Karthika Deepam 2 Serial Today Episode: కార్తీక దీపం 2 ఈరోజు ఎపిసోడ్‌లో కావేరికి కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చిన కాశీ బావ ఇంట్లో ఏదో ప్రోగ్రామ్ ఉందన్నారు, మీరు వెళ్లలేదా అని అడుగుతాడు. స్వప్న రానని అంది, అందుకే మేము వెళ్లలేదు అని కావేరి చెబుతుంది. ఎందుకు వెళ్లలేదని స్వప్నను అడుగుతాడు కాశీ. మనకు జరిగిందానిపై మీ పారిజాతం నానమ్మ వెటకారంగా మాట్లాడుతుందని స్వప్న అంటుంది.
నువ్వు తాళి కట్టించుకోలేవు

మన నిర్ణయాలు సరిగ్గా ఉన్నప్పుడు ఎవరు వెటకారంగా మాట్లాడరని కాశీ అంటాడు. గొడవ గురించి అంతా మాట్లాడుతారు. అదే నా మెడలో తాళి ఉంటే అందరికి అదే సమాధానం చెబుతుందని స్వప్న అంటుంది. అయితే, నువ్వు ఎప్పటికీ సమాధానం చెప్పలేవు. ఎందుకంటే ఈ పెళ్లి జరగదు. వసంత్ నీ మెడలో తాళి కట్టడు. నువ్వు కట్టించుకోలేవు. నీ పెళ్లి ఎవరో కాదు నువ్వే ఆపుతావ్ అని కాశీ ఛాలెంజ్ చేస్తాడు.
నాకు ఈ నమ్మకం ఇచ్చింది నువ్వే, అది ఎందుకో నువ్వే ఆలోచించుకో అని కాశీ అంటాడు. మరోవైపు వైరా పగతో రగిలిపోతుంటాడు. అలా వైరా రీ ఎంట్రీ ఇస్తాడు. నిన్ను జైలు నుంచి కష్టపడి తీసుకొచ్చింది, ఇలా ఏడవటానికి కాదు. ఒక్క ఆడది కొట్టిన దెబ్బకు ఇలా అయిపోయావ్, ఏం చేస్తున్నావ్ అని వైరాను తన అసిస్టెంట్ రెచ్చగొడతాడు. దాంతో జ్యోత్స్నను దెబ్బకొట్టే టైమ్ వచ్చింది. అది బతికి ఉన్న చచ్చినట్లు అయ్యేలా చేస్తాను, సాగర్‌కు చెప్పు బాస్ పనిలో ఉన్నాడని, ఎవరిని వదిలిపెట్టను అని వైరా వెళ్లిపోతాడు.
మరోవైపు దాసును జ్యోత్స్న కలుస్తుంది. ఇద్దరు వాదించుకుంటారు. పెళ్లి చేసుకోమ్మా, రేపు నువ్వు ఎవరో తెలిసిన కూడా ఏం కాదు, దీప, కార్తీక్ జోలికి వెళ్లకు అని దాసు చెబుతాడు. నా మెడలో తాళి కట్టేది బావే, అత్తకు వచ్చిన కల నిజం చేసే బాధ్యత నాది అని జ్యోత్స్న తెగేసి చెబుతుంది. భగవంతుడు నీకు మంచి జీవితం ఇచ్చాడు. దాన్ని నాశనం చేసుకునేదాకా ఉండేలా లేవు అని దాసు అంటాడు.
నీ కోరిక నెరవేరుస్తా
నువ్వు భుజాన ఈ సంచి వేసుకుని తిరగడం తప్పా నువ్వు చేసింది ఏం లేదు అని జ్యోత్స్న అంటుంది. నన్ను ఎందుకు పిలిచావో చెప్పు అని దాసు అంటాడు. ఏం చెప్పి గ్రానీని మీ పార్టీలోకి మార్పించారు. ఏం చెప్పి గ్రానీని మార్చేశారో చెప్పు అని జ్యోత్స్న అడుగుతుంది. నేను ఏం చెప్పలేదు. కార్తీక్, దీపల మంచితనమే మార్చిందని, పెళ్లి చేసుకోమ్మా అని దాసు అంటాడు. నీ కోరిక నెరవేరుస్తా నాన్న, బావతో తాళి కట్టించుకుంటా అని జ్యో అంటుంది.
{{/usCountry}}నువ్వు భుజాన ఈ సంచి వేసుకుని తిరగడం తప్పా నువ్వు చేసింది ఏం లేదు అని జ్యోత్స్న అంటుంది. నన్ను ఎందుకు పిలిచావో చెప్పు అని దాసు అంటాడు. ఏం చెప్పి గ్రానీని మీ పార్టీలోకి మార్పించారు. ఏం చెప్పి గ్రానీని మార్చేశారో చెప్పు అని జ్యోత్స్న అడుగుతుంది. నేను ఏం చెప్పలేదు. కార్తీక్, దీపల మంచితనమే మార్చిందని, పెళ్లి చేసుకోమ్మా అని దాసు అంటాడు. నీ కోరిక నెరవేరుస్తా నాన్న, బావతో తాళి కట్టించుకుంటా అని జ్యో అంటుంది.
