు. కాశీ చెప్పినందుకే వచ్చానని, నీకోసం మట్టి గాజులు తెచ్చానని చూపిస్తాడు. బాగున్నాయని స్వప్న అంటుంది. గాజులు వేసుకోమంటే వేసుకోదు. కాశీ ఫిట్టింగ్ పెట్టడంతో వసంత్ అడుగుతాడు. గాజులు వేసుకుంటానని స్వప్న అంటుంది. అయితే, ఈ గాజులు నేనే వేస్తాను అని వసంత్ అంటాడు.
దాంతో స్వప్న, కాశీ ఇద్దరు షాక్ అవుతారు. గాజులు భర్తతోనే ఆడది వేయించుకుంటుందని స్వప్న అన్న మాటలు ఇద్దరు గుర్తు చేసుకుంటారు. స్వప్న చేయి తీసుకుని వసంత్ గాజులు వేయబోతుంటే స్వప్న చేయి వణుకుతుంది. ఇప్పుడు తన మీద ప్రేమ ఉందో లేదో తెలుస్తుందని కాశీ అనుకుంటాడు. వసంత్ గాజులు వేస్తుంటే.. చేయి తీసేసి ఈరోజు మంచి రోజు కాదు. ఇంకో రోజు వేసుకుంటా అని చెబుతుంది స్వప్న.
దీపతో జ్యో గొడవ
నీ ఇష్టమే నా ఇష్టం అని వసంత్ వెళ్లిపోతాడు. ఆ గాజులు కిందపడేసి స్వప్న కోపంగా వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ కోసం దీప, కాంచన ఎదురుచూస్తుంటారు. కార్తీక్‌ను కాంచన తిడుతుంది. ఫోన్ చేయమని అంటుంది. మరోవైపు గన్ పక్కన పడి ఉంటుంది. బుర్ర పనిచేయట్లేదా నీకు. ఒక్క నిమిషం లేట్ అయితే బుర్ర పుచ్చకాయలా పేలి పోయేదని జ్యోని కార్తీక్ తిడతాడు.
జ్యోత్స్న గన్‌తో కాల్చుకొనేటప్పుడు కార్తీక్ జ్యో చేయి పైకి అంటాడు. అది ఇద్దరు గుర్తు చేసుకుంటారు. అలా జ్యోత్స్నను కార్తీక్ కాపాడుతాడు. నీ కళ్లముందు ప్రాణం పోనివ్వు బావ అని జ్యోత్స్న అంటుంది. వెటకారంగా ఉందా నీకు అని జ్యోత్స్నపై చేయి ఎత్తుతాడు కార్తీక్. తర్వాత ఆగి నీకోసం బతికే వాళ్లలో సుమిత్ర, దశరథ్ మావ కాదు దాసు మావ కూడా ఉన్నాడని అంటాడు. తాళి కడతావా కట్టవా అని వార్నింగ్ ఇస్తుంది.
ఇంతలో దీప కాల్ చేస్తే కార్తీక్ ఫోన్ తీసుకుంటుంది జ్యోత్స్న. బావను పంపు అని దీప అంటే గొడవ పెట్టుకుంటుంది జ్యోత్స్న. బావ నావాడు. రాడు నేను పంపను అని కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న. దాంతో తాళి దూరంగా పడేసిన కార్తీక్ గన్ పట్టుకుంటాడు. జ్యోత్స్నను బలవంతంగా కారులో ఎక్కిస్తాడు. నేనే నిన్ను తీసుకొచ్చా, ఇంట్లో నేనే నిన్ను సేఫ్‌గా దింపుతాను అని కార్తీక్ అంటాడు. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.