{{/usCountry}}ప్రమాదంలో పడతావ్, జాగ్రత్త అని దాసు అంటే.. ఆ మాట దీపకు చెప్పు అని వెళ్లిపోతుంది జ్యోత్స్న. మరోవైపు వసంత్‌తో గాజులు ఎందుకు వేసుకోలేదని, మన మధ్య జరిగింది గుర్తుకు వచ్చే వేసుకోలేదని స్వప్నను అంటాడు కాశీ. నిన్న మంచిరోజు కాదని స్వప్న అంటుంది. నేను పంచాంగం చూశాను, నిన్న మంచి రోజు. వసంత్ నీ ముందు ఉన్నాడు. కానీ, నీ మనసులో లేడు అని చాలా నమ్మకంగా చెబుతాడు కాశీ.
నీ పెళ్లి అందరూ ఆపరు స్వప్న. నువ్వే ఆపుకుంటావ్. నీ ఆలోచన సరిగా లేనప్పుడు నువ్వు ఎదురుచూసే మంచిరోజు ఎప్పటికీ రాదు. నన్ను యాక్సెప్ట్ చేయడం గురించి కాదు నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నన్ను కాదని నీకు నచ్చని జీవితంలోకే కదా వెళ్తున్నావ్. నీకు నచ్చనప్పుడు ఇంకెందుకు స్వప్న. నీకోసం ఇంకొక్కసారి ఆలోచించు అని కాశీ అంటాడు. దాంతో స్వప్న ఆలోచనలో పడుతుంది.
జ్యోత్స్న కన్నకూతురు కాదని తెలిస్తే
మరోవైపు దశరథ్‌తో దీప గురించి మాట్లాడుతుంది. మనం ఎవరం లేనప్పుడే మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. జ్యోత్స్నపై దీపకు ఇంకా ఎందుకు అంత కోపం. దీప అలా మాట్లాడం నాకు నచ్చలేదు అని సుమిత్ర అంటుంది. జ్యోత్స్నపై అంత మమకారం పెంచుకోకు అని దశరథ్ అంటాడు. జ్యోత్స్న నా కన్నకూతురు అండి అని సుమిత్ర అంటే.. కాదని తెలిస్తే అని దశరథ్ అంటాడు. దాంతో సుమిత్ర షాక్ అవుతుంది.
తను నా కన్నకూతురు కాదని తెలియడం ఏంటండి. నేను బతికేదే జ్యోత్స్న కోసం. తన మీద గీత పడిన అది నా ప్రాణం మీదకు వచ్చినట్లే అని సుమిత్ర అంటుంది. దాంతో సుమిత్ర కోసం భయపడిన దశరథ్ జ్యోత్స్న పెళ్లి అయితే అత్తవారింటికి వెళ్లిపోతుంది కదా, అందుకే అలా అన్నాను అని కవర్ చేస్తాడు. పెళ్లి అయిన జ్యోత్స్న నా కళ్లముందే ఉండాలి. జ్యోత్స్నను దూరం చేయనివ్వను నాకు మాట ఇవ్వండి అని సుమిత్ర ఒట్టు వేయించుకుంటుంది.
జ్యోత్స్న నీ కూతురు కాదు. ఎప్పటికైనా దూరం అవ్వాల్సిందే అని మనసులో అనుకుంటూ ఒట్టు వేస్తాడు దశరథ్. జ్యోత్స్న లేకుంటే నువ్వు బతకలేవని అర్థమైంది. మౌనంగా ఉన్నారంటే మీరు ఒట్టు వేసినట్లే అని సుమిత్ర అంటుంది. నిన్ను కాపాడుకోవాలంటే జ్యోత్స్నను కూడా కాపాడుకోవాలి అని దశరథ్ అనుకుంటాడు. మరోవైపు చిలకడదుంపలు ఉన్నాయా అని దీపను కార్తీక్ అడుగుతాడు.
దీపకు పారిజాతం వరం
అది తర్వాత ముందు జ్యోత్స్న ఏం చేస్తుందో చూడు. అందరిముందు నా పరువు తీసింది అని దీప అంటుంది. ఇప్పుడు నా టార్గెట్ ఏంటీ జ్యోత్స్నతోనే అందరికి నిజం చెప్పించడం, నాతోపాటే నీతో ఛాలెంజ్ చేసిందని కార్తీక్ అంటాడు. అసలు ఎందుకు తనను భరించాలి అని దీప అడుగుతుంది. మీ అమ్మ కోసం. జ్యోత్స్న విషయంలో అత్త చాలా సెన్సిటివిగా ఉందని కార్తీక్ అంటాడు.
ఇప్పుడు నా గురించి మా అమ్మకు ఏం చెప్పిన నమ్మేస్తుందని దీప అంటుంది. దానికంటే ముందు పారు హెల్ప్ తీసుకుంటే అని కార్తీక్ అంటాడు. ఆవిడ ఏం హెల్ప్ చేస్తుందని దీప అంటుండగా పారిజాతం వచ్చేస్తుంది. ఈ పారిజాతం కామధేనువులాంటిది, నువ్వు ఏం కోరుకుంటే అది ఇస్తుందని దీపకు వరం ఇస్తుంది పారిజాతం. జ్యోత్స్న అలా చేయడానికి నువ్వే అలా చేశావ్. తల్లిలాంటి సుమిత్ర అత్త అలా అపార్థం చేసుకునేలా చేశావని కార్తీక్ అంటాడు.
సరే జ్యోత్స్న మీద కన్నేసి ఉంచు. తను రాగానే నాకు చెప్పు అని కార్తీక్ అంటాడు. అలాగేరా మనమందరం కలిస్తే దాని బెండు తీయొచ్చు అని పారు అంటుంది. కార్తీక్, పారు చేతులు కలుపుతారు. దీప నువ్వు కూడా కలుపు అమ్మ. మన ముగ్గురం ఒక్కటే అని పారిజాతం అంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